Search
  • Follow NativePlanet
Share
» »పురాతన గోవా - ఆకర్షణీయ ప్రదేశాలు !

పురాతన గోవా - ఆకర్షణీయ ప్రదేశాలు !

By Mohammad

వెల్హా గోవా అంటే మీకు అర్థం కాదు గానీ సింపుల్ గా పురాతన గోవా అని పిలుస్తాను లెండి. అప్పట్లో పోర్చుగీసు వారు గోవా ను ఆక్రమించుకొని పరిపాలించేటప్పుడు ఈ పురాతన గోవా రాజధానిగా ఉండేది. స్థానికులు ఈ ప్రదేశాన్ని వెల్హా గోవా గా పిలిచేవారు. ఇది పనాజీ నగరానికి ఉత్తర దిక్కున 10 కి. మీ ల దూరంలో ఉన్నది.

ఇది కూడా చదవండి : గోవా .. నీ అందం అదరహో !

పురాతన గోవా లో పర్యాటకులు గమనించేవి చర్చీలు. ఆ .. ఆ వినోద కార్యక్రమాల విషయమే కదా ..! అక్కడికే వస్తున్నాను. కారంబోలిం సరస్సు అద్భుతంగా ఉంటుంది మరియు అక్కడికి వచ్చే వలస పక్షులను చూస్తూ ఆనందించవచ్చు. ఇంకా చెప్పవలసినవి, చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూడవలసిన కొన్ని ముఖ్యమైన వాటికెళ్లి ఒక లుక్ వేస్తే ..

బసిలికా అఫ్ బామ్ జీసస్

బసిలికా అఫ్ బామ్ జీసస్

బసిలికా అఫ్ బామ్ జీసస్ చర్చి ప్రపంచవ్యాప్త పర్యాటకులను, యాత్రికులను ఆకర్షిస్తున్నది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఫాదర్ క్రైస్తవ మతాన్ని ఈ ప్రాంతంలో విస్తరింపజేశాడు. అప్పట్లో ఈ ప్రాంతంలో అంటువ్యాధులు, రోగాల బారిన పడిన ప్రజలకు చర్చి లో ఆశ్రయం ఇచ్చి రోగాలు నివారించడంలో ప్రత్యేక శ్రద్ద వహించాడు.

చిత్ర కృప : Amit Rawat

బసిలికా అఫ్ బామ్ జీసస్

బసిలికా అఫ్ బామ్ జీసస్

చర్చి లోపల యాత్రికులు ప్రార్థనలు చేసుకోవటానికి పెద్ద హాలు ఉన్నది. చర్చి లోపలి భాగంలోని శిల్ప సంపదలు ఫ్రాన్సిస్ జేవియర్ జీవితం, ఆనాటి క్రైస్తవ మత అంశాల గురించి ఎన్నో విషయాలను అందిస్తాయి. చర్చి ఆవరణలోనే మరో చిన్న సైజు చర్చి ఒకటి ఉన్నది. దానిని ప్రొఫెన్డ్ హౌస్ అని అంటారు.

చిత్ర కృప : John Meckley

సెయింట్ అగస్టైన్ చర్చి

సెయింట్ అగస్టైన్ చర్చి

ఆనాటి కాలంలో సెయింట్ అగస్టేన్ చర్చి అపుడు ఉన్న చర్చిలలో కెల్లా పెద్ద చర్చిగా పరిగణించబడేది. ప్రస్తుతం ఈ చర్చి 46 మీటర్ల ఎత్తు కలిగి పురాతన గోవాలోని ఒక పవిత్ర కొండగా పిలువబడే ప్రదేశంలో ఎంతో పవిత్రంగా నిలచి, శిల్ప కళా వైభవం కారణంగా నేటికీ యాత్రికుల చేత ఆకర్షించబడుతున్నది.

చిత్ర కృప : Leo Koolhoven

సెయింట్ కాజేటాన్ చర్చి

సెయింట్ కాజేటాన్ చర్చి

సెయింట్ కాజేటాన్ చర్చి ని ఎంతో అందమైన చర్చి గా పరిగనిస్తారు స్థానికులు. ఈ చర్చి ని చూసే యూరోపియన్ దేశస్తులు తప్పక వారి దేశంలోని చర్చి లతో పోల్చి చూస్తారు. దీనికి కారణం కోరిందియన్ మరియు గోత్ శిల్ప కళా నైపుణ్యం అనే చెప్పాలి. చర్చి కి ఎడమవైపున పీఠాలు, కుడివైపున పెద్ద పెద్ద స్తంభాలు మరియు చర్చి లోపల బయట గోపురాలు అద్భుతంగా కనపడతాయి.

చిత్ర కృప : Amit Rawat

డైవర్ ద్వీపం

డైవర్ ద్వీపం

డైవర్ ద్వీపం పచ్చని పంట పొలాలకు, ప్రకృతి అందాలకు పేరుగాంచినది. ఈ ద్వీపం పనాజికి బోటు మార్గంలో కలుపబడింది. ఈ ద్వీపాన్ని బొండేరం లేదా పోటేకర్ పండుగలలో సందర్శించాలి. ఆ సమయంలో చక్కటి సంగీతాలు, పేరేడ్లు, రంగు రంగుల దుస్తుల ప్రజలు కనపడతారు.

చిత్ర కృప : Joegoauk Goa

కారంబోలిం సరస్సు

కారంబోలిం సరస్సు

పర్యాటకులు కారంబోలిం సరస్సు, అక్కడకు వచ్చే వలస పక్షులను ఆనందించవచ్చు. ఎన్నో రకాల పక్షులు వివిధ రంగులలో మీకు కన్నులకు విందు చేస్తాయి. దశాబ్దాలనుండి అవి ఆ ప్రదేశాలకు వలసలు వస్తుంటాయి.

చిత్ర కృప : William Hart

వైస్ రాయ్ ఆర్చి

వైస్ రాయ్ ఆర్చి

సముద్ర మార్గాలు కనిపెట్టిన వాస్కోడిగామా విజయాలకు చిహ్నంగా 16వ శతాబ్దంలో నిర్మించిన వైస్ రాయ్ ఆర్చి కట్టడాన్ని తప్పక చూడాలి. ఇది పురాతన గోవాకు గేట్ వేగా ఉంటుంది.

చిత్ర కృప : Joegoauk Oldgoa

ఇంకా చూడవలసినవి

ఇంకా చూడవలసినవి

మ్యూజియం అఫ్ క్రిస్టియన్ ఆర్ట్, చాపెల్ అఫ్ సెయింట్ క్యాథరిన్, చర్చ్ అఫ్ లేడీ అఫ్ రోసరి , అర్కియాలాజికల్ మ్యూజియం మరియు పోర్ట్రైట్ గాలరీ, పిలర్ సెమినరి మ్యూజియం, సౌండ్ అండ్ లైట్ గాలరీ మ్యూజియం.

చిత్ర కృప : dutta mangang

పురాతన గోవా ఎలా చేరుకోవాలి ?

పురాతన గోవా ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

దక్షిణ గోవా లోని డబోలిం అంతర్జాతీయ విమానాశ్రయం పురాతన గోవాకు సమీపాన ఉన్న విమానాశ్రయం. దేశ, విదేశాల నుండి విమానాలు ఇక్కడికి వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి ఓల్డ్ గోవా చేరుకోవచ్చు

రైలు మార్గం

గోవాలో అంతర్గతంగా రెండు మాడు ప్రధాన రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. వాస్కోడిగామా, మార్గోవా అందులో ప్రదానమైనవి. కర్మలి రైల్వే స్టేషన్ (3 కి.మీ) కూడా ప్రధానమైనదే. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఈ రైల్వే స్టేషన్ ల మీదుగా రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.

చిత్ర కృప : yeahwotever

పురాతన గోవా ఎలా చేరుకోవాలి ?

పురాతన గోవా ఎలా చేరుకోవాలి ?

రోడ్డు / బస్సు మార్గం

ముంబై, పూణే, బెంగళూరు, మంగళూరు,హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుండి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి

లోకల్ సదుపాయాలు

పురాతన గోవా చేరటం తేలికే క్యాబ్ లు లేదా రిక్షాలు లభ్యంగా ఉంటాయి. అయితే, మీరు కనుక ఒక బైక్ వంటిది కలిగి ఉంటే, పురాతన గోవాలోని ఆసక్తికల వివిధ రకాల నిర్మాణాలను సందర్శించవచ్చు. లోకల్ బస్సులు అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : Mikko Leino

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X