Search
  • Follow NativePlanet
Share
» »దుర్యోధనుడి ఆలయం సందర్శనతో భూ స్వామి మీరే...

దుర్యోధనుడి ఆలయం సందర్శనతో భూ స్వామి మీరే...

కేరళలోని దుర్యోధనుడి దేవాలయానికి సంబంధించిన కథనం.

By Kishore

మహాభారత యుద్ధం జరగడానికి దుర్యోధనుడే ప్రధాన కారణమని చాలా మంది నమ్ముతున్నారు. ఆయన్ను దుష్టత్వానికి ప్రతీకగా భావిస్తారు. అటువంటి ధుర్యోధనుడికి కూడ ఆలయాలు భారత దేశంలోని పలు చోట్ల ఉన్నాయి. అయితే దక్షిణ భారత దేశంలో దుర్యోధనుడికి కేవలం ఒకే చోట మాత్రమే దేవాలయం ఉంది. కేరళలోని కొల్లం జిల్లాలో పోరువళి అనే గ్రామం లో ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శించుకొంటే సాధ్యమైనంత త్వరలో పెద్ద మొత్తంలో భూమిని కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. అందువల్లే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఈ దేవాలయాన్ని తరుచుగా సందర్శిస్తుంటారు. ఈ దేవాలయం చుట్టు పక్కల ఉన్న 100 ఎకరాలు ఇప్పటికీ దుర్యోధనుడి పేరు పైనే ఉన్నట్లు స్థానిక ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు మీ కోసం...

గొట్టుకు పోయిన వస్తువులు, తప్పి పోయిన కుటుంబ సభ్యులను మీ చెంతకు చేర్చే అమ్మవారుగొట్టుకు పోయిన వస్తువులు, తప్పి పోయిన కుటుంబ సభ్యులను మీ చెంతకు చేర్చే అమ్మవారు

1. మలనాడ

1. మలనాడ

P.C:You Tube

కోరళలోని కొల్లం జిల్లాలో పోరువళి అనే చిన్న గ్రామం ఉంది. అక్కడి కొండ మీద దుర్యోధనుడి ఆలయం ఉంది. ఆ కొండని మలనాడ అని పిలుస్తారు. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం.

2. మాయాజూదంలో

2. మాయాజూదంలో

P.C:You Tube

శకుని పన్నిన మాయా జూదంలో ఓడి పోయిన పాండవులు 12 ఏళ్లు వనవాసం, ఏడాది అజ్జాత వాసం చేయాల్సి వస్తుంది. 12 ఏళ్లు ఇట్టే గడిచిపోతాయి.

3. అజ్జాత వాసం

3. అజ్జాత వాసం

P.C:You Tube

మరో ఏడాది అజ్జాత వాసం అంటే ఎవరికీ తెలియకుండా జీవితాన్ని గడపడం అని అర్థం. ఇందు కోసం వారు విరాట రాజ్యాన్ని చేరుకొంటారు.

4. వేగులను పంపిస్తాడు

4. వేగులను పంపిస్తాడు

P.C:You Tube

దుర్యోధనుడు పాండవుల జాడ కనుగొనడానికి తన వేగులను దేశం నలుమూలలకు పంపిస్తాడు. అయితే వారు పాండవుల జాడను కనుగొనలేకపోతారు. దీంతో దుర్యోధనుడికి చాలా అసహనం కలుగుతుంది.

5. మరలా 12 ఏళ్లు

5. మరలా 12 ఏళ్లు

P.C:You Tube

పాండువలను కనుగొంటే వారిని మరో 12 ఏళ్లపాటు అరణ్యవాసానికి పంపించవచ్చు. దీంతో దుర్యధనుడు నేరుగా పాండవుల జాడను కనుగొనడానికి హస్తినాపురం నుంచి బయలుదేరుతాడు.

6. మలనాడ చేరుకొంటాడు

6. మలనాడ చేరుకొంటాడు

P.C:You Tube

ఇలా పాండవులను కనుగొనే క్రమంలో దేశంలోని చాలా ప్రాంతాలను తిరిగి మలనాడ ఉన్న ప్రదేశానికి చేరుకొంటాడు. అక్కడ దుర్యోధనుడికి విపరీతమైన ఆకలి, దాహం వేస్తుంది. అక్కడ తన దాహాన్ని తీర్చేవారి కోసం అంతటి రాజు ఎదురుచూస్తూ ఉంటాడు.

7. కల్లును ఇస్తుంది

7. కల్లును ఇస్తుంది

P.C:You Tube

దుర్యోధనుడి బాధను గమనించిన ఓ వ`ద్ధురాలు తన దగ్గర ఉన్న కల్లును దుర్యోధనుడికి ఇస్తుంది. ఆబగా ఆ కల్లును దుర్యోధనుడు తాగేస్తాడు. అటు పై ఆ వ`ద్ధురాలు తన వద్ద ఉన్న ఆహారాన్ని దుర్యోధనుడికి ఇచ్చి అతని ఆకలిని తీరుస్తుంది. దీంతో దుర్యోధనుడు మిక్కిలి సంతోషపడుతాడు.

8. పరమేశ్వుడిని ప్రార్థిస్తాడు

8. పరమేశ్వుడిని ప్రార్థిస్తాడు

P.C:You Tube

దీంతో కొండపైకి చేరుకొని ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాలని పరమేశ్వరుడిని ప్రార్థించాడు. అంతే కాకుండా ముందుకు వెలుతూ ఓ వంద ఎకరాల స్థలాన్ని ఆ ప్రాంత వాసులకు దానం చేస్తాడు.

9. దుర్యోధనుడికి ఆలయం నిర్మిస్తాడు

9. దుర్యోధనుడికి ఆలయం నిర్మిస్తాడు

P.C:You Tube

దీంతో ఆ ప్రాంత వాసులు మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తాడు. అటు పై ఆ పర్వతం పై దుర్యోధనుడికి ఓ ఆలయాన్ని నిర్మించారు. అయితే అందులో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు.

10. ఎత్తైన వేదిక

10. ఎత్తైన వేదిక

P.C:You Tube

గుడిలో ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే మనకు కనిపిస్తుంది. భక్తులు ఇక్కడికి చేరుకొన్న తర్వాత దుర్యోధనుడిని ఊహించుకొంటూ నమస్కారం చేసుకొంటారు.

11. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు

11. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు

P.C:You Tube

ఈ దేవాలయాన్ని సందర్శించుకొంటే సాధ్యమైనంత త్వరలో పెద్ద మొత్తంలో భూమిని కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. అందువల్లే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఈ దేవాలయాన్ని తరుచుగా సందర్శిస్తుంటారు.

12 ప్రభుత్వ రికార్డులో

12 ప్రభుత్వ రికార్డులో

P.C:You Tube

ఇదిలా ఉండగా ఆ ప్రదేశం స్థానిక ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికీ దుర్యోధనుడి పేరు మీదే ఉందని చెబుతారు.

13. కెట్టుకజ ఉత్సవం

13. కెట్టుకజ ఉత్సవం

P.C:You Tube

ఇక్కడ మార్చిలో జరిగే కెట్టుకజ ఉత్సవానికి కేరళ నుంచే కాకుండా చుట్టు పక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు.

14. 70 నుంచి ఎనభై అడుగులు

14. 70 నుంచి ఎనభై అడుగులు

P.C:You Tube

ఈ ఉత్సవంలో దాదాపు 70 నుంచి 80 అడుగుల ఎతైన తొట్టెలు చేసి భక్తులు భుజాన ధరించి దేవాలయం చుట్టూ తిరుగుతారు. ముఖ్యంగా కోరికలు తీరిన వారు ఈ తొట్టెలు మోసి తమ ముడుపును చెల్లించుకొంటారు.

15. ఎలా వెళ్లాలి

15. ఎలా వెళ్లాలి

P.C:You Tube

కేరళలో ముఖ్యపట్టణమైన అడోర్ నుంచి ఈ దేవాలయం కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X