Search
  • Follow NativePlanet
Share
» »అయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకొన్న దేవత ఉన్న క్షేత్రం తెలుసా

అయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకొన్న దేవత ఉన్న క్షేత్రం తెలుసా

అయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకొన్న దేవత ఉన్న క్షేత్రం గురించి కథనం

ప్రస్తుతం కొద్ది రోజులుగా మీడియా మొత్తం శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం గురించే చర్చ.. మహిళలకు కూడా అయ్యప్పస్వామి దేవాలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పడమే ఇందుకు కారణం. దీంతో ఇన్ని రోజులుగా మహిళలకు ప్రవేశం నిషిద్దమైన శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి మహిళలు కూడా వెళ్లవచ్చు.. అయప్ప బ్రహ్మచారి కాబట్టే రుతుస్రావం ప్రతి నెల వచ్చే మహిళలకు దేవాలయంలోకి ప్రవేశం నిశిద్దమని చెబుతారు. ఇదిలా ఉండగా సదరు బ్రహ్మచారి అయిన అయప్పను వివాహం చేసుకోవాలని ఒక దేవత చాలా కాలంగా వేచి చూస్తోంది. ఆమెకు కూడా ఒక చిన్న దేవాలయం కూడా ఉంది. ఆ దేవత ఎవరు? ఆ దేవాలయం ఎక్కడ ఉంది తదితర వివరాలు మీ కోసం....

శబరిమల

శబరిమల

బ్రహ్మచారి అయిన మణికంఠుడిని వివాహం చేసుకోవాలనుకొన్నది మల్లికాపురథమ్మ. ఆమెకు సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది. పందల రాజు తనకు దొరికిన అయ్యప్పను కలరి విద్య నేర్చుకోవడం కోసం ఓ విద్యాలయంలో శిష్యునిగా చేరుస్తాడు.

శబరిమల

శబరిమల

ఆ గురుకులం గురువు కుమార్తే లిలా అయప్పను ప్రేమించడం మొదలుపెడుతుంది. అయితే బ్రహ్మచర్యంలో ఉన్న అయ్యప్పస్వామి ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. అయితే ఎప్పుడైతే శబరిమలెకు కన్నెస్వాముల రాక ఉండదో ఆ రోజు ఆమెను పెళ్లి చేసుకొంటానని మాట ఇస్తాడు.

శబరిమల

శబరిమల


ఇదిలా ఉండగా మల్లికాపురథమ్మకు సంబంధించిన మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మహిషి అనే రాక్షసిని సంహరించిన అనంతరం ఒక అందమైన మహిళ ఆ శరీరం నుంచి బయటికి వస్తుంది. ఆమె అయప్పను చూసిన తర్వాత తనను వివాహం చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తుంది.

శబరిమల

శబరిమల

అయితే తాను బ్రహ్మచర్యంలో ఉన్నానని అందువల్ల ఇప్పుడు వివాహం చేసుకోలేనని చెబుతుడు. అయితే ఎప్పుడైతే తన కొండకు కన్యస్వాములు రాకుండా పోతారో అప్పుడు వివాహం చేసుకొంటానని చెబతాడు.

శబరిమల

శబరిమల

దీంతో ఆ దేవత కన్యస్వాములు వస్తున్నారో రారో చూడటం కోసం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం పక్కనే మల్లికాపురథమ్మ పేరుతో వెలిసిందని చెబుతారు. ఈ ఆలయన్ని మనం చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X