Search
  • Follow NativePlanet
Share
» »ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

శ్రీశైల శిఖరానికి సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishore

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం కూడా ఒకటి. ఈ ఆలయం ప్రస్తావన పురాణ కాలం నుంచి కూడా ఉంది. ఈ ఆలయంలోని ప్రధాన మూర్తి అయిన మల్లికార్జునుడికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ ఆలయ శిఖరానికి కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందు కంటే ఈ ఆలయ శిఖరాన్ని దర్శించి మోక్షం పొందాలని భావిస్తూ దేశలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయుల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు.

1,300 ఏళ్లుగా భా...రీ విగ్రహం నీటి పై అలాగే1,300 ఏళ్లుగా భా...రీ విగ్రహం నీటి పై అలాగే

తాజ్ మహాల్ 'తోబుట్టువు'లను చూశారాతాజ్ మహాల్ 'తోబుట్టువు'లను చూశారా

ఇక్కడ దిగంబర రూపానికి బంగారు, వెండి పుష్పాలతో పూజలుఇక్కడ దిగంబర రూపానికి బంగారు, వెండి పుష్పాలతో పూజలు

ఈ ఆలయ శిఖరాన్ని ఒక ప్రత్యేక ప్రాంతం నుంచి చూసి తరించాలని చాలా ఏళ్లుగా దేవుడిని ప్రార్థిస్తుంటారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ శిఖరంతో పాటు ఆలయం ప్రధాన్యతను చెప్పడమే ఈ కథనం ప్రధాన ఉద్దేశం. అంతే కాకుండా శ్రీశైలం చుట్టు పక్కల గల పర్యాటక ప్రాంతాలను కూడా ఈ కథనంలో తెలుసుకుందా.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

1. ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

Image source:

శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

2. అరుణాసురుడనే రాక్షసరాజు

Image source:

పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతీ భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

3. ఆయన ఉపాయం వల్ల

Image source:

తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

4. అనేక పేర్లు...

Image source:

శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీశైలము మొదలైన నామాతరాలున్నాయి. శ్రీ అనగా సంపద, శైలమంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని అర్థం. దీనికి శ్రీకైలాసం అనే పేరుతో వ్యవహారం వుండడమూ ఉంది. క్రీ.శ.1313లోని ఒక శాశనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరూ ఉన్నట్టు తెలుస్తోంది. దానిలో మహేశ్వరులు శ్రీకైలాసము (శ్రీశైలం) పైన నివసించారని ఉంది.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

5. పాపాలు తొలిగి పోతాయి....

Image source:

శ్రీశైలంలో దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

6. స్వామి వారి గుడి

Image source:

శ్రీమల్లికార్జునుని దేవాలయము: అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. అయినా దేవాలయం లోపలికి వెళ్లిన వెంటనే ఒక విధమైన భక్తిభావం కలుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

7. అమ్మవారి గుడి

Image source:

భ్రమరాంబిక అమ్మవారి గుడి.: భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయములో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినవస్తుంది. ఇక్కడికి వెళ్లిన వారు తప్పక ఆ బ్రమరనాధం వింటారు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

8. మనోహర గుండము

Image source:

శ్రీశైలములో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉంది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయ వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

9. ముడుతలు పడిన శివలింగం

Image source:

పంచ పాండవులు దేవాలయాలు: పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్టించారని చెబుతారు. వృద్ద మల్లికార్జున లింగము: ఇది ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. ఇది చూస్తే అంత అందముగా ఉండదు. బహుశా ముసలితనాన్ని గుర్తు చేస్తుంది. అయినా భక్తులు ఈ లింగాన్ని దర్శించడానికి ఆ సక్తి చూపుతారు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

10. పాతాళ గంగ

Image source:

శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

11. పటిష్ట కట్టడాలు

Image source:

ఇక్ష్వాకులు, పల్లవులు, విస్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

12. సాహిత్యాధారాలు

Image source:

తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. క్రీ.శ.6, 7 శాతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంతం తేవరంలో అస్పర్, సుందర్, నమ్మందర్ అనే పేర్లున్న భక్తకవులు శ్రీశైలాన్ని గురించి గానం చేశారు. తిరుప్పాపురం (శ్రీపర్వతం) అని పేర్కొన్నారు. క్రీ.శ.14వ శతాబ్దం నాటి శైవకవియైన పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో కరమొప్పు దక్షిణ కైలాసము అంటూ శ్రీశైలాన్ని కీర్తించారు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

13. కాశీయాత్ర చరిత్రలో...

Image source:

తెలుగు సాహిత్యంలో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన కాశీయాత్ర చరిత్రలో శ్రీశైలం 1830ల నాడు ఎలా ఉందన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్నపట్టణం నుంచి కాశీకి యాత్రగా వెళ్ళిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఆ ఏడాది జూన్ 16 నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన వ్రాసిన దాని ప్రకారం 1830ల్లో ఈ ప్రాంతం కందనూరు నవాబు అధీనంలో ఉండేది. శ్రీశైలం కొండమీద వాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడమూ, క్రూరమృగాల భీతి ఉండడంతో ఈ ఆలయాల అర్చకులు, కందనూరు నవాబు తరఫున యాత్రికుల నుంచి హశ్సీలు అంటే సొమ్ము తీసుకునేవారని తెలుస్తుంది.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

15. రోప్ వే

Image source:

2004లో పాతాళగంగకు వెళ్ళుటకు రోప్ వే ఏర్పాటు చేయబడింది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి. చుట్టూ ఉన్న సహజ అందాలను చూస్తూ రోప్ వే మార్గం ద్వారా పైకి వెళ్లడం మరిచిపోలేని అనుభూతి. ఇటు ఆధ్యాత్మికతతో పాటు మనసుకు ఆహ్లాదం కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

16. సాక్షి గణపతి ఆలయము

Image source:

ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని.ఇతనిని సాక్షి గణపతి అంటారు. అందువల్లే శ్రీశైలాన్ని దర్శించుకున్న వారు ఈ సాక్షి గణపతి ఆలయానికి తప్పకుండా వెలుతారు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

17. శ్రీశైల శిఖరం

Image source:

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు. అందువల్లే తాము చనిపోతామని తెలిసినా చాలా మంది ఈ శిఖరాన్ని చూడటానికి ఉత్సుకత చూపుతారు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

18. పాలధార-పంచధారలు

Image source:

శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటకేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులుల నుండి పంచధార (ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కథార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకథార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

19. శివాజీ సాంసృతిక,స్మారక భవనం.

Image source:

శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకొన్న ఘనుడు.అతని పేరున ఇక్కడ ఒక భవనం ఉంది. దీనికి శివాజీ సాంస్కృతిక, స్మారక భవనమని పేరు అతడి జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన కొరకు భవనంలోని మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహము కొరకు రెండవ అంతస్తును కేటాయించారు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

20. హటకేశ్వరం

Image source:

హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైలమల్లికార్జునదేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది. ఈ పరిశరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివసించారు. పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

21.కదళీవనము

Image source:

శ్రీ దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలో జన్మించి నర్సోబవాడాలోను, కర్ణాటకలోని గాణాగాపురంలోనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి. అందువల్లే ఈ పుణ్యక్షేత్రానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాకట, మహారాష్ర్ట నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

22. వసతి

Image source:

శ్రీ శైలంలో వసతిగా దేవస్థానమువారి సత్రములు, అతి పెద్ద కాటేజీలు, హొటల్స్ ఉన్నాయి. ఆంధ్రదేశములో ఎక్కడా లేని విధంగా కులప్రాతిపదికగా ఎవరికి వారుగా ప్రతి కులపువారికీ ఒక సత్రం నిర్వహింపబడుతున్నది. శివరాత్రి పర్వదినములు, కార్తీకమాసమునందు తప్ప మిగిలిన రోజులలో ఏసత్రములోనైనా ఎవరికైనా వసతి లభించును. ఈ సత్రములే కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రముల, ప్రైవేటువారి సత్రములతోనూ శ్రీశైలం భక్తజనులతో కళకళలాడుతుంటుంది.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

23. శ్రీశైలం-రవాణా సౌకర్యాలు రోడ్డు మార్గములు

Image source:

హైదరాబాదు నుండి శ్రీశైలం 212 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి. గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా బాగుంటుంది.

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

ఈ శిఖరం చూస్తే త్వరలో మరణమని తెలిసినా చాలా మంది

24. రైలు, విమానయాన సేవలు

Image source:

భారతదేశములో ఏవైపునుండి అయినా గుంటూరు మీదుగా నరసరావుపేట వరకూ రైలు సౌకర్యములు కలవు. హైదరాబాద్ నుండి విజయవాడ లేదా గుంటూరు వరకూ మైనర్ ఎయిర్ పోర్టులద్వారా చేరుకొని అటుపై ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల ద్వారా శ్రీశైలం చేరుకోవచ్చు. శ్రీశైలంలో మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల సంప్రదాయాలతో పాటు కన్నడ, మహారాష్ట్ర సంప్రదాయాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X