Search
  • Follow NativePlanet
Share
» »మనాలి అందాలు - మహిళా మోజులు!

మనాలి అందాలు - మహిళా మోజులు!

నేటి రోజులలో వివాహం అవటం ఆలస్యం కొత్త జంటలు హనీ మూన్ ప్లాన్ చేయటం వారి వారి అనుకూలం మేరకు ఒకటి లేదా రెండు వారాలు ఆనందిన్చేసి రావటం అలవాటైంది. ఈ కొత్త జంటల హనీ మూన్ కు అనేక ప్రదేశాలు కలవు. అయితే, ఎన్ని సార్లు చూసినా మరో సారి చూడాలనిపించే ప్రదేశం మనాలి. ప్రత్యేకించి మహిళలు ఈ ప్రదేశ అందాలకు ముగ్ధులై మరపు రాని పర్యాటక అనుభవాలను మూటకట్టుకొని రెట్టింపు ఉత్సాహంతో తమ వివాహ జీవితాలు మొదలు పెదతారనటం లో ఎట్టి సందేహంలేదు. మరి మనాలి లో ఒకటికి రెండు సార్లు చూసినా మీలో ఉత్సాహం పెరిగే ఆకర్షణీయ ప్రదేశాలు ఏమిటో చూడండి.

మనాలి అందాలు - మహిళా మోజులు!

చారిత్రక స్మారక చిహ్నాలు

ఓల్డ్ మనాలి
పురాతన మనాలి పట్టణం పర్యాటకులకు అద్భుత దృశ్యాలను చూపుతుంది. నిర్మలంగా వుండే ఈ పట్టాన భాగం హమాచల ప్రదేశ్లోని అతి సుందరమైన, పురాతన నిర్మాణ శీలి కలిగి వివిధ చెక్క పనితనాలు కలిగిన నివాసాలను చూపుతుంది. పర్యాటకులు అధికంగా వచ్చే ఆరు నెలల సీజన్లో చాలా ఇండ్లు వారికి ఆతిధ్యం ఇచ్చేందుకు తెరువబడతాయి. ఈ ఇండ్లు మరల సీజన్ ముగిస్తే, అంటే మూసి వేయబడతాయి. ఇంటికి మీరు వెళ్ళేటపుడు స్థానిక తాజా బటర్, చీస్, జాములు, సాంప్రదాయ హస్త కళల వస్తువులు తీసుకు వెళ్ళటం మరువకండి.

హిడింబ టెంపుల్
హిడింబ దేవి మహాభారతంలోని పంచ పాండవులలో ఒకడైన భీముడి భార్య. ఈమె గౌరవార్ధం 1533 లో ఇక్కడ ఒక గుడి నిర్మించారు. నాలుగు అంతస్తులు కల ఈ చెక్క టెంపుల్ దట్టమైన వృక్ష సంపద కల దున్గ్రి పార్క్ మధ్యగా కలదు. చక్కని పని తనంతో చెక్కబడిన అనేక హిందూ దేవతల బొమ్మల ఈ గుడి లోపల ప్రధాన భాగంలో ప్రధాన దేవత హిడింబ యొక్క ఇత్తడి విగ్రహం వుంటుంది. ఈ దేవాలయం చూడటానికి మే నెల అనుకూలం. ఆ సమయంలో ఈ దేవతకు ఉత్సవాలు నిర్వహించి, స్థానికులు కొంతమంది ఘనమైన బలులు కూడా ఇస్తారు.

మనాలి అందాలు - మహిళా మోజులు!

గదన్ తెక్ చొక్లింగ గొంప
ఇది టిబెటన్ ల బౌద్ధ ఆరామం. దీనిని 1969 లో టిబెటన్ లు నిర్మించుకున్నారు. దీనిలో గోడలపై అనేక బొమ్మలు, రూఫ్ అంతా పచ్చటి పగోడా ఆకారం వుంటాయి. ప్రవేశంలోనే ఒక పెద్ద రాతి పలక వుంటుంది. దానిపై 1980 లలో చైనీయుల దాడిలో మరణించిన టిబెటన్ ల పేర్లు వుంటాయి. దీపాలతో వెలిగిపోయే దీనిలోని ప్రార్థనా హాలు లో శాక్యముని బుద్ధ విగ్రహం వుంటుంది. మనాలి లో తప్పక చూడవలసిన పర్యాటక ఆకర్షనలలో ఇది ఒకటి.

వశిస్ట్
వసిష్ఠ అనే ఈ గ్రామం, మనాలి కి మూడు కి. మీ. ల దూరంలో వుంటుంది. ఇక్కడ కల సల్ఫర్ నీటి బుగ్గలు ప్రసిద్ధి. రామాయణంలోని లక్ష్మనాడు తన బాణం భూమిలోకి వేసి ఈ నీరు పైకి తెప్పించాడని చెపుతారు. నేడు హిమాచల టూరిజం శాఖ ఇక్కడ ఒక స్నానపు కాంప్లెక్స్ ఒకటి పర్యాటకులకు నిర్వహిస్తోంది. ఈ సహజ నీటి బుగ్గలో మీరు 30 నిమిషాలపాటు జలకాలు ఆడవచ్చు. ఈ విలేజ్ లో శ్రీరాముడికి ఒక టెంపుల్ మరియు వారి గురువు అయిన వసిష్టుడికి ఒక టెంపుల్ నిర్మించారు.

మ్యూజియం
ఇక్కడ కల మ్యూజియం లో హిమాచల సంస్కృతి, జానపదుల కళలు చూడవచ్చు. పురాతన కాలంలో హిమాచల ప్రజలు ఉపయోగించిన అనేక సాంప్రదాయ దుస్తులు, జువెలరీ, పాత్రలు, చెక్క వస్తువులు, చూడవచ్చు. ఈ పర్వత ప్రజల సంస్కృతి, ఆర్ట్, హిస్టరీ లోకి తొంగి చూసేందుకు దీని సందర్శన ఒక గొప్ప అవకాశం.

మనాలి అందాలు - మహిళా మోజులు!
మనాలి లో షాపింగ్
పుస్తకాల పురుగులా ? మీరు బుక్స్ కొనాలనుకుంటే, ఒక షాపు పోస్ట్ ఆఫీస్ వద్ద మరొకటి మార్కెట్ లో కలవు. ఇక్కడ మీకు దేశి మరియు అంతర్జాతీయ రచయితల పుస్తకాలు వివిధ అంశాలపై దొరుకుతాయి.
హిం కాంప్
హిమ్కాప్ లో స్థానికంగా చయారు చేయబడిన అరుదైన ఉత్పత్తులు అప్రికాట్ ఆయిల్, ఆపిల్ సాస్, ఆర్గానిక్ జ్యూస్ లు, హనీ, జాములు, ఎందు ఫలాలు, పచ్చళ్ళు, లభిస్తాయి. ఇంకనూ పూజకు కావలసిన గంధం చెక్కలు ఇతర వస్తువులు కూడా లభిస్తాయి.

మనాలి ఎపుడు సందర్సించాలి ?
ఏప్రిల్ నుండి జూన్ వరకు ఆకాశం నిర్మలంగా వుంటుంది. హిమాలయా పర్వత శ్రేణులలోని ఈ పట్టణానికి వేసవి నెలలు అనుకూలం. అయినప్పటికీ అక్టోబర్ న్లుంది నవంబర్ వరకూ కూడా సందర్శ్లన చేయవచ్చు. మీరు కనుక వింటర్ ఇష్టపై చల్లని, లేదా సబ్ జీరో ఉష్ణోగ్రతలు ఆనందిన్చావారు, వింటర్ క్రీడలు అయిన స్నో బోర్డింగ్, హెలి స్కై ఇంగ్, వంటివి చేయ గలిగిన వారైతే, డిసెంబర్ నుండి మార్చ్ వరకూ బాగుంటుంది. ట్రెక్కింగ్ సీజన్లో ఇక్కడ సెప్టెంబర్ మధ్యలో మొదలై, అక్టోబర్ మధ్య భాగంవరకూ వుంటుంది. వర్షా కాలపు నెలలు అయిన జూలై నుండి ఆగుస్ట్ వరకూ ఒక విభిన్న అనుభూతి వుంటుంది. అయితే, ఈ కాలంలో చోటుచేసుకునే ల్యాండ్ స్లయిడ్ లేదా కొండ చరియలు విరిగి పడే కారణంగా ఈ సమయం సూచించ దగినది కాదు.

ఎలా వెళ్ళాలి ?
దేశంలోని ప్రధాన పట్టణాల నుండి అంటే, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, కోల్కత్త మొదలైన పట్టణాలనుండి మనాలి కి రైళ్ళు, బుఅస్ లు, విమాన ప్రయాణ సౌకర్యం కలదు.

ఉల్లాసమూ, ఉత్తేజమూ కలిగించే ట్రావెల్ ఆర్టికల్స్ అందిస్తున్న నేటివ్ ప్లానెట్ ... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని కధనాలు అందిస్తోంది. మీ పర్యటనా అనుభవాలు (500 మాటలకు తగ్గకుండా), సంబంధిత ఫోటోలు e-mail [email protected] లేదా [email protected] లకు పంపండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X