Search
  • Follow NativePlanet
Share
» »టైగర్ ఆఫ్ మైసూర్: టిప్పు సుల్తాన్ నిర్మించిన ఈ నక్షత్రాకారపు కోట ఎక్కడ ఉందో తెలుసా?

టైగర్ ఆఫ్ మైసూర్: టిప్పు సుల్తాన్ నిర్మించిన ఈ నక్షత్రాకారపు కోట ఎక్కడ ఉందో తెలుసా?

టైగర్ ఆఫ్ మైసూర్: టిప్పు సుల్తాన్ నిర్మించిన ఈ నక్షత్రాకారపు కోట ఎక్కడ ఉందో తెలుసా?

అద్భుతమైన ప్రకృతి పొగమంచు మద్యన ఆకుపచ్చని ఎత్తైన కొండలు, చిక్కటి కాఫీ తోటలతో పరచుకున్న లోయలతో గుభాళిస్తూ పర్యాటకులను ఆహ్వానిస్తాయి. ఈ రెండింటి మధ్యలో ఉండే సన్నటి ఘాట్‌ రోడ్‌ పై మలుపులు తిరిగే ప్రయాణం మరిచిపోలేని మధురానుభూతిని కలిగిస్తుంది. దట్టమైన అడవులు.. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా అనిపించే ఎత్తైన వృక్ష సంపద.. జలపాతాల హోరు.. కొండల్ని చీల్చుకుంటూ రైలు పట్టాల ఏర్పాటు కోసం తవ్విన గుహలు.. హోరెత్తుతూ నీటి ప్రవాహాలు.. ఇవన్నీ సొంతం చేసుకున్న సకలేష్‌పూర్‌ ప్రకృతి సౌందర్యంలో మరో అద్భుతమైన కట్టడం కనులకు కనువిందు చేస్తుంది. అదే మంజరాబాద్ కోట. ఈ అందమైన పర్యాటక ప్రాంతంలో మంజరాబాద్‌ ఫోర్ట్‌, సకలేశ్‌ పూర్‌ మరో ప్రధాన ఆకర్షణ. ఈ కోటను మైసూర్‌ పాలకుడు టిప్పు సుల్తాన్‌ నిర్మించాడు. ఈ కోట ముస్లిం శిల్ప శైలి కళను ప్రదర్శిస్తుంది. ఈ కోటపై నుండి సముద్ర కోస్తా తీరాలను చూసి ఆనందించవచ్చు..

ఈ కోట విశేషమేంటంటే

ఈ కోట విశేషమేంటంటే

దేశంలో ఎక్కడా లేనట్లు మంజరాబాద్ కోట నక్షత్రాకారంలో ఉంటుంది. దీనిని మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్ నిర్మించాడు. మంజరాబాద్ కోటను చూడటానికి వీకెండ్ లో ఎక్కువ మంది వస్తుంటారు. అనేక యుద్ధాలను చూసిన ఈ కోట పర్యాటక ప్రియులను ఆకర్షిస్తోంది.

బెంగళూరు నుంచి మూడు గంటల ప్రయాణం

బెంగళూరు నుంచి మూడు గంటల ప్రయాణం

బెంగళూరు నుంచి మూడు గంటల ప్రయాణంతో మంజరాబాద్ కోటనుచేరుకోవచ్చు. వీకెండ్ లో ఎక్కువగా ట్రెక్కర్స్ ఇక్కడకు వస్తుంటారు. ఈ కోటను ప్రాచర్యంలోకి తీసుకువరావడానికి స్థానిక కర్నాటక ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నూతన ప్రణాళికలు రచిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే ఈ కోట మరింతగా పర్యాటకులను ఆకర్షిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు.

 నక్షత్రాకారంలో మంజరాబాద్ కోట

నక్షత్రాకారంలో మంజరాబాద్ కోట

ఇండియాలో అనేక కోటలు వివిధ రూపాల్లో మనకు కనువిందుచేస్తాయి. అయితే అత్యంత అరుదుగా ఉండే కోటల జాబితాల్లోకి మంజరాబాద్ కోట చేరుతుంది. ఈ కోట నక్షత్రాకారంలో ఉంటుంది. ఇటువంటి విభిన్న కోటను చూడాలంటే కర్ణాటకాకు వెళ్ళాల్సిందే.

ఇస్లామిక్ వాస్తు శైలిలో నిర్మించిన ఈ కోట

ఇస్లామిక్ వాస్తు శైలిలో నిర్మించిన ఈ కోట

సముద్ర మట్టానికి 3240 అడుగుల ఎత్తులో మంజరాబాద్ కోట నిర్మించారు. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట ఉంటుంది. ఇస్లామిక్ వాస్తు శైలిలో నిర్మించిన ఈ కోట 8 కోనాలను కలిగి ఉంటుంది. అత్యంత సురక్షితమైన ఈ కోటను సైనిక కోటగా నిర్మించాడు. ఈ కోటను చేరుకోవాలంటే దాదాపు 250 మెట్లను ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది.

సకలేశ్వరపురం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో

సకలేశ్వరపురం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో

ఎక్కడ ఉంది?
మంజరాబాద్ కోట బెంగళూరు మంగళూరు హైవే దారిలో వస్తుంది. హాసన్ జిల్లా సకలేశ్వరపురం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోని దోణిగల్ అనే గ్రామానికి సమీపంలోని ఓ గుట్ట పై ఈ నక్షత్రాకారపు కోట ఉంది. ఈ సుందరమైన కోటను మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్ నిర్మించాడు.

నిర్మాణం

నిర్మాణం

ఈ కోట గ్రానైట్ రాయితో నిర్మించబడింది. అనేక గదులు మరియు బావులు ఉన్నాయి. కోట లోపల, వేసవి కాలానికిగాను ప్రత్యేకంగా ఒక గది ఉంది.

స్టార్ ఫోర్ట్ ఆఫ్ ఇండియా

స్టార్ ఫోర్ట్ ఆఫ్ ఇండియా

మంజరాబాద్ కోట ఒక స్టార్ షేప్ ను కలిగి ఉండటం వల్ల ఈ కోటకు "స్టార్ ఫోర్ట్ ఆఫ్ ఇండియా" గా ప్రశంసించారు.

ఎప్పుడు నిర్మించాడు:

ఎప్పుడు నిర్మించాడు:

మంజరాబాద్ కోటను టిప్పు సుల్తాన్ 1785- 1792 మధ్యలో నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో మరాఠాలు మరియు బ్రిటిష్ వారు టిప్పుపై యుద్ధం చేయాలని ప్రణాళిక వేశారు. టిప్పు ఫ్రెంచి వారితో పొత్తు పెట్టుకున్నాడు.

ఈ ప్రత్యేకమైన కోటను నిర్మించటానికి ఫ్రెంచ్ సైనిక దళంలో

ఈ ప్రత్యేకమైన కోటను నిర్మించటానికి ఫ్రెంచ్ సైనిక దళంలో

ఈ ప్రత్యేకమైన కోటను నిర్మించటానికి ఫ్రెంచ్ సైనిక దళంలో కోట వాస్తుశిల్పి సెబాస్టియన్ లే ప్రెస్ట్రె డి వౌబాన్ను సహాయంతో ఈ కోటను అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఈ కోటను ముఖ్యంగా నాల్గవ ఆంగ్లో మైసూరు యుద్ధంలో వినియోగించాడు. శ్రీరంగ పట్టణం పతనం తర్వాత బ్రిటీష్ వారు ఈ కోటను తమ స్వాధీనం చేసుకొన్నారు. అటు పై కొన్ని ముఖ్యమైన భాగాలను ధ్వసం చేశారు.

ఈ కోటలో ఏమిమి చూడవచ్చు :

ఈ కోటలో ఏమిమి చూడవచ్చు :

దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కోటలో నీటి నిల్వకు అవసరమైన చిన్న చెరువు ఉంది. యుద్ధ సమయంలో మందుగుండు నిల్వకు అవసరమైన గదులు, వంటగది, స్నానపు గదులు, శౌచాలయాలు ఉన్నాయి. ఈ కోట నుంచి సొరంగం ఉందని చెబుతారు. ఆ సొరంగం ద్వారా వెళితే నేరుగా శ్రీరంగపట్టణానికి చేరుకోవచ్చుననా చెబుతారు. అయితే ప్రస్తుతం ఈ స్వరంగమార్గాన్ని మూసివేశారు.

సకలేశ్వర దేవాలయం :

సకలేశ్వర దేవాలయం :

ఈ కోట సమీపంలో ఒక పవిత్రమైన దేవాలయం ఉంది. ఆ ఆలయమే సకలేశ్వర దేవాలయం. ఇది ఒక పురాతనమైన శివాలయం. హోయసల వంశస్తులు హోయ్సళ వాస్తు శైలిలలో నిర్మించినట్లు తెలుస్తున్నది. సకలేశ్వరపురంలో ఈ అద్భుతమైన వాస్తు శిల్ప దేవాలయం ప్రధాణ ఆకర్షణగా ఉంది.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

టిప్పు సుల్తాన్ నిర్మించిన భారతదేశంలోని ఏకైక నక్షత్ర కోట హసన్ యొక్క సక్లేశ్వర్ పట్టణం. ఇది బెంగళూరు నుండి 227 కి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X