Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ కు 50 KM దూరంలో మొసళ్ళ శాంక్చురి చూసొద్దామా !!

హైదరాబాద్ కు 50 KM దూరంలో మొసళ్ళ శాంక్చురి చూసొద్దామా !!

మంజీర వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా యందలి వన్యప్రాణుల అభయారణ్యం. వాస్తవంగా మొదట ఇది మొసళ్ళ సాంచురీ.

By Mohammad

అభయారణ్యం : మంజీరా వైల్డ్ లైఫ్ మరియు బర్డ్ శాంక్చురి

జిల్లా : మెదక్

రాష్ట్రం : తెలంగాణ

వైశాల్యం : 20 చ.కి.మీ

ఎలా వెళ్ళాలి : హైదరాబాద్ నుండి 50 కి. మీ, సంగారెడ్డి నుండి 7 కి. మీ దూరంలో మంజీరా వైల్డ్ లైఫ్ మరియు బర్డ్ శాంక్చురి ఉన్నది.

ఉష్ణోగ్రతలు : 15 - 42 డిగ్రీల సెంటీగ్రేడ్

సాధారణ వర్షపాతం : 915 మీ.మీ

సందర్శించు సమయం : అక్టోబర్ నుండి జూన్ వరకు

తెరుచు సమయం : సోమ వారం నుండి ఆది వారం వరకు

ప్రవేశ రుసుము : రూ. పది రూపాయలు

ఏమేమి చూడాలి ? మొసళ్ళు, వలస పక్షులు ప్రధాన ఆకర్షణ

మంజీర వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా యందలి వన్యప్రాణుల అభయారణ్యం. వాస్తవంగా మొదట ఇది మొసళ్ళ సాంచురీ. ప్రస్తుతం సుమారు 70 కంటే ఎక్కువ జాతుల పక్షులు ఇచట సంరక్షింపబడుతున్నాయి. ఇది అంతరించిపోతున్న జాతులు అయిన "మగ్గర్ మొసళ్ళు" కు సంరక్షణా కేంద్రంగా ఉన్నది. ఈ అభయారణ్యమ్లో రిజర్వాయర్ హైదరాబాదు మరియు సికింద్రాబాదు జంటనగరాలకు త్రాగునీటిని అందుస్తున్నది.

సందడి చేస్తున్న వలస పక్షులు

సందడి చేస్తున్న వలస పక్షులు

చిత్రకృప : Ravinder Thakur

మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లాలో సంగారెడ్డి కి 7 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇది హైదరాబాదు నగరానికి 50 కి.మీ దూరమ్లో ఉన్నది. ఈ అభయరణ్యం లో మంజీర నది 36 కి.మీ ఆవరించి ఉంటుంది. ఇచ్చట గల కృత్రిమ రిజర్వాయరు హైదరాబాదు మరియు సికింద్రాబాదు నగరాలకు త్రాగు నీటి వసతిని కల్పిస్తున్నది.

ఈ రిజర్వాయర్ తొమ్మిది ద్వీపాలను కలిగి ఉంటుంది. వాటిలో కొన్ని పుట్టిగడ్డ, బాపనగడ్డ, సంగమడ్డ, కర్ణంగడ్డ. ఈ ద్వీపములు చిత్తడి నేల సరిహద్దులతో నీటి పక్షులకు గూళ్ళు కట్టుకొనే విధంగా ఉపయోగపడుతాయి. అదనంగా పక్షులకు గూళ్ళు కట్టుకొనుటకు దట్టంగా వ్యాపించిన చెట్లు కూద ఉంటాయి.

అభయారణ్యంలో మొసలి

అభయారణ్యంలో మొసలి

చిత్రకృప : Telangana forests

మొసళ్ళు

1974 లో అంతరించిపోతున్న మొసళ్ల జాతి అయిన "మగ్గర్ మొసలి" తెలంగాణ లోని ప్రవేశించింది. మంజీరా నదిలో నాలుగు జతల మగ్గర్ మొసళ్ళను విడిచిపెట్టారు. ఈ మొసళ్ళను పరిరక్షించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము మొసళ్ళ సంరక్షణా కేంద్రాన్ని ఇచట ప్రారంభింఛింది. 1980ల మధ్యలో మంజీరా ప్రఖ్యాతమైన పక్షి సంరక్షణా కేంద్రంగా నిలిచింది. ఈ కేంద్రం పక్షుల సందర్శకులను ఆకర్షించింది. ప్రస్తుతం సుమారు 300 మొసళ్ళు ఇచట ఉన్నాయి. మొసళ్ళను పునరుత్పత్తి చేయు కార్యక్రమం కూడా జరిగుతుంది.

పార్కు విశిష్ట సమాచారం

ఈ అభయారణ్యం పర్యావరణ విద్యా కేంద్రం కలిగి యున్నది. ఇంకులో ఒక మ్యూజియం, గ్రంథాలయం మరియు ఆడిటోరియం ఉన్నాయి. పక్షుల మరియు జంతువుల చలన చిత్రాలను ప్రతిరోజూ చూపిస్తారు. ఈ అభయారణ్యంలో పక్షులను సందర్శకులు చూచుటకు బోట్లు సమకూర్చబడతాయి. సందర్శకులకు దూరదర్శినులు (బైనాక్యులర్స్) మరియు పక్షులను గుర్తించేందుకు పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.

హరిత హోటల్

హరిత హోటల్

చిత్రకృప : Rizwanmahai

ఎక్కడ తినాలి ? ఎక్కడ స్టే చేయాలి ?

సందర్శకులకు వసతి సౌకర్యం కూడా కలదు. సంగారెడ్డి వద్ద ఇనస్పెక్షన్ బంగ్లా, సింగూర్ మరియు సదాశివపేటలలో వసతి కల్పించబడుతుంది. మెదక్, సంగారెడ్డి టౌన్ లలో రెస్టారెంట్లు, హోటళ్ళు కలవు.

మంజీరా వైల్డ్ లైఫ్ మరియు బర్డ్ శాంక్చురి చేరుకోవడం ఎలా ?

మంజీరా వైల్డ్ లైఫ్ మరియు బర్డ్ శాంక్చురి చేరుకోవటానికి హైదరాబాద్ అనువైనది.

వాయు మార్గం : హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపాన కలదు.

రైలు మార్గం : హైదరాబాద్ లోని కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ లు శాంక్చురి కి సమీపాన కలవు.

బస్సు/ రోడ్డు మార్గం : హైదరాబాద్ లోని MGBS బస్ స్టాండ్ నుండి సంగారెడ్డి కి ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. అక్కడి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంక్చురి కి ఆటోలలో, జీపులలో సులభంగా చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X