Search
  • Follow NativePlanet
Share
» »ఉప్పుతో ఆరోగ్యం చీరతో విద్య ఇక్కడ మీకు తథ్యం

ఉప్పుతో ఆరోగ్యం చీరతో విద్య ఇక్కడ మీకు తథ్యం

మన్నారసాల నాగరాజు దేవాలయం

నాగపూజ భారత పురాణ కాలం నుంచి ఉంచి. ముఖ్యంగా సంతాన సాఫల్యం కోసం, ఆరోగ్యం కోసం ఆ నాగదేవతలను ప్రసన్నం చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక నాగపూజ కోసం అనేక దేవాలయాలు మనకు అక్కడక్కడ కనిపిస్తాయి. సాధారణంగా నాగ పూజకు పాలు, లేద కోడిగుడ్లను తీసుకువెలుతారు. అయితే ఒకే ఒక దేవాలయంలో మాత్రం ఉప్పును తీసుకువెలుతారు. ఆ దేవాలయం వివరాలన్నీ మీ కోసం...

మన్నరసాల శ్రీనాగరాజ దేవస్థానం

మన్నరసాల శ్రీనాగరాజ దేవస్థానం

P.C: You Tube

ఆ దేవాలయం కేరళలో ఉంది. దీనిని మన్నరసాల శ్రీ నాగరాజ దేవస్థానం అని అంటారు. ఇక్కడ దాదాపు 40వేల నాగ ప్రతిమలు ఉంటాయి. కేరళాలో అతి పెద్ద దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. సంతానలేమితో బాధపడే మహిళలు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.

ప్రత్యేక తైలం

ప్రత్యేక తైలం

P.C: You Tube

వారికి బిడ్డలు పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లించుకొంటూ ఉంటారు. ఇక్కడ నాగరాజ ప్రతిమలను అందజేస్తారు. అంతేకాకుండా ఇక ప్రత్యేకమైన తైలాన్ని ఇక్కడ అందజేస్తారు. ఈ తైలానికి రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుందని చెబుతారు.

అలప్పీ జిల్లాలో

అలప్పీ జిల్లాలో

P.C: You Tube

ఈ దేవాలయం కేరళలోని అలప్పీజిల్లా హరిపాద్ లో ఎన్ హెచ్ 47 న బస్ స్టేషన్ కు ఈశాన్య మార్గంలో మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ దేవాలయం ఇక్కడ ఉండటం వెనుక కేరళ ఈ భూమి పైకి రావడానికి ప్రధాన కారణమని భావించే పరుశురాముడికి సంబంధం ఉంది.

పరుశురాముడు

పరుశురాముడు

P.C: You Tube

సముద్రం నుంచి పైకి తేలిన ఈ కేరళ ప్రాంతంలో భూ భారాన్ని మోస్తున్న నాగరాజుకు పూజలు చేయడానికి సరైన స్థలం కోసం పరుశురాముడు వెదుకుతూ ఉంటాడు. చివరికి మన్నారసాల అనే ప్రాంతం సరైనదిగా తోస్తుంది. దీంతో అక్కడ పరుశురాముడు దేవాలయాన్ని నిర్మిస్తాడు.

స్వయంగా ప్రతిష్టించి

స్వయంగా ప్రతిష్టించి

P.C: You Tube

అలా ఈ నాగరాజ దేవాలయం పరుశరామ నిర్మితమని చెబుతారు. ఇక్కడ పరుశరాముడు ప్రతిష్టించినట్లు చెప్పబడే సర్పయాక్షి, నాగయాక్షి, నాగచాముండి, తదితర దేవతల శిలా విగ్రహాలు ఉన్నాయి. అటు పై నాగదేవతలకు ఇష్టమైన ఆహారపదర్థాలను స్వయంగా తయారుచేసి నైవేద్యంగా సమర్పించినట్లు చెబుతారు.

మరో కథనం ప్రకారం

మరో కథనం ప్రకారం

P.C: You Tube

దీంతో సర్పరాజులు మిక్కిలి సంతోషం వ్యక్తం చేశాయని చెబుతారు. ఇప్పటికీ ఆ ఆహార పదార్థాలనే ఇక్కడ నాగదేవతలకు నైవేద్యంగా ఇస్తున్నారు. అదే విధంగా ఈ దేవాలయం ఇక్కడ వెలియడానికి గల కారణానికి సంబంధించి మరో కథనం ప్రచారంలో ఉంది.

జాలిపడి

జాలిపడి

P.C: You Tube

ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజైన వాసుదేవ, శ్రీదేవి దంపతులకు వివాహమై ఎన్ని రోజులైనా సంతానం కలుగలేదు. దీంతో వారు మిక్కిలి దు:ఖంతో ఉంటారు. ఈ క్రమంలో వారికి ఒకసారి మంటల్లో చిక్కుకున్న పాములు కనిపిస్తాయి. దీంతో దంపతులు జాలిపడి వాటిని కాపాడుతారు.

తేనే, నూనె, గంధం రాసి

తేనే, నూనె, గంధం రాసి

P.C: You Tube

అప్పటికే గాయాలపాలైన పాములకు తేనే, నూనె, శ్రీగంథం తదితర పదార్థాలతో తయారైన మందులను పూసి అవి త్వరగా కోలుకొనేలా చేస్తారు. అటు పై భక్తితో వాటికి పూజలు చేస్తారు. దంపతుల భక్తికి మెచ్చిన ఆ నాగులకు రాజైన నాగరాజు ప్రత్యక్షమవుతాడు.

నాగరాజు ప్రత్యక్షమయ్యి

నాగరాజు ప్రత్యక్షమయ్యి

P.C: You Tube

తాను మీ పుత్రుడిగా జన్మిస్తాను. కొన్నేళ్లకు నాగుపాము రూపం ధరించి మన్నారసాల వద్ద శాశ్వతంగా ఉండిపోతానని చెబుతారు. అంతేకాకుండా తన దేవాలయానానికి వచ్చే భక్తుల కోర్కెలను తప్పక తీరుస్తానని అందుకు అనుగుణంగా కొన్ని పదార్థాలు తనకు నైవేద్యంగా సమర్పించాలని చెబుతాడు.

ఏమేమి ఇస్తారు

ఏమేమి ఇస్తారు

P.C: You Tube

అలా ఇక్కడ నాగరాజు దేవాలయం వెలిసింది. ఇక ఈ దేవాలయంలో
అరోగ్యం కోసం...ఉప్పు, మిరియాలు
సంతాన భాగ్యం కోసం...కంచుతో తయారు చేసిన పాత్ర
విద్య కోసం......చీర
అయుష్యు కోసం....నెయ్యి అందజేస్తారు.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

P.C: You Tube

హరిపాద్ బస్ స్టేషన్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్. హరిపాద్. కేరళలోని చాలా నగరాల నుంచి ఇక్కడికి రైళ్ల సౌకర్యం ఉంది.

విమానాశ్రయం....కొచ్చిన్ విమానాశ్రయం 115 కిలోమీటర్లు, తిరువనంతపురం 125 కిలోమీటర్లు.

విజయదశమి రోజునే షిర్డీని ఎక్కువ మంది దర్శిస్తారు ఎందుకో తెలుసా? ఈ ఏడాది మరింత మంది ఎందుకంటేవిజయదశమి రోజునే షిర్డీని ఎక్కువ మంది దర్శిస్తారు ఎందుకో తెలుసా? ఈ ఏడాది మరింత మంది ఎందుకంటే

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X