Search
  • Follow NativePlanet
Share
» »హిమాలయాల ప్రవేశ ద్వారంలో మీ కోర్కెలు తీర్చే దేవుళ్లు ఎందరో?

హిమాలయాల ప్రవేశ ద్వారంలో మీ కోర్కెలు తీర్చే దేవుళ్లు ఎందరో?

హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం పితోరాఘర్ గురించి కథనం.

సువిశాల భారత దేశంలో ఒక వైపు ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాలు ఉంటే మరో వైపు అనంతమైన అఘాతాలతో కూడిన సముద్రాలు ఉన్నాయి. ఇక పర్వతల రాజుగా పేరుగాంచిన హిమాలయాలు హిందుపురాణాల ప్రకారం దేవాతలకు నిలయం. ఈ పర్వత పరిసర ప్రాంతాల్లో అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులోనూ ఒక ప్రాంతంలో ఉన్న దేవాలయాల గురించి హిందూ పురాణాల్లో ఎన్నోసార్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతాన్ని హిమాలయాల ప్రవేశ ద్వారం అని పిలుస్తారు.

ఈ ప్రాంతం చుట్టు పక్కల ఉన్న దేవాలయాల్లో మనం కోరిన కోర్కెలన్నీ తీరుతాయని చెబుతారు. ఇక ఈ ప్రాంతం అనేక ప్రకృతి అందాలకు నిలయం. ముఖ్యంగా ఈ హిమాలయ ప్రవేశ ద్వారం స్కీయింగ్ కు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అందువల్లే దేశంలోనేక ప్రపంచంలోని అనేక మంది స్కీయింగ్ క్రీడాకారులు ఇక్కడకు వచ్చి తమ ముచ్చటను తీర్చుకొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన కథనాలు మీ కోసం

హిమాలయాలకు ప్రవేశ ద్వారం

హిమాలయాలకు ప్రవేశ ద్వారం

P.C: You Tube

హిందూ పురాణాల ప్రకారం హిమాలయాల్లో ముక్కోటి దేవతలు నివశిస్తూ ఉంటారు. ఆ దేవతలను దర్శించడానికి పితోరాఘర్ ప్రవేశద్వారంగా పనిచేస్తుందని చెబుతారు. హిందూ పురాణాల్లో పితోరాఘర్ ప్రస్తావన చాలాసార్లు, చాలా చోట్ల వినిపిస్తుంది.

సముద్ర మట్టానికి 4967 అడుగుల ఎత్తులో

సముద్ర మట్టానికి 4967 అడుగుల ఎత్తులో

P.C: You Tube

హిమాలయాల్లోని ఉత్తరాఖండ్ లో ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రాంతం సాయర్ వ్యాలీలో పితోరాఘర్ ఉంది. సముద్ర పట్టానికి 1,514 మీటర్లు అంటే 4967 అడుగుల ఎత్తులో ఈ పితోరాఘర్ గుండా వెళ్లే కాళీనది పొరుగున ఉన్న నేపాల్ దేశ భూభాగాన్ని భారత దేశ భూభాగంతో విడదీస్తుంది.

ప్రకృతి అందాలకు నెలవు

ప్రకృతి అందాలకు నెలవు

P.C: You Tube

పితోరాఘర్ ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవు. ఈ ప్రాంతాన్ని పాల్, చాంద్ వంశ రాజులు పరిపాలించారు. ఆ సమయంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు. ఈ దేవాలయాలన్నీ భారతీయ పురాణ ప్రాధాన్యత కలిగినవే. ముఖ్యంగా ఇక్కడ దేవాలయాలను సందర్శించి మన కోర్కెల చిట్టాను అక్కడి ప్రధాన దేవుళ్లకు చెబితే ఆ కోరికలు ఖచ్చితంగా తీరుతాయని నమ్మకం.

మహాదేవ్ ఆలయం

మహాదేవ్ ఆలయం

P.C: You Tube

పితోఘర్ లో తప్పక సందర్శించాల్సిన ఆలయం మహాదేవ్ ఆలయం. జానపథ, పురాణ కథల ప్రకారం కపిలుడు ఇక్కడ ఒక శివలిండాన్ని ప్రతిష్టించి అనేక వేల ఏళ్లు తపస్సు చేశాడని చెబుతారు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి.

అర్జునేశ్వరాలయం.

అర్జునేశ్వరాలయం.

P.C: You Tube

ఇది ధార్మిక ప్రదేశమే కాకుండా యువత ట్రెక్కింగ్ కు ఎంచుకొనే ప్రదేశాల్లో మొదటివరుసలో ఉంటుంది. పితోఘర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యువత వారాంతాల్లో ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి ఎక్కువగా వస్తుంటారు. అర్జునుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.

 కపిలేశ్వర్ మహాదేవ్ ఆలయం

కపిలేశ్వర్ మహాదేవ్ ఆలయం

P.C: You Tube

ఇది కూడా కపిలమహర్షి పేరుమీదనే నిర్మించబడింది. పితోఘర్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తకురా, తకారి గ్రామల మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఇది ఒక గుహాలయం. గుహలో పదిమీటర్ల దూరం ప్రయాణం చేసి అక్కడ లింగరూపంలో ఉన్న శివుడిని దర్శించవచ్చు. ఇక్కడ నుంచి హిమాలయ పర్వతాలు చాలా అందంగా కనిపిస్తాయి.

నకులేశ్వరాలయం

నకులేశ్వరాలయం

P.C: You Tube

ఈ దేవాలయం ఖజురహో దేవాలయాన్ని పోలిఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న 38 రాతి శిల్పాలు భారతీయ శిల్పకళకు అద్దం పడుతాయి. ముఖ్యంగా శివపార్వుతులు, ఉమా, వాసూదేవ, నవ వర్గ, మహిషాసుర మర్థిని, వామన, కూర్మ, నరసింహస్వామి విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి. నకుల, సహదేవులు ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు.

తాల్ కేదార్

తాల్ కేదార్

P.C: You Tube

పితోరాఘర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో తాల్ కేదార్ క్షేత్రం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 2వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం చేరడానికి సన్ని మార్గం ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ లక్షల సంఖ్యలో భక్తులు చేరుతారు.

కోట్ గారి దేవాలయం

కోట్ గారి దేవాలయం

P.C: You Tube

కోట్ గారి ఆలయంలోని శివుడిని స్థానిక భక్తులు వివిధ పేర్లతో పిలుస్తారు. జీవితంలో ఏదైనా అన్యాయం జరిగిందని బావించిన వారు కుల, మత పరమై భేదం లేంకుడా ఇక్కడకు వచ్చి తమకు సహాయం చేయాల్సిందిగా శివుడిని కోరుకొంటూ ఉంటారు.

ధ్వజ్ ఆలయం

ధ్వజ్ ఆలయం

P.C: You Tube

పితోరాఘర్ కు అతి సమీపంలో సముద్రమట్టానికి 2100 మీటర్ల ఎత్తులో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ శివుడితో పాటు పార్వతీ దేవి జయంతి పేరుతో భక్తులతో పూజలు అందుకొంటూ ఉంటుంది. మంచుతో కప్పబడిన హిమాలయాలు ఇక్కడ నుంచి ఎంతో అందంగా కనబడుతాయి.

మోస్తమాను ఆలయం.

మోస్తమాను ఆలయం.

P.C: You Tube

మోస్తమాను ఆలయం పితోర్ ఘర్ నుంచి ఆరు కిలోమీటర్ల బస్సుప్రయాణం, రెండు కిలోమీటర్ల కాలినడకన ద్వారా మాత్రమే చేరుకోవడానికి వీలవుతుంది. ప్రతి ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఇక్కడ జరిగే జాతరకు లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారు.

దిది హాట్

దిది హాట్

P.C: You Tube

పితోరాఘర్ దగ్గర ఉన్న దిది హాట్ ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలం. సముద్ర మట్టానికి దాదాపు 1725 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడకు సమీపంలో ప్రక`తి అందాలకు నిలయమైన హాట్ వాలీ ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న సిరా కోట్ అనే శివాలయం కూడా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం.

జాళ్ జిబి

జాళ్ జిబి

P.C: You Tube

పితోరాఘర్ పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో జాళ్ జిబి ఉంటుంది. ఇక్కడ ఘోరి, కాళీ నదులు సంగమిస్తాయి. ఇక్కడ ప్రతి ఏడాది మకర సంక్రాంతికి జరిగే జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు విచ్చేస్తారు.

కాలాపానీ హిల్

కాలాపానీ హిల్

P.C: You Tube

జాళ్ జిబికి పదికిలోమీటర్ల దూరంలో కాలాపానీ అనే కొండ ఉంది. ఇక్కడ ఉన్న వేడినీటి బుగ్గలో సర్వ రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు. ఇక్కడకు దగ్గరగా ఉన్న వ్యాసగుహ కూడా చూడదగిన పర్యాటక కేంద్రం

స్కీయింగ్

స్కీయింగ్

P.C: You Tube

సాహస క్రీడలు, మంచు క్రీడలను ఇష్టపడేవారు పితోరాఘర్ కు, చుట్టు పక్కల మంచుతో కప్పబడిన ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ముఖ్యంగా సముద్ర మట్టానికి దాదాపు 3090 అడుగుల ఎత్తులో ఉన్న బెతులిదార్ అనే వాలు ప్రదేశం స్కీయింగ్ కు అనుకూలం. దీనితో పాటు ఖాలియా టాప్, అల్పైన్ ప్రాంతాలు కూడా స్కీయింగ్ కు అత్యంత అనుకూలం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X