Search
  • Follow NativePlanet
Share
» »నీటిలో తేలిన వేంకటేశ్వరుడి విగ్రహాన్ని చూశారా?

నీటిలో తేలిన వేంకటేశ్వరుడి విగ్రహాన్ని చూశారా?

మన్యంకొండ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

భగవంతుడు సర్వాంతర్యామి అని అంటారు. అయితే కొన్ని చోట్ల ఉన్న ఆ భగవంతుడు భక్తులకు కొంగు బంగారమై కోరిన వెంటనే కోర్కెలను తీరుస్తూ ఉంటారు. అటువంటి కోవకు చెందినవాడే ఈ వేంకటేశ్వరుడు. ఈ విగ్రహం నీటి పై తేలుతూ ఓ భక్తుడి దోసిటకు వచ్చింది. అటు పై భక్తులతో నీరాజనాలు అందుకొంటూ ఆ క్షేత్రం పరమపవిత్రమైనది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube

మన్యం కొండ దీనిని తెలంగాణ తిరుపతి అని కూడా అంటారు. కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ మన్యం కొండకు వెళ్లి అక్కడ ఉన్న గుట్ట పై వెలిసిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరుడిని దర్శించుకొంటే తిరుపతి వెళ్లిన ఫలం దక్కుతుందని చెబుతారు.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
ఇక తిరుపతి మాదిరిగానే ఈ క్షేత్రంలో కొండ కింద అలవేలు మంగతాయారు ఉండటం విశేషం. అందువల్లే దీనికి తెలంగాణ తిరుపతిగా పేరు వచ్చింది.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
ప్రాచీన కాలంలో దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసినందువల్ల దీన్ని మొదట్లో మునుల కొండ అని పిలిచేవారు. కాలక్రమంలో అదే మన్యం కొండగా మారింది.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
ఈ మన్యం కొండ క్షేత్రానికి దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉంది. తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం సమీపంలో అళహరి గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన కేశవయ్య విష్ణువు భక్తుడు.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
ఒక రోజు శ్రీనివాసుడు ఆయనకు కలలో కనిపించి తాను కృష్ణానది తీరంలోని మన్యం కొండపై వెలిసి ఉన్నాననిచెబుతాడు.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
అంతేకాకుండా వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవాకార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిస్తాడు. దీంతో కేశవయ్య తన తండ్రి అనంతయ్య, కుటుంబ సభ్యులతో కలిసి మన్యం కొండ ప్రాంచానికి చేరుకొంటాడు.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
అటు పై కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కరించి అర్ఘ్యం వదులుతుండగా శిలారూపంలో ఉన్న వేంకటేశ్వరుడి ప్రతిమ నదిలో అలల పై తేలుతూ వచ్చి కేశయ్య దోసిట నిలిచిందని చెబుతారు.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి మన్యం కొండ పై శేషశాయి రూపంలో గల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప, దీప నైవేద్యాలతో స్మామివారిని ఆరాధించడం మొదలుపెట్టారు.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
క్రమంగా భక్తులు కూడా రావడంతో పుణ్యక్షేత్రంగా మారింది. అటు పై దేవస్థానానికి మంటపం నిర్మించారు. దాతల సహకారంతో ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
ఇదిలా ఉండగా అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల కీర్తనలతో మన్యం కొండ దేశవ్యాప్తంగా పేరుగాంచింది. హనుమద్దాసు మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరుడిని ఉద్దేశించి దాదాపు 300 కీర్తనలు రచించారు.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
ఇక గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు మన్యం కొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అనేక కానుకలు అందజేశారు. వందలాది ఎకరాల భూమిని స్వామివారి కైకర్యాలకు అందజేశారు.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
దీంతో మన్యం కొండ ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. ఇక్కడ ప్రతి శనివారం తిరుచ్చి సేవ, ప్రతి పౌర్ణమికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారికి కొత్త కుండలో అన్నం వండి, పచ్చిపులుసు చేసి స్వామివారికి నివేదించడం తరతరాలుగా వస్తోంది. మన్యం కొండ దిగువన అలమేలు మంగమ్మ గుడి ఉంది.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
ఏటా అమ్మవారి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి. అమ్మవారి సన్నిదిలో పూజలు చేస్తే నిత్య సుమంళిత్వం, సంతాన సాఫల్యం ఉంటుందని భక్తులు నమ్ముతారు. అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎక్కువ మంది వచ్చి వివాహాలు చేసుకొని వెలుతూ ఉంటారు.

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
హైదరాబాద్ నుంచి నేరుగా మన్యంకొండ పుణ్యక్షేత్రానికి బస్సు సర్వీసులు ఉన్నాయి. కర్నూల్ నుంచి వచ్చే వాు జడ్చర్లలో దిగి మహబూబ్ నగర్ మీదుగా మన్యం కొండకు చేరుకోవచ్చు..

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

తెలంగాణ తిరుపతి, మన్యం కొండ

P.C:You Tube
రైలులో రావాలనుకొంటే మహబూబ్ నగర్ దేవరకద్ర మర్గంలో కోటకదిర రైల్వేస్టేషన్ లో దిగితే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దేవస్థానం ఉంది. ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X