Search
  • Follow NativePlanet
Share
» »ఇలా చేస్తే కుజ దోషాలు పోతాయి...పెళ్లి తర్వాత లైఫ్ సాఫీ

ఇలా చేస్తే కుజ దోషాలు పోతాయి...పెళ్లి తర్వాత లైఫ్ సాఫీ

కుజ దోషాలు పోవడానికి జార్ఘండ్ రాష్ట్రంలో అనుసరించే వినూత్న వివాహానికి సంబంధించిన కథనం

By Beldaru Sajjendrakishore

భారతీయ సంస్కృతి సంప్రదాయంలో వివాహమన్నది ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుందనడంలో సందేహం లేదు. అందువల్లే విహాయాన్ని పరమ పవిత్రమైన కార్యంగా జరుపుతారు. ఇక భారతీయ జీవిన విధానాన్ని పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని రెండుగా విభజించి చూస్తారు. ముఖ్యంగా అమ్మయిలకు పెళ్లి జరిపే సమయంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో జరిపే తంతులు చాలా విచిత్రంగా ఉంటాయి. అలా జరపడం తమ ప్రాంతీయ సంస్కతిలో భాగమని స్థానికులు చెబుతారు. అలాంటిదే వధువుకు కుక్కతో వివాహం. ఇది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీని వెనక ఉన్న కథ ఏమిటీ తదితర విషయాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం....

1. కుజ దోషాన్ని పాలదోలడానికి...

1. కుజ దోషాన్ని పాలదోలడానికి...

Image source:

హిందూ సంప్రదాయంలో అమ్మాయికి వివాహం కావడం ఆలస్యమవుతూ ఉంటే అందుకు కుజదోషం కారణమని చెబుతుంటారు. అందువల్ల కుజ దోషం ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకురారు. ఇందుకు పరిహారంగా అమ్మాయిలకు కుజ దోసం పోవడానికి అనేక తంతులను నిర్వహిస్తుంటారు. అందులో ఒకటి కుక్కతో పెళ్లి. వినడానికి, చూడటానికి ఇది వింతగా ఉన్నా కూడా చాలా ఏళ్లుగా ఈ విధానం కొనసాగుతూనే ఉంది

2. కామెడీ కాదు...

2. కామెడీ కాదు...

Image source:


కుక్కతో పెళ్లి అన్న తక్షణం మనకు అదేదో సినిమాలో మోహన్ బాబుకు బ్రహ్మానందం గాడిదతో పెళ్లి చేసిన సీన్ గుర్తుకు వస్తుంది కదు. అక్కడ సీన్ లో తూతూ మంత్రంగా ఒక గాదిద మొడలో వరుడైన బాబుమోహన్ తాళి కట్టి మ...మా అనిపించి వారిద్దరిని శోభనం గదిలోకి పంపిస్తారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథనంలో అటు వంటి కామెడీకి ఆస్కారం లేదు. వివాహాన్ని ఎంత పవిత్రంగా జరుపుతారో శునకంతో పెళ్లి కూడా అదే విధంగా చేస్తారు.

3. మొదటి సారి రజస్వల అయిన వెంటనే

3. మొదటి సారి రజస్వల అయిన వెంటనే

Image source:


శునకంతో కుజ దోషాలు ఉన్న అమ్మాయికి పెళ్లి చేయం వల్ల దోష పరిహారం జరుగుతుందని స్థానిక గ్రామీణులు బలంగా నమ్ముతారు. అందువల్ల అమ్మాయి మొదటిసారి రజస్వల అయిన వెంటనే ఆమె జాతకాన్ని చెప్పమని స్థానికంగా ఉన్న మత పెద్దను లేదా గ్రామ పెద్దను కోరుతారు. అటు పై ఆయన చెప్పిన విషయాన్ని గ్రామ పూజారి వద్ద సరిపోల్చుకొంటారు. ఒక వేళ అమ్మాయి జాతకంలో దోశం ఉందని పెళ్లి జరగడం ఆలస్యమవుతుందని తేలితే వెంటనే శునకంతో పెళ్లికి సిద్ధమవుతారు.

4. ఆషామాషీగా జరపరు

4. ఆషామాషీగా జరపరు

Image source:


దోష పరిహారం కోసం జరిపే ఈ తంతు ఆషామాషీగా సాగదు. అంతా పద్దతి ప్రకారం ఓ వివాహం ఏ రీతిలో జరుగుతుందో అదే విధంగా ఈ దోష పరిహార వివాహం జరుగుతుంది. ఇందు కోసం ముందుగా సదరు యువతి పేరుతో సరిపోయే వీధి కుక్కను గ్రామ పెద్ద ఎంపిక చేస్తారు. ఆ ఎంపిక ఏ ప్రతిపాదికన జరుగుతుందనేది రహస్యం. అటు పై వివాహం జరపడానికి ముహుర్తం నిర్ణయిస్తారు. ఆ సమయం వరకూ సదరు శునకం బాగోగులు అమ్మాయి తల్లిదండ్రులే చూడాలి.

5. కారులో ఊరేగింపు....

5. కారులో ఊరేగింపు....

Image source:


వివాహం జరిపే సమయాన్ని అమ్మాయి తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితులు, గ్రామస్తులను తెలియజేయాలి. ఇందు కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికను కూడా కొంతమంది ముద్రిస్తారు. ఇక వివాహం జరిగే సమయానికి మధువు తండ్రి లేదా మేనమామ సదరు శునకాన్ని బాగా అలంకరించి గ్రామం మొత్తం కారులో ఊరేగిస్తారు. గతంలో ఎద్దుల బండి, గుర్రపు బండీలను వాడేవారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కారును ఈ ఊరేగింపు కోసం వినియోగిస్తున్నారు.

6. వదువులా అలంకరణ...

6. వదువులా అలంకరణ...

Image source:


ఇక అమ్మాయిని కూడా అచ్చం వధువులాగా అలంకరిస్తారు. కొత్తబట్టలు ముఖ్యంగా తెల్లని చీరకు జిగేల్ జిగేల్ వాటిని చుడుతారు. అటు పై వధువును కూడా ఊరి మొత్తం మేళ తాళాలతో తిప్పుతారు. తరువాత ఆమె ఇంటి ముందుకు శునకాన్ని, వధువును చేరుస్తారు. సుమారు గంటపాటు పురోహితుడు మంత్రాలను చదివి అమ్మాయికి, శునకానికి వివాహం జరిపిస్తాడు. ఈ తంతు జరిగే సమయంలో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు సదరు అమ్మాయిని తర్వాత చేసుకోబోయే వరుడు అతని తల్లిదండ్రులు కూడా ఉంటారు.

7. ఆ దురదృష్టం అంతా శునకానికి

7. ఆ దురదృష్టం అంతా శునకానికి

Image source:


ఒకసారి అమ్మాయికి శునకంతో పెళ్లి అయిన తర్వాత ఆమె దురదృష్టం అంతా ఆ శునకానికి వెలుతుందని చెబుతారు. దీంతో సదరు యువతిని పెళ్లి చేసుకుంటే వరుడికి ఇక ఎటువంటి కీడు జరగదని చెబుతారు. ఈ విషయాన్ని మత పెద్దలు అధికారికంగా ప్రకటిస్తారు. ఇక వివాహం సమయంలో అప్పగింతలు, ఆ సమయంలో వదువు, ఆమె తల్లిదండ్రులు ఏర్చడం తదితర విషయాలన్నీ మాములు పెళ్లిని పోలి ఉంటాయి.

8. తీన్మార్

8. తీన్మార్

Image source:


వధువును, శునకాన్ని ఊరేగించే సమయంలోనే కాకుండా పెళ్లి తర్వాత ఆ ప్రాంతం మొత్తం తప్పెట్లు, తాళాలతో మారిమోగి పోతుంది. ఆ సమయంలో ఊరిలోని వారంతా కలిసి వయోభేదాన్ని మరిచి తీన్మార్ లేదా తీన్ మార్ ను ఆడుతారు. ఒకరికి ఒకరు మిఠాయిలను కూడా తినిపించుకుంటారు. ఈ తంతు దాదాపు రెండు గంటల పాటు సాగుతుంది. అటు పై ఈ వివాహానికి వచ్చినవారికి విందు భోజనం ఉంటుంది. ఈ వివాహం తర్వాత వదువు కుటుంబ సభ్యులు సదరు శునకాన్ని కొన్ని నెలల పాటు తమ కుటుంబ సభ్యల్లో ఒకరిగా చూసుకుంటారు.

ఇక్కడ దెయ్యానికి మినరల్ వాటర్, సిగరెట్ ఇవ్వాల్సిందే లేదంటే ప్రయాణం...ఇక్కడ దెయ్యానికి మినరల్ వాటర్, సిగరెట్ ఇవ్వాల్సిందే లేదంటే ప్రయాణం...

ఇక్కడ ఎలుకలే దేవుళ్లుఇక్కడ ఎలుకలే దేవుళ్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X