Search
  • Follow NativePlanet
Share
» »పల్లవుల అద్భుత సృష్టి ... మహాబలిపురం !!

పల్లవుల అద్భుత సృష్టి ... మహాబలిపురం !!

మహాబలిపురం పల్లవ రాజుల కాలంలో అతి ముఖ్యమైన ఓడరేవు. ఒకానొక సమయంలో పల్లవులకు రెండవ రాజధానిగా కూడా వ్యవహరించింది.

By Mohammad

మహాబలిపురం ఒకవైపు చారిత్రక కళావైభవంతో, మరోవైపు ఆధ్యాత్మిక సంపదతో తలతూగుతూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మామల్లాపురం గా కూడా పిలువబడే మహాబలిపురం తమిళనాడులోని కంచి జిల్లాలో కలదు. రాష్ట్ర రాజధానైన చెన్నై నగరం నుండి 70 కిలోమీటర్ల దూరంలో మరియు కంచి పట్టణం నుండి 66 కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం ఉన్నది.

మహాబలిపురం పల్లవ రాజుల కాలంలో అతి ముఖ్యమైన ఓడరేవు. ఒకానొక సమయంలో పల్లవులకు రెండవ రాజధానిగా కూడా వ్యవహరించింది. ఇది బంగాళాఖాతానికి అభిముఖంగా కోరమాండల్ తీరంలో కలదు. విష్ణుమూర్తి తో జరిగిన యుద్ధంలో మరణించిన మహాబలి అనే రాక్షసుడి పేరుమీద మహాబలిపురం అన్న పేరొచ్చినట్లు తెలుస్తుంది.

అయిదు రథాలు

అయిదు రథాలు

వీటినే పంచపాండవుల రథాలు లేదా పంచ రథాలు అని అంటారు. ఈ నిర్మాణం ఏకశిలా శిల్పశైలికి అద్దం పడుతుంది. రాజు మహేంద్రవర్మ-1 మరియు అతని కుమారుడు నరసింహన్ వర్మన్ -1 కాలంలో నిర్మించబడిన ఈ నిర్మాణ రహస్యం ఇప్పటికీ ఎవరికీ బోధపడటం లేదు. ఈ సముదాయంలో ఉన్న ప్రతి కట్టడం రథాన్ని పోలి, ఒకే నల్లరాయితో చెక్కబడి ఉంటుంది.

చిత్ర కృప : Aasif Iqbal J

అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం

అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం

క్రీ. శ. 7 వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడం గురించి మహాభారతంలో పేర్కొనబడింది. కౌరవులను కురుక్షేత్ర యుద్ధంలో ఓడించటానికి పాండవులలో ఒకడైన అర్జునుడు శివుని ఆయుధం పొందేందుకు ఇక్కడే శిలమీద కూర్చొని ఘోర మైన తపస్సు చేసినట్లు చెబుతారు. అంతేకాదు భగీరథుడు కూడా గంగను దివి నుంచి భువికి రప్పించటానికి ఇక్కడే తపస్సు ఆచరించాడని చెబుతారు. ఇక్కడ చెక్కిన శిల్పాలు ఆనాటి పనితనానికి ధ్రువపత్రాలుగా ఉన్నాయి.

చిత్ర కృప : Mahesh Balasubramanian

బాలన్సింగ్ రాక్

బాలన్సింగ్ రాక్

బాలన్సింగ్ రాక్ మహాబలిపురం ఆకర్షణలలో ఒకటి. కృష్ణుని వెన్న బంతి గా ఇది ప్రసిద్ధి. ఇది 45 డిగ్రీల కోణంతో వంగి ఉంటుంది. పర్యాటకులు ఇక్కడికి వచ్చి రాయిని బ్యాలెన్స్ చేస్తున్నట్లు ఫోటోలు దిగుతారు. ఈ రాయిని పల్లవ రాజులు ఏనుగులతో తరలించటానికి ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు.

చిత్ర కృప : Dey.sandip

కృష్ణ మండపం

కృష్ణ మండపం

కృష్ణ మండపం, మహాబలిపురం లో ఉన్న పురాతన కట్టడాలతో ఒకటి. మండపంలో శ్రీ కృష్ణ లీలలు ఎన్నో చిత్రీకరించారు. గోవర్ధనగిరి కొండను చిటికెన వేలుతో లేపి ఊరిప్రజలను కాపాడే చిత్రం అలరిస్తుంది.

చిత్ర కృప : Emmanuel DYAN

సీ షోర్ ఆలయం (సముద్ర తీర ఆలయం)

సీ షోర్ ఆలయం (సముద్ర తీర ఆలయం)

మహాబలిపురం సముద్ర తీర ప్రాంతంలో ఒకప్పుడు ఏడు ఆలయాలు ( సెవన్ పగోడాస్) ఉండేవని అంటారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆలయాలన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయి సీ షోర్ ఆలయం ఒక్కటే మిగిలిందని చారిత్రక గాధ. గ్రానెట్ రాళ్లతో నిర్మించబడిన ఈ ఆలయంలో శివుడు, విష్ణుమూర్తి విగ్రహాలతో పాటు, దుర్గా దేవి కూడా దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం యునెస్కో చేత సంరక్షించబడుతున్నది.

చిత్ర కృప : Gopinath Sivanesan

టైగర్ కేవ్స్

టైగర్ కేవ్స్

టైగర్ కేవ్ పర్యాటకుల ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం. ఇదొక హిందూ టెంపుల్. ఒకే కొండరాయిని తోలిచి దీనిని నిర్మించారు. ప్రవేశ ద్వారం లో మలచిన పులుల తలలు ఉండటంవల్ల దీనికి ఆపేరు పెట్టారు. లోనికి వెళ్ళటానికి టికెట్ ఉంటుంది. టికెట్ ధర రూ. 10/- మాత్రమే.

చిత్ర కృప : Ravichandar84

క్రోకడైల్ బ్యాంకు

క్రోకడైల్ బ్యాంకు

క్రోకడైల్ బ్యాంకు మహాబలిపురానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రధాన ఆకర్షణ. ఇక్కడ వివిధ రకాల పాములు, మొసళ్ళు ఉంటాయి. మొసళ్లను ఉత్పత్తి చేసి చంబల్ నది, మహా నదులలో వదులుతారు.

చిత్ర కృప : Sudarshana

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

శిల్పకళా మ్యూజియం, మామల్లాపురం లైట్ హౌస్, వరాహకేవ్ టెంపుల్, గణేశ రథం, మహిశాసురమర్ధిని కేవ్, త్రిమూర్తి కేవ్, వైడ్ బీచ్, ధర్మరాజ కేవ వంటి ఎన్నో పర్యాటక ఆకర్షణలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి.

చిత్ర కృప : Simply CVR

రవాణా వ్యవస్థ

రవాణా వ్యవస్థ

మహాబలిపురం ఎలా చేరుకోవాలి ?

బస్సు మార్గం : కంచి, చెన్నై ప్రాంతాల నుండి ప్రతి రోజూ మహాబలిపురానికి బస్సులు తిరుగుతుంటాయి.
రైలు మార్గం : చెంగల్పట్టు మహాబలిపురానికి సమీప రైల్వే స్టేషన్(29 కి. మీ)
వాయు మార్గం : చెన్నై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ మహాబలిపురానికి సమీపాన కలదు.

చిత్ర కృప : McKay Savage

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X