Search
  • Follow NativePlanet
Share
» »మయబండ్ లో విహరించారా?

మయబండ్ లో విహరించారా?

మయబండర్ అండమాన్ గురించి పూర్తి సమాచారం

అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రముఖ పర్యాటక ప్రాంతం మయబండర్. దీనిని భూతల స్వర్గంగా పేర్కొంటారు. ఈ మయబండర్ చుట్టు పక్కల రే హిల్స్, ఆస్టీన్ ఎక్స్, కర్మథాంగ్ బీచ్, అవీస్ ఐల్యాండ్, ఇంటర్వ్యూ ఐల్యాండ్ వంటి ఎన్నో బీచ్‌లు, ఐల్యాండ్‌లు ఉన్నాయి. దాదపు రెండు రోజుల పాటు హాయిగా గడపాలనుకొనేవారు ఇక్కడికి వెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో మయబండర్‌కు సంబంధించిన పర్యాటక వివరాలు మీ కోసం...

రే హిల్స్

రే హిల్స్

P.C: You Tube

మీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందంగా గడపడానికి అనువైన ప్రాంతం రే హిల్స్. ఇక్కడ స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు సంవ`ద్ధిగా దొరుకుతుంది. అందువల్లే ఇక్కడకు ఎక్కువమంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అండమాన్ నికోబార్ అటవీశాఖ ఆధీనంలో ఈ రే హిల్స్ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ అనేక జలక్రీడలు అందుబాటులో ఉంటాయి.

మీరు వెళ్లకున్నా రోజూ మీ పేరిట పూజలు? ఎక్కడో తెలుసామీరు వెళ్లకున్నా రోజూ మీ పేరిట పూజలు? ఎక్కడో తెలుసా

ప్రవేశరుసుం లేదు

ప్రవేశరుసుం లేదు

P.C: You Tube

ఏడాదిలో అన్ని రోజులూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ రే హిల్స్‌ను చూడటానికి అనుమతి ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం చూడటానికి దాదాపు అర్థరోజు పడుతుంది. సాహసక్రీడలకు ఈ రే హిల్స్ చాలా ప్రాచూర్యం చెందినది. ఎలిఫెంట్ రైడ్, ట్రెక్కింగ్, వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

ఆస్టీన్ ఎక్స్

ఆస్టీన్ ఎక్స్

P.C: You Tube

చిన్నదైనా కూడా చాలా అందంగా కనిపించే ప్రాంతం ఆస్టీన్ ఎక్స్. ఈ ప్రాంతంలో బీచ్‌లు చిన్నచిన్న గుట్టలతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడి వారు చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగినవారు. దీంతో మనం ఎక్కడికి వెళ్లినా సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు.

పిక్నిక్ స్పాట్

పిక్నిక్ స్పాట్

P.C: You Tube

ఆస్టీన్ ఎక్స్ పిక్నిక్ స్పాట్‌గా ఇప్పుడిప్పుడే మారుతోంది. ఇక్కడ స్పీడ్ బోట్, బనానా బీట్ వంటి వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అందువల్లే చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ ఆస్టీన్ ఎక్స్‌కు వెళ్లడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి ఈ ప్రాంతం స్వర్గధామం. ఇక్కడ ఎంట్రీ ఫీ లేదు. ఈ ప్రాంతమంతా తిరగడానికి ఒక రోజు మొత్తం అవసరమవుతుంది.

కర్మథాంగ్ బీచ్

కర్మథాంగ్ బీచ్

P.C: You Tube

కర్మథాంగ్ బీచ్ తాబేలు బ్రీడింగ్ సెంటర్. పర్యాటకులకు బుడిబుడి నడకలతో ముందుకువెల్లే చిన్న తాబేలు పిల్లలను చూస్తూ సంబరపడిపోయే ద`ష్యాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. ఇక్కడ తెల్లని ఇసుక తెన్నలు, పామ్ చెట్లు మనలను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి.

బోట్ రైడింగ్

బోట్ రైడింగ్

P.C: You Tube

ఈ బీచ్‌లో బోట్ రైడింగ్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు అనేక వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా మిమ్ములను మైమరిపింపజేస్తాయి. ఇక్కడ మీరు సముద్రంలో వివిధ జాతులకు సంబంధించిన జీవన విధానాన్ని కూడా స్పష్టంగా చూడవచ్చు. కర్మథాంగ్ బీచ్ చూడటానికి మీకు రెండు గంటల సమయం పడుతుంది.

అవీస్ ఐల్యాండ్

అవీస్ ఐల్యాండ్

P.C: You Tube

భారతదేశంలో అత్యంత అందమైన ద్వీపాల్లో అవీస్ ఐల్యాండ్ కూడా ఒకటి. ఇక్కడ బంగారు వర్ణంలో మెరిసిపోయే అవీస్ ఐల్యాండ్ ఫొటోగ్రాఫర్ అంటే ఇష్టపడేవారికి ఖచ్చితంగా నచ్చితీరుతుంది. అదే విధంగా సముద్ర తీరం వెంబడి ఉండే కొబ్బరి చెట్లు కూడా ఈ ఐల్యాండ్‌కు మరింత అందాన్ని తీసుకువస్తాయి.

కేవలం ఉదయం పూట మాత్రమే

కేవలం ఉదయం పూట మాత్రమే

P.C: You Tube

కేవలం ఉదయం మాత్రమే మీరు నదీద్వీపం అందాలను చూడటానికి వీలవుతుంది. ఎంట్రీ ఫీ లేదు. అవీస్ ఐల్యాండ్ చూడటానికి పట్టే సమయం కేవలం రెండు గంటలు మాత్రమే. ఇది మంచి పిక్నిక్‌స్పాట్ కూడా.

ఇంటర్వ్యూ ఐల్యాండ్

ఇంటర్వ్యూ ఐల్యాండ్

P.C: You Tube

వన్యప్రాణులు, అడవులు అంటే ఇష్టపడేవారికి ఈ ఐల్యాండ్ ఖచ్చితంగా నచ్చుతుంది. రణగొణ ధ్వనులకు దూరంగా కనీసం కొన్ని గంటలు గడపాలనుకొనేవారు ఇక్కడికి తప్పకుండా వెలుతారు. ముఖ్యంగా ఏనుగులను వాటి సహజ ఆవాసంలో చూడాలనుకొనేవారి కోరిక ఇక్కడ తప్పకుండా తీరుతుంది. అందుకే ఈ ఐల్యాండ్ అంటే చాలా మందికి ఇష్టం

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

P.C: You Tube

ఇక్కడ ట్రెక్కింక్ కోసం వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా జంగిల్ సఫారీ కూడా అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ ఫీ లేదు. ఉదయం పూట మాత్రమే ఇక్కడకు వెళ్లడానికి అనుమతి. ఈ ఐల్యాండ్‌ను చూడటానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X