Search
  • Follow NativePlanet
Share
» »మాయాపూర్ - కృషుడి ఆధ్యాత్మిక రాజధాని !

మాయాపూర్ - కృషుడి ఆధ్యాత్మిక రాజధాని !

By Mohammad

మాయాపూర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ఉన్న కృష్ణుని ఆలయం కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నది. జలంగి నది వద్ద కలిసే గంగా నది తీరం ఒడ్డున మాయాపూర్ కలదు. కృష్ణుడు అవతారంగా భావించబడే చైతన్య మహాప్రభు జన్మ స్థలం గా ఇది పేరుగాంచినది.

మాయాపూర్ రుచులు

మాయాపూర్ లో బెంగాలీ వంటకాలు రుచికరంగా ఉంటాయి. రెస్టారెంట్ లలో, వివిధ స్థానిక తోపుడు బండ్లలో శాకాహార భోజనం లభ్యమవుతుంది.

జరుపుకొనే పండుగలు

హోలీ వేడుకలు మాయాపూర్ లో బ్రహ్మాడంగా జరుగుతుంది. దసరా పండగ నాడు దుర్గా దేవి కి, కాళీ మాత కు పూజలు నిర్వహిస్తారు. దీపావళి సంబరాలు మిన్నంటుతాయి.

ఇస్కాన్ ఆలయం

ఇస్కాన్ ఆలయం

చిత్ర కృప : Joydeep

ఇస్కాన్ ఆలయం

మాయాపూర్ లోని ఇస్కాన్ ఆలయం వివిధ శైలిలో, భంగిమలలో విగ్రహాలు కలిగి ఉన్నది. దీనికే శ్రీధామం అని మరొక పేరు. ఆలయ ప్రాంగణంలో వివిధ దేవుళ్ళకు అంకితం చేసిన గుడులు ఉన్నాయి. పెద్ద తామర విగ్రహ జలపాతం, ప్రాంగణం మధ్యలో ఉన్న తోట, ధ్యాన భావనలతో కూడిన ఆశ్రమాలు, కుటీరాలు, కేంద్రాలు చూడదగ్గవి. ముఖ్యంగా ఇస్కాన్ వ్యవస్థాపకుడికి అంకితం చేసిన స్మారకం శ్రీల ప్రభుపాదుల సమాధి మందిరాన్ని దర్శించటం మరవద్దు !

ఇది కూడా చదవండి : ఇండియాలోని టాప్ 10 ఇస్కాన్ ఆలయాలు !

శ్రీధామం

చిత్ర కృప : Vrindavan Lila

చంద్రోదయ ఆలయం

భగవద్గీత చదివి ప్రేరేపితుడైన ప్రఖ్యాత ఫోర్డ్ కార్ల కంపెనీ అధినేత ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, ఇస్కాన్ వ్యవస్థాపకుడైన శ్రీల ప్రభుపాదుల కోరికను నెరవేర్చాలని ధ్యేయంగా పెట్టుకొని నిర్మిస్తున్నదే చంద్రోదయ దేవాలయం. దీని నిర్మాణం పూర్తయితే బహుశా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రార్థనా దేవాలయం కాగలదు. పూర్తయితే, ఏటా మిలియన్ ల కొద్ది యాత్రికులు సందర్శిస్తారు.

చంద్రోదయ ఆలయం

చంద్రోదయ ఆలయం

సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఆలయానికి అయ్యే ఖర్చు 75 మిలియన్ అమెరికన్ డాలర్లు. దాదాపు 3/4 వంతు ధనం ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ అందిస్తున్నాడు. మిగితా 1/4 వంతు ధనం దాతల ద్వారా విరాళాల రూపంలో సేకరిస్తున్నారు. 2006 లో నిర్మాణం మొదలు పెట్టాలని భావించినప్పటికీ, కొన్ని అడ్డంకుల కారణంగా చివరకు 2010 లో పనులు మొదలు పెట్టారు. 2016 చివరికల్లా దీని పూర్తి నిర్మాణం జరగవచ్చని అంచనా.

మాయాపూర్ లో చూడదగ్గ మిగితా ఆకర్షణ

1880 వ సంవత్సరంలో భక్తివినోద ఠాకూర్ (విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి) చైతన్య మహాప్రభు పుట్టిన స్థలంలో నిర్మించిన ఆలయం కృష్ణ భక్తులచే సందర్శించబడుతున్నది. అంతే గాక ఇక్కడ కృష్ణుడి కి సంబంధిచిన అనేక ఆలయాలను పట్టణంలో దర్శించవచ్చు.

యోగపీఠ ఆలయం

యోగపీఠ ఆలయం

చిత్ర కృప : Cinosaur

మాయాపూర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

కోల్కత్త సమీప విమానాశ్రయం. ఇది 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. క్యాబ్ లేదా టాక్సీ ల ద్వారా మాయాపూర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

కృష్ణానగర్ సమీప రైల్వే స్టేషన్. ఇక్కడికి రోజూ హౌరా, సెల్దేహ్ ల నుండి రైళ్లు వస్తుంటాయి. కృష్ణానగర్ నుండి మాయాపూర్ వరకు వెళ్ళటానికి రెగ్యూలర్ గా బస్సులు, ఆటో రిక్షాలు లభ్యమవుతాయి.

పడవ మార్గం

పడవ మార్గం

చిత్ర కృప : Ayan Mukherjee

రోడ్డు / బస్సు మార్గం

కోల్కత్త నుండి మాయాపూర్ కు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. కోల్కత్త లోని ఇస్కాన్ ఆలయం మాయాపూర్ వరకు ప్రతి రోజు బస్సు ఒక బస్సు సర్వీస్ ను నడుపుతున్నది. ఉదయం 6 గంటలకు బయలుదేరి ఉదయం పదిగంటల కు మాయాపూర్ చేరుకుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X