Search
  • Follow NativePlanet
Share
» »సోనామార్గ్ వెళితే అంతా బంగారమే ..!

సోనామార్గ్ వెళితే అంతా బంగారమే ..!

సోనామార్గ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న కొండ ప్రాంతం. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 2740 మీటర్ల ఎత్తులో కలదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారత పర్యాటక రంగానికి ద్వారం లాంటిది.

By Venkatakarunasri
Airasia India Offers Base Fare At Rs 99 For Domestic Travel

వెళ్లే భక్తులకు స్థావరంగా వ్యవహరించబడుతుంది. సోనామార్గ్ అంటే అర్థం 'బంగారు మైదానం' అని. ఇక్కడ పుష్పించే బంగారు వర్ణ పుష్పాలు మరియు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అక్కడి పర్వతాలు బంగారు వర్ణం లోకి మారే తీరు కళ్ళకు ఇంపుగా కనిపిస్తాయి.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారత పర్యాటక రంగానికి ద్వారం లాంటిది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రదేశ అందచందాలను సందర్శించటానికి దేశ, విదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు. సంవత్సరం మొత్తం చూసిన ఇక్కడి ప్రదేశాల ప్రకృతి అందాలను చూడటం మీతరం కాదు. అలాంటి ప్రదేశాల్లో ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే పర్యాటక ప్రదేశం సోనామార్గ్.

సోనామార్గ్ లో అందమైన ఆకర్షనీయ ప్రదేశాలు చూడవచ్చు. అలాగే ట్రెక్కింగ్, హైకింగ్ వంటి సాహస క్రీడలను సైతం ఆడవచ్చు. బంగారు వర్ణం లో మారే అక్కడి పర్వతాల దృశ్యాలను కనులారా చూస్తూ ఆస్వాదించవచ్చు. మరిక ఆలస్యం ఎందుకు సోనామార్గ్ లో సందర్శించవలసిన ప్రముఖ పర్యాటక ప్రదేశాలు చూసొద్దాం పదండి.

గడ్సర్ లేక్

గడ్సర్ లేక్

సోనామార్గ్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టం నుండి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న గడ్సర్ లేక్ ని 'వాలీ అఫ్ ఫ్లవర్' అని కూడా పిలుస్తారు. హిమాలయాల మధ్య ఉన్న ఈ సరస్సు అత్యధిక ఎత్తులో ఉన్న సరస్సుగా ప్రసిద్ది చెందింది. నవంబర్ నుండి ఏప్రిల్ నెల వరకు గడ్డకట్టే ఈ సరస్సు చుట్టూ ఆల్పైన్ పూలు కనువిందు చేస్తాయి.

క్రిష్ణసర్ లేక్

క్రిష్ణసర్ లేక్

సముద్రమట్టం నుండి 3801 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న క్రిష్ణసర్ సరస్సు, సొనామార్గ్ కి సమీపంలో ఉన్న సుందరమైన సరస్సు. దట్టమైన అడవుల మధ్యలో ఉన్న ఈ సరస్సు లో పర్యాటకులు నీటి చేపలని పట్టడం వంటి క్రీడలని ఆనందించవచ్చు. ఎండాకాలం లో ఈ ప్రాంత వాతావరణం చల్లగా అలాగే ఆహ్లాదకరంగా ఉంటుంది.

చిత్ర కృప : Cajetan Barretto

గంగాబాల్ లేక్

గంగాబాల్ లేక్

కాశ్మీర్ వాలీలోని హరముఖ్ పర్వత ప్రాంతంలో ఉన్న గంగాబల్ లేక్ సముద్రమట్టం నుండి 3570 మీటర్ల ఎత్తులో ఉంది. ఫిషింగ్ ని ఆనందించే పర్యాటకులు ఈ సరస్సులో మంచినీటి చేపలని పట్టి ఆనందించవచ్చు.

చిత్ర కృప : Tarik Pakhtoon

సత్సార్ లేక్

సత్సార్ లేక్

సొనామార్గ్ కి సమీపంలో ఉన్న సత్సార్ సరస్సు సముద్ర మట్టం నుండి 3600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సొనామార్గ్ నుండి ట్రెక్కింగ్ ద్వారా సాహసాన్ని ఇష్టపడే ఉత్సాహవంతులు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. అందమైన చెట్లు అలాగే ఆల్పైన్ పూలతో నిండి ఉండే ఈ ప్రాంతం పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : Parth Joshi

విషన్సర్ లేక్

విషన్సర్ లేక్

సోనామార్గ్ లో ఉన్న విషన్సర్ లేక్ సముద్ర మట్టం నుండి 3710 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఈ ప్రాంతం కాశ్మీర్ లోయ పర్యాటకులకి ప్రధాన పర్యాటక ఆకర్షణ. జాతీయ రహదారి నెం.1 ద్వారా శిత్కడి గ్రామానికి చేరుకొని అక్కడి నుండి గుర్రాల ద్వారా రోడ్డు మార్గం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విషన్సర్ సరస్సుకి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Parth Joshi

నిలగ్రడ్ నది

నిలగ్రడ్ నది

సొనామార్గ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిలగ్రిడ్ నది లో నీళ్ళు ఎర్రగా ఉండడం వల్ల ప్రాచుర్యం చెందింది. ఈ ఎరుపు రంగు నీళ్ళ లో ఔషద గుణాలున్నాయని నమ్ముతారు. ప్రతి ఆదివారం ఈ నదిలో స్నానం చెయ్యడానికి అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేస్తారు.

చిత్ర కృప : Ankur P

తజివాస్ గ్లేసియర్

తజివాస్ గ్లేసియర్

సముద్రమట్టం నుండి 3000 మీటర్ల ఎత్తున ఉన్న తజివాస్ గ్లేసియర్ ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. పర్యాటకులు ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే సోనామార్గ్ నుండి గుర్రాలను అద్దె కు తీసుకోవలసి ఉంటుంది.

జోజి లా పాస్

జోజి లా పాస్

సముద్రం మట్టానికి 3465 మీటర్ల ఎత్తులో ఉండే జోజి లా పాస్, సొనామార్గ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచు పర్వతాలు, కాశ్మీర్ లోయ, డ్రాస్ లోయ అలాగే అడవులతో చుట్టబడిన ఈ జోజి లా పాస్ కాశ్మీర్ లో నే అతి ప్రమాదకరమైన పాస్ గా పరిగణించబడినది. లెహ్ మరియు శ్రీనగర్ ని కలిపే జాతీయ రహదారి 1 ద్వారా పర్యాటకులు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

క్రిష్ణసర్ పాస్

క్రిష్ణసర్ పాస్

క్రిష్ణసర్ పాస్ సముద్రమట్టం నుండి సుమారు 4080 మీటర్ల ఎత్తులో ఉన్నది. గడసర్ లేక్ కి సమీపంలో ఈ పాస్ ను చూడవచ్చు. లేక్ సమీపంలోని లోయ, అందమైన పర్వతాలు అలాగే విషన్సర్ లేక్ తో ఈ క్రిష్ణసర్ పాస్ చూడముచ్చటగా ఉంటుంది.

చిత్ర కృప : Cajetan Barretto

సత్సరాన్ పాస్

సత్సరాన్ పాస్

సముద్ర మట్టం నుండి 3680 మీటర్ల ఎత్తులో ఉన్న సత్సరాన్ పాస్ ని సత్సరాన్ గలీ పాస్ అని కూడా అంటారు. ఈ పాస్ కి దగ్గరలో ఎన్నో ప్రసిద్దమైన ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో సత్సర్ లేక్, నిచినై పాస్, విషన్సర్ లేక్, జాజిబల్ గలీ, గడ్సర్ లేక్ అలాగే క్రిష్ణసర్ లేక్ ఉన్నాయి.

నిచినై పాస్

నిచినై పాస్

సొనామర్గ్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిచినై పాస్ ట్రెక్కింగ్ కి అనువుగా ఉంటుంది. సముద్రపు మట్టం నుండి 4139 కిలోమీటర్ల ఎత్తులో ప్రకృతి అందాల మధ్య చూడముచ్చటగా ఉంటుంది.

చిత్ర కృప : uese

బల్తాల్

బల్తాల్

సొనామార్గ్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో దక్షిణాదిన నెలకొని ఉన్న ప్రాంతం బల్తాల్. అమర్నాథ్ యాత్రికులకి విడిదిగా ఈ ప్రాంతం వ్యవహరిస్తుంది. అంతేకాకుండా, యాత్రికుల సౌకర్యార్ధం ఈ ప్రాంతంలో బేస్ క్యాంప్స్ ని ఏర్పాటు చేసారు.

చిత్ర కృప : bhavukkchoudry

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

సొనామార్గ్ లో జరిగే అతి ప్రసిద్దమైన ఆక్టివిటీల లో ట్రెక్కింగ్ ఒకటి. మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు, అందమైన పర్వత ప్రాంతాలు, ట్రెక్కింగ్ సాహస యాత్రలకి అనువుగా ఉంటాయి. ఇక్కడి సరస్సుల్లో కూడా సాహస క్రీడలను ఆస్వాదించవచ్చు. ఎండాకాలంలో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా, శీతాకాలం లో మంచు తో ఉంటుంది.

సోనామార్గ్ ఎలా చేరుకోవాలి ?

సోనామార్గ్ ఎలా చేరుకోవాలి ?

సోనామార్గ్ చేరుకోవటానికి విమాన, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

శ్రీనగర్ విమానాశ్రయం సోనామార్గ్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం. ఇక్కడి నుండి సోనామార్గ్ కు చేరుకోనేందుకు ట్యాక్సీ, క్యాబ్ లు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం

సోనామార్గ్ కు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ శ్రీనగర్ లోని నౌగాం రైల్వే స్టేషన్. ఇది 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కానీ దీనికంటే జమ్మూతావి రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడింది. స్టేషన్ బయట నుండి ట్యాక్సీ / క్యాబ్ లలో ప్రయాణించి సోనామార్గ్ కు చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

సోనామార్గ్ కు చేరుకోవాలంటే రోడ్డు మార్గమే గతి. లోయలోని రోడ్లన్ని మలుపులు తిరిగి ప్రమాదకరంగా ఉంటాయి. జాతీయ రహదారి 1 గుండా ప్రయాణించినట్లయితే సోనామార్గ్ కు సులభంగా చేరుకోవచ్చు. సమీప పట్టణమైన శ్రీనగర్ నుండి సోనామార్గ్ కు రాష్ట్ర బస్సులు నిత్యం తిరుగుతుంటాయి.

చిత్ర కృప : draskd

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X