Search
  • Follow NativePlanet
Share
» »కేరళ వాయనాడ్ వెళుతున్నారా..ఐతే మీన్‌ముట్టి వాటర్ ఫాల్ చూడటం మర్చిపోకండి

కేరళ వాయనాడ్ వెళుతున్నారా..ఐతే మీన్‌ముట్టి వాటర్ ఫాల్ చూడటం మర్చిపోకండి

కేరళ సందర్శన అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది, మున్నార్ , అలెప్పీనే. కేరళను గాడ్స్ గిఫ్ట్ గా అభివర్ణిస్తుంటారు. భారతదేశంలో ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. దక్షిణాది రాష్ట్రంలో గాలి తెమ్మరలు మనకు

Photo Courtesy: Vssekm

కేరళ సందర్శన అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది, మున్నార్ , అలెప్పీనే. కేరళను గాడ్స్ గిఫ్ట్ గా అభివర్ణిస్తుంటారు. భారతదేశంలో ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. దక్షిణాది రాష్ట్రంలో గాలి తెమ్మరలు మనకు ప్రకృతి పాఠాలను వల్లిస్తున్నట్లు మనలను మైమరిపింపజేస్తుంటాయి. కేరళలో ఏ మూల చూసినా ఆహ్లాదకరమైన దృశ్యాలే కనబడుతాయి. కేరళను భూతల స్వర్గంగా కూడా పిలుచుకుంటారు. పడమటి కనుమల్లో పచ్చగా సేదతీరుతున్న మలయసీమ..పిల్ల కాలువలు మనలను సర్గపు అంచుల వరకూ తీసుకువెలుతాయి. నదీ, పర్వత లోయలు మనలను పక్కకు కూడా చూపు తిప్పుకోనివ్వవు.

సెలవుల్లో ప్రకృతిలో మమేకం కావాలంటే వయనాడు మంచి ఎంపిక. తొలకరిజల్లు ముద్దాడిన వేళ మరింత ఆకర్షణీయంగా మారిపోతుంది. వర్షాకాలంలో ఇక్కడ జలపాతాలు వీక్షించేందుకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదేమో. కేరళలో ఇడుక్కి జిల్లాలోనే సుమారు 50 చిన్నా..పెద్దా జలపాతాలున్నాయి. ఎత్తైన పర్వతాల నడుమ ఈ జలపాతాల్లో విహరించాలంటే వయనాడు ది బెస్ట్ హనీమూన్ స్పాట్‌. అందువల్లే ఈ వేసవి సెలవుల్లో జలపాతాలను సందర్శించాలని కోరుకునే వారికి కేరళ మంచి ఎంపిక.

కేరళలో అత్యంత అందమైన జలపాతాల్లో మీన్ ముట్టి వాటర్ ఫాల్

కేరళలో అత్యంత అందమైన జలపాతాల్లో మీన్ ముట్టి వాటర్ ఫాల్

కేరళలో అత్యంత అందమైన జలపాతాల్లో మీన్ ముట్టి వాటర్ ఫాల్ ముందు వరుసలో ఉంటుంది. నీలిమలపర్వతానికి అతి దగ్గరలో ఉన్న అద్భుతమైన మీన్‌ముట్టి జలపాతాలను ఊటీ మరియు వాయినాడ్‌ను కలిపే మెయిన్‌ రోడ్డు నుంచి 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయడం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. అలాగే పూకాట్ లేక్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో మీన్ ముట్టి వాటర్ ఫాల్ ఉంది.

Photo Courtesy: Anantharamvanchiprakash

వాయనాడ్‌ జిల్లాలో ఇది అతి పెద్ద వాటర్‌ఫాల్స్‌

వాయనాడ్‌ జిల్లాలో ఇది అతి పెద్ద వాటర్‌ఫాల్స్‌

వాయనాడ్‌ జిల్లాలో ఇది అతి పెద్ద వాటర్‌ఫాల్స్‌, ఇక్కడ నీళ్లు సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి పడతాయి. నీళ్ళు ఎత్తు నుంచి కిందికి పడే సమయంలో అనేక పాయలుగా చీలిపోయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

PC:Anil R.V

మీన్ ముట్టి జలపాతాలు ఒక మంచి టూరిస్ట్ ఆకర్షణ

మీన్ ముట్టి జలపాతాలు ఒక మంచి టూరిస్ట్ ఆకర్షణ

మీన్ ముట్టి జలపాతాలు ఒక మంచి టూరిస్ట్ ఆకర్షణ. కేరళలో ఉన్న జలపాతాలన్నింటిలో ఎత్తు పరంగా రెండోది. మీన్ ముట్టి అంటే చేపులు గుంపుగా చేరి అడ్డగింఛిన ప్రదేశం అని చెపుతారు. కొన్ని సహజ కారణాలుగా ఈ ప్రదేశం నుండి చేపలు ఈత కొట్టలేక నిలబడి పోతాయని చెపుతారు. వయనాడ్ లో ఇది ఒక అందమైన సరస్సు. ఈ ప్రదేశం కలపెట్ట నుండి 29 కి.మీ.

PC:wayanadtourism

ఈ సరస్సులో బోటు విహారం చేయవచ్చు

ఈ సరస్సులో బోటు విహారం చేయవచ్చు

ఈ సరస్సులో బోటు విహారం చేయవచ్చు. ఎన్నో ప్రకృతి దృశ్యాలు చూసి ఆనందించవచ్చు. టూరిస్ట్ లకు ఇక్కడ పెడల్ బోటు లు మరియు స్పీడ్ బోటు లు కూడా కలవు. జలపాతం దగ్గరకు వాహనాలు వెళ్లవు. ఇది ఎకో ఫ్రెండ్లీ జోన్‌. జలపాతం చేరడానికి రెండు కిలోమీటర్లు ట్రెకింగ్ చేయాలి.

Photo Courtesy: Vijayakumarblathur

వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లే కొద్దీ ఝమ్మనే శబ్దం

వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లే కొద్దీ ఝమ్మనే శబ్దం

వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లే కొద్దీ ఝమ్మనే శబ్దం తప్ప మరేమీ వినిపించదు. మూడు ఎత్తైన కొండల మధ్య జాలువారే జలపాతం అది. ఆ మూడు కొండలూ మూడు రాష్ట్రాలవి. వయనాడు కేరళ, రెండవది కర్నాటకు చెందిన కూర్గ్ కొండలు, మూడవది తమిళనాడుకు చెందిన కొండలు. ఒక రాష్ట్రం కొండ మీద నిలబడి మరో రెండు రాష్ట్రాల కొండలను చూడడం కూడా గొప్ప అనుభూతి కలిగిస్తుంది. హనీమూన్ కపుల్‌ ఈ ట్రెకింగ్‌లో జలపాతాన్ని చేరే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

Photo Courtesy: Aravind NC

వాయనాడ్ కొండలపై ఉన్న లక్కిడి వ్యూపాయింట్

వాయనాడ్ కొండలపై ఉన్న లక్కిడి వ్యూపాయింట్

వాయనాడ్ కొండలపై ఉన్న లక్కిడి వ్యూపాయింట్, నీలిమల వ్యూపాయింట్ నుంచి చూస్తే కొండలు, లోయలు, పచ్చని అడవుల అందాలు కనివిందు చేస్తాయి. ఈ ప్రదేశాల నుంచి ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారు.

PC:Allen Pookolas

చీన్‌గిరిమల, చెంబ్రా వంటి శిఖరాల

చీన్‌గిరిమల, చెంబ్రా వంటి శిఖరాల

ఊటీ వెళ్ళే మార్గం లో మీన్ ముట్టి వెళ్ళే మార్గంలో కొన్ని పురాతన గుహలు కూడా చూడవచ్చు. వాయనాడ్ జిల్లాలో పురాతనమైన ఎడక్కల్ గుహలలోని కుడ్యచిత్రాలు క్రీస్తుపూర్వం 6 వేల సంవత్సరాల నాటివని చెబుతారు. ఈ గుహలను తిలకించడంతో పాటు చీన్‌గిరిమల, చెంబ్రా వంటి శిఖరాలను అధిరోహించేందుకు పర్వతారోహకులు ఉబలాటపడతారు.

PC:Anil R.V

వనవిహారం మరపురాని అనుభూతి

వాయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యంలో వనవిహారం మరపురాని అనుభూతినిస్తుంది. ఈ అభయారణ్యంలో ఎక్కడ చూసినా ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. జింకలు, దుప్పులు, కుందేళ్లు, పులులు ఇక్కడ యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కేరళ అటవీ శాఖ ఏనుగులపై సవారీ అవకాశం కూడా కల్పిస్తోంది.

మీన్‌ముట్టి జతపాతం నుంచి తిరిగి వచ్చేటప్పుడు

మీన్‌ముట్టి జతపాతం నుంచి తిరిగి వచ్చేటప్పుడు

మీన్‌ముట్టి జతపాతం నుంచి తిరిగి వచ్చేటప్పుడు కొన్ని కాఫీ గింజలు, టీ ఆకులు, మిరియాల గుత్తులు కోసుకుని వయనాడు టూర్ జ్ఞాపకంగా ఇంటికి తెచ్చుకోవచ్చు. మన దగ్గర ధాన్యం ఆరబోసినట్లు వయనాడులో ఇళ్ల ముందు కాఫీ గింజలు ఎండలో ఆరబోసి ఉంటారు. తేమ ఆరిన తర్వాత బస్తాల్లో నింపుతారు. పచ్చదనంలో వెచ్చదనం నిండిన ప్రదేశం వయనాడు. పర్యటన తీపిగర్తుగా మిగిలి తీరుతుంది.

Photo Courtesy: Pillai.mech

వయనాడ్-మీన్ముట్టి కి ఎలా వెళ్లాలి?

వయనాడ్-మీన్ముట్టి కి ఎలా వెళ్లాలి?

సమీప రైల్వేస్టేషన్: వాయనాడ్ జిల్లా కేంద్రం కాల్పెట్టకు సమీపంలోని రైల్వేస్టేషన్ కూడా కోజికోడ్‌లోనే ఉంది. కోజికోడ్ నుంచి 72 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి కాల్పెట్ట చేరుకోవాల్సి ఉంటుంది.

విమానశ్రయం : దూరప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా వాయనాడ్ జిల్లాకు చేరుకోవచ్చు.

రోడ్ మార్గం : కోళీకోడ్ -గుడల్లూర్ రోడ్ నుండి సుమారు 107కిమీ దూరంలో మీన్ముట్టి చేరుకోవచ్చు. కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్‌ల మీదుగా బస్సులు లేదా ట్యాక్సీల్లో వాయనాడ్ జిల్లాకు చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X