Search
  • Follow NativePlanet
Share
» »కదిలే లింగమయ్య ... చూసొద్దాం పదండి !

కదిలే లింగమయ్య ... చూసొద్దాం పదండి !

ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ చెప్పబోయేది ప్రత్యేకమైనది బహుశా మీరు ఇదివరకెన్నడూ చూసిలేకుంటారు కదా కనీసం వినిలేకుంటారు కూడా.

By Mohammad

చాలా మంది హిందువులు శివలింగాలను దర్శించుకుంటుంటారు, పూజలు చేస్తుంటారు. ఇది చాలా కాలం నుండి వస్తున్న ప్రాచీన ఆచారమే. శివలింగం శివున్ని సూచించే ఒక పవిత్ర చిహ్నం. శివం అంటే శుభప్రథం అని, లింగం అంటే సంకేతం అని అర్థం. దాదాపు శివలింగాలన్నీ నల్లని రాతి రూపంలోనే పూజలు అందుకుంటుంటాయని అందరికీ విదితమే ..!

ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ చెప్పబోయేది ప్రత్యేకమైనది బహుశా మీరు ఇదివరకెన్నడూ చూసిలేకుంటారు కదా కనీసం వినిలేకుంటారు కూడా. అదే కదిలే శివలింగం .. ఏంటీ ?? కదిలే శివలింగమా .. ! భలే చెప్పార్లే యాడనైన ఉంటుందా ఆ వింత అనుకుంటున్నారా ? నిజమండి బాబోయ్ ..! అక్కడ దీని గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్పుకుంటుంటారు. అసలు ఏందో అది తెలుసుకోవాలంటే ఉత్తర ప్రదేశ్ కు పోదాంపదండి (ఓసారి ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైలం క్షేత్రంలో కూడా శివలింగం కదిలిందని కధనం).

ఇది కూడా చదవండి : శ్రీ కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన ప్రదేశం !

ఎలా చేరుకోవాలంటే ?

ఎలా చేరుకోవాలంటే ?

ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్పూర్ కు వెళ్ళండి (ఇక్కడ రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి). అక్కడ దిగి 52 కి.మి. దూరంలో ఉన్న దియోరియా వెళ్ళండి. మీకు ఇక్కడికి వెళ్ళటానికి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు దొరుకుతాయి. ఒకవేళ బస్సులో ప్రయాణించాలనుకుంటే ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు లభ్యమవుతాయి.

చిత్ర కృప : Aditya Kaushal

బస్సు పట్టుకోండి

బస్సు పట్టుకోండి

దియోరియా అనేది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. మీరు దియోరియా చేరుకున్నాక అక్కడి నుండి మరళా 27 కి. మీ ల దూరంలో ఉన్న రుద్రపూర్ ('రుద్రపురం' అని కూడా పిలుస్తారు) కు చేరుకోవాలి.

చిత్ర కృప : Dennis Jarvis

కోటలు

కోటలు

రుద్రపూర్ ఒక పట్టణం మరియు నగర పంచాయతి. పూర్వం ఇది సతాసి రాజ్ రాజ్యంగా ఉండేది. ఇప్పటికీ అతను కట్టించిన కోటలు, రాజభవంతులను చూడటానికి పర్యాటకులు అడపదడప వస్తుంటారు.

చిత్ర కృప : Ursula

దుగ్దేశ్వరనాథ్ ఆలయం

దుగ్దేశ్వరనాథ్ ఆలయం

రుద్రపూర్ లో ఎన్ని కోటలున్నా, రాజభావంతులున్నా ప్రత్యేక ఆకర్షణ మాత్రం దుగ్దేశ్వరనాథ్ ఆలయమనే చెప్పితీరాలి. ఎందుకంటే ఆలయ 'ప్రత్యేకతే' దానిని అంత గొప్పగా మార్చేసింది.

చిత్ర కృప :wiki commons

స్వయంభూ లింగం

స్వయంభూ లింగం

ఆలయంలోని శివలింగం మామూలు శివలింగాల మాదిరి పానమట్టం మీద కాకుండా భూమి మీద ప్రతిష్టించబడి ఉంటుంది. ఇదొక స్వయం భూ శివలింగం (వాటంతటవే ఉద్భవించాయి).

చిత్ర కృప : wiki commons

అద్భుత ఘట్టం

అద్భుత ఘట్టం

ఆలయంలోని శివలింగం ఒక అద్భుతం. ఈ శివలింగం కదులుతుంది. చాలా సార్లు కదులుతుందట ..! అది "గంటైన కావచ్చు, రెండు గంటలైన కావచ్చు లేదా పూర్తి ఒకరోజైనా కావచ్చు" అని అక్కడి పూజారులే స్వయంగా చెబుతుంటారు.

చిత్ర కృప : wiki commons

క్యూ లో నిల్చొని మరీ ..!

క్యూ లో నిల్చొని మరీ ..!

శివలింగం కదిలే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు గుంపులు గుంపులు గా వస్తుంటారు. ఒక్కసారి శివలింగం కదలటం ఆగిపోయాక ఎవరు ఎంత కదిలిచ్చిన ఆ లింగం కదలదట .. ! ఈ విడ్డూరాన్ని చూసేందుకు భక్తులు క్యూ లైన్ లో నిల్చోనిమరీ చూస్తుంటారు.

చిత్ర కృప : wiki commons

అంతే మరి !

అంతే మరి !

ఈ శివలింగం ఎంత లోతు వరకు ఉంటుందబ్బా ... ! అని చాలా మంది తవ్వి చూసారట .. ఆ తరువాత ఎంత తవ్విన జాడ తెలియకపోవడంతో నాలుక్కర్చుకున్నారట!

చిత్ర కృప : wiki commons

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X