Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడులో వర్ష రుతువు పర్యాటక ప్రదేశాలు !

తమిళనాడులో వర్ష రుతువు పర్యాటక ప్రదేశాలు !

తమిళనాడు రాష్ట్రం పేరు చెప్పగానే సాధారణంగా మనకందరకూ ఎండవేడి గుర్తుకు వస్తుంది. వేసవిలో తమిళనాడు ఎట్టి పరిస్తులలోను మీ ప్రియమైన వారితో కలసి పర్యటించ దగినది కాదు. ఆ సమయంలో వుండే అధిక వేడి మీ శక్తి సామర్ధ్యాలను తగ్గిస్తుంది. వర్షాకాలం వచ్చేసింది. నగర వేడి వాతావరణం నుండి తప్పించుకునేటందుకు మీకు ఇష్టమైన వారితో కలసి వర్షాలలో ఆనందించేందుకు కొన్ని ప్రదేశాలు సూచిస్తున్నాము. పరిశీలించండి. వర్షాకాలపు మరపు రాని ఆనందపు జల్లులలో విహరించండి.

కొడైకెనాల్

కొడైకెనాల్

కొడైకెనాల్ ను పర్వత నగరాల యువరాణిగా చెపుతారు. తమిళనాడు లోని ఈ కొడైకెనాల్ హిల్ స్టేషన్ అంతా ఒక సరస్సు చుట్టూ అభివృద్ధి అయింది. వర్షాకాలపు పర్యటనలకు సరి అయినది. కోడై కెనాల్ లో మేరు కోకర్స్ వాక్, బ్రియాంట్ పార్క్, బెరిజాం సరస్సు వంటి మరి కొన్ని సుందర ప్రదేశాలు కూడా చూసి వర్షాలను ఆనందించవచ్చు.
Photo Courtesy: C/N N/G

కూనూర్

కూనూర్

నీలగిరి హిల్స్ లోని మూడు హిల్ స్టేషన్ లలో కూనూర్ ఒకటి. ఇక్కడ కల డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్, కేథరిన్ జలపాతాలు, లాంబ్స్ రాక వంటి ప్రదేశాలు తప్పక చూడదగినవి. తమిళనాడు లో కల ఈ వర్ష రుతు పర్యటనా ప్రదేశం మీలో తప్పక ఉత్సాహం పుట్టిస్తుంది.
Photo Courtesy: Thangaraj Kumaravel

ఊటీ

ఊటీ

ఊటీ లో అనేక పార్క్ లు గార్డెన్ లు కలవు. ఇక్కడ అనేక చలన చిత్రాలు కూడా తీస్తారు. ఇక్కడ కల నీలగిరి టాయ్ ట్రైన్ ప్రసిద్ధి చెందినది. మీ ప్రియ సఖులతో కలసి ఈ టాయ్ ట్రైన్ ఆనందాలు జీవితంలో ఒకసారి అయినా సరే తప్పక అనుభవించాలి. ఊటీ లో అనేక సుందర దృశ్యాలు చూసి ఆనందించవచ్చు. కొత్త జంటలకు ఇది హనీమూన్ గా సరైన ప్రదేశం. ఇక్కడ కల థ్రెడ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ మరియు రోస్ గార్డెన్ వంటి వాటిలో జంటలు విహరించవచ్చు. సాహస క్రీడలు కోరే వారు ఊటీ లో అతి ఎత్తైన దొడ్డబెట్ట ప్రదేశం ఎంపిక చేయవచ్చు.

ఏలగిరి

ఏలగిరి

ఒక వారాంతపు విహారంలో పూర్తిగా విశ్రాంతి పొందాలనుకుంటున్నారా ? అలాగయితే, ఏలగిరి సందర్శించండి. నగరానికి దూరంగా అతి ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఏలగిరి మీకు ఎన్నో ఆకర్షణలు అందిస్తుంది. తమిళనాడు లోని ఈ హిల్ స్టేషన్ లో ట్రెక్కింగ్, లేదా బోటింగ్ లేదా హాయిగా సరస్సు ఒడ్డున వర్షాలు చూస్తూ ఆనందించవచ్చు. Photo Courtesy: McKay Savage

కోట గిరి

కోట గిరి

కోటగిరి ప్రకృతి అందాలు పర్వత శ్రేణులను తాకే మేఘాలతో పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. నగరానికి దూరంగా వున్న ఈ విహార ప్రదేశం మీకు పూర్తి ప్రశాంతతను ఇస్తుంది. తమిళనాడు లోని కోటగిరి ప్రదేశంలో మీరు ఇంకనూ కోడనాద్ వ్యూ పాయింట్, కేథరిన్ వాటర్ ఫాల్స్, ఎల్కి ఫాల్స్, స్నో డౌన్ శిఖరం వంటివి ఎన్నో చూడవచ్చు. అన్ని సమస్యలు మరచి ఆనందించగల ప్రదేశం కోటగిరి.

ఎర్కాడ్

ఎర్కాడ్

ఏరి అంటే సరస్సు అని కాడు అంటే అడవి అని తమిళ భాషలో అర్ధం చెపుతారు. తమిళనాడులో కల ఎర్కాడ్ ఈ వర్షాకాలంలో మీకు మీప్రియ సఖులకు అద్భుత ఆనందాలు అందిస్తుంది అనటంలో సందేహం లేదు. వ్యయం తక్కువలో ఇక్కడి అటవీ ప్రదేశాలలో, కాఫీ తోటలలో కాలం గడిపేయవచ్చు.

Photo Courtesy: Ananth BS

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X