Search
  • Follow NativePlanet
Share
» »చిరుజల్లుల్లో విహరించడానికి పర్ఫెక్ట్ అండ్ రొమాంటిక్ బీచ్ లు ..!!

చిరుజల్లుల్లో విహరించడానికి పర్ఫెక్ట్ అండ్ రొమాంటిక్ బీచ్ లు ..!!

చిరుజల్లుల్లో విహరించడానికి పర్ఫెక్ట్ అండ్ రొమాంటిక్ బీచ్ లు ..!!

సాదారణంగా కొంత మందికి వేసవి కాలం ఇష్టం. మరికొందరికేమో వర్షాకాలం ఇష్టం. కాలం ఏదైనా సందర్శనకు అనువైన ప్రదేశాలుంటే ఆ మజాయే వేరు. వేసవిలో కొన్ని ప్రదేశాలు చుట్టొస్తే..వర్షాకాలంలో మరికొన్ని ప్రదేశాలు చుట్టొచ్చు. ఒక్కో సీజన్లో ఒక్కో ప్రదేశం అద్భుతమైన సౌందర్యాన్ని అందిస్తాయి. అలా మన ఇండియాలో చూడవల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా మన ఇండియాలో సముద్ర తీరాలు, తీర ప్రాంతాలు కూడా ఎక్కువే. అందమైన బీచ్ లు వేసవిలోనూ...వర్షంకాలంలోనూ రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. వేసవిలో బీచ్ లు సందర్శించడం సహజం. అదే మాన్ సూన్ లో బీచ్ లు చూడాలంటే అది ఒక ప్రత్యేకం. ఎందుకంటే వర్షాకాలంలో పచ్చటి ప్రకుతి, చల్లటి వాతావారణం, చిరు జల్లుల మద్య బీచ్ లో విహరిస్తే ఆ మజాయే వేరు.

గోవా అంటేనే సుందరమైన బీచ్ లకు ప్రసిద్ది. చిరు జుల్లులు మధ్య అప్పుడప్పుడు సన్నని సూర్యకిరణాలు.. చల్లగా... నునుపుగా.. సముద్రతీరంలోని వెండి వెన్నెలలాంటి నురుగుతో.. బంగారం వర్ణం సుకను తాకుతూ కాళ్ళకు సుతిమెత్తంగా తాకుతుంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. మరి అటువంటి అనుభూతి పొందాలనుకునే వారికి గోవాతో పాటు మరికొన్ని బీచ్ లు కూడా ఉన్నాయి. మరి ఆ రొమాంటి బీచ్ ల గురించి తెలుసుకుందాం...

వర్కలా బీచ్:

వర్కలా బీచ్:

వర్కలా బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలితో వెళ్లడానికి అనువైన ప్రదేశం. ఈ బీచ్ లో సన్ బాత్ మరియు స్వమ్మింగ్ సౌకర్యం ఉంది. ఈ బీచ్ పర్యాటక ఆకర్షణల్లో 2000 సంవత్సరాల నాటి విష్ణు ఆలయం అలాగే బీచ్ కు కొద్ది దూరంలో శివగిరి మఠం ఉన్నాయి. ఈ బీచ్ నుండి పది కిలోమీటర్ల దూరంలో పాపనాసనం(వర్కలా బీచ్) ఉంది. ఇక్కడ సహజసిద్దంగా వీచే గాలిలో ఔషధ గుణాలు మరియు నివారణ లక్షణాలు ఉన్నాయి.ఈ బీచ్ లో మునగడం వల్ల శారీరక రుగ్మతలు తొలగిపోయి, ఆత్మ ప్రక్షాళన చేస్తుందని ఎక్కువ మంది విశ్వసిస్తారు.వర్కాలా పర్యాటకులకు అద్భుతమైన వసతి సౌకర్యాలను అందిస్తుంది మరియు అనేక ఆయుర్వేద మసాజ్ కేంద్రాలతో ప్రసిద్ధ ఆరోగ్య రిసార్ట్ గా మారుతోంది.

PC: Vinayaraj

వెల్నేశ్వర్ బీచ్ :

వెల్నేశ్వర్ బీచ్ :

అద్భుతమై ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వెల్నేశ్వర్ బీచ్ ఉత్తమం. ముఖ్యంగా ఈ బీచ్ లో స్విమ్మింగ్ మరియు సన్ బాతింగ్ కు అనుకూలమైన ఈ ప్రదేశం మహారాష్ట్రలో ఉంది.

ఈ సముద్ర తీరం పొడవునా ఉన్న కొబ్బరి తోటలు, సముద్ర అలల తీరం నుండి బిగ్గరగా వినిపించే సముద్రపు ఘోష, అలలలో సందడి చేసే సముద్రపు తరంగాలతో పరిశుభ్రంగా ఉండటం ఈ బీచ్ యొక్క ప్రత్యేక లక్షణం. నెలవంక ఆకారంలో ఉన్నఈ బీచ్‌లో పొడవైన కొబ్బరి తోటలను చూడటం వల్ల మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తుంది.

PC: Udaykumar PR

మరావంతే బీచ్:

మరావంతే బీచ్:

ప్రశాంత జీవనం కోరేవారి స్వర్గం ఈ బీచ్ ను తరచుగా వర్జిన్ బీచ్ లేదా కన్యత్వ బీచ్ అంటారు. దానికి కారణం ఈ బీచ్ మైళ్ళ పొడవున ఏ మాత్రం పాడవకుండా తెల్లటి ఇసుకతో పరచబడి ఉంటుంది. పర్యాటకులు ఎంతో ఇష్టపడే ఈ బీచ్ కొల్లూరు మరియు కొడచాద్రి కొండలకు సమీపంలో ఉంది. ఇక్కడినుండి జాతీయ రహదారి షుమారు 100 మీటర్ల దూరం మాత్రమే. కనుక మీరు బీచ్ సందర్శించటం ఎంతో మరవంతే బీచ్ ఉడుపి పట్టణానికి 55 కి.మీ. దూరంలో ఉంది. అందమైన బీచ్ ఇది. కంచుగోడు గ్రామం వద్దగల ప్రదేశంలో స్కూబా డైవింగ్, స్నోర్ కెలింగి వంటి ఆటలు ఆడవచ్చు. బీచ్ లో స్విమ్మింగ్ కూడా చేయవచ్చు. బీచ్ సమీపంలోగల సౌపర్ణిక నది ఒడ్డునకల దేవాలయాన్ని సందర్శించవచ్చు. కొడచారి హిల్స్ మరియు అందమైన కొబ్బరి తోటలు దాని వెనుక కనపడే బీచ్ వంటివి పర్యాటకులకు కన్నుల విందు చేస్తాయి.

PC: Rayabhari

సెయింట్ మేరీస్ ఐలాండ్

సెయింట్ మేరీస్ ఐలాండ్

మాల్పే తీరానికి 6కి.మీ దూరంలో ఉంది. ఈ ఐలాండ్ ను వాస్కోడగామ 1498లో కనుగొన్నాడు ఈ ఐలాండ్ 300మీ పొడవు, 100మీ వెడల్పు ఉంది. ఉప్పు తయారీకి ప్రసిద్ది చెందిన ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ ను కోకోనట్ ఐలాండ్ మరియు తాన్సేపార్ ఐలాండ్ అనికూడా అంటారు. ఇవి మొత్తంగా నాలుగు ద్వీపాలు అరేబియన్ సముద్రం కి దగ్గరిగా కర్నాటక లోని ఉడిపి లో మాల్పే కోస్తా తీరంలో కలవు. ఇవి లావా వెదజల్లబడి ఏర్పడి నట్లు చెపుతారు. ఈ ద్వీపాలు ఇండియా లో 26 వ భూ గర్భ స్మారకాలు. ఇవి ' జియో టూరిసం కు ప్రసిద్ధి.

St.Mary's Island

ప్రొమెనేడ్ బీచ్ :

ప్రొమెనేడ్ బీచ్ :

మీ ప్రియమైన వారితో ఆహ్లాదంగా గడపడానికి మరియు ప్రశాంత వాతావరణంలో గడపాలంటే ప్రోమెనేడ్ బీచ్ కు వెళ్ళాల్సిందే. ఈ బీచ్ సాయంత్రం విహారానికి అంద్భుతంగా ఉంటుంది. సముద్ర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలి నడకన నడుస్తూ ఉంటే మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది. ఈ బీచ్ పాండిచ్ఛేరికి 1.2కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బీచ్ కు చేరుకునే సమయంలో మద్యలో వార్ మెమోరియల్ నుండి డూప్లెక్స్ పార్క్ వరకు అద్భుతమైన ప్రదేశాలను చూడవచ్చు. ఈ బీచ్ లో స్థానికులు మార్నింగ్ అండ్ ఈవెనింగ్ వాక్ చేస్తుంటారు. ఈ బీచ్ తీరంలో సీఫేసింగ్ రెస్టారెంట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం చూడవచ్చు. చల్లని వాతావరణంలో ఎంజాయ్ చేయడానికి కొన్ని స్నాక్స్ ను కూడా పట్టుకెళ్ళవచ్చు.

PC:Karthik Easvur

అంజర్లే బీచ్:

అంజర్లే బీచ్:

ఇది ఒక అద్భుతమైన తెల్లని ఇసుక ఉన్న బీచ్. దీన్ని రత్న గిరి సమీపంలో కనుగొనడం జరిగింది. ఈ బీచ్ లో ప్యారాసైలింగ్ , స్నోర్కెలింగ్ మరియు వైండ్ సర్ఫింగ్ వంటి స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే అక్కడే లోకల్ గా సీఫుడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ అంజ్లే బీచ్ దగ్గ డాల్ఫిన్ కూడా చూడవచ్చు. ఈ బీచ్ కు సమీపంలో కద్యవార్చా గణపతి టెంపుల్ ను సందర్శించవచ్చు.

PC: Sandip Dey

రాధానగర్ బీచ్ :

రాధానగర్ బీచ్ :

ఇక పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్న రాధానగర్ బీచ్ ను 7 బీచ్ అని పిలుస్తారు. హ్యావ్లాక్ ద్వీపంలో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన ద్వీపాల్లో దీనిదే మొదటిస్థానం. ఆసియాలో అత్యుత్తమ బీచ్ లో ఒకటిగా 2004లో ఈ బీచ్ ఎంపికయ్యింది.అంతేకాకుండా ఈ ద్వీపానికి వాయువ్య ప్రాంతంలో ఉన్న ఎలిఫెంటా బీచ్, తూర్పు భాగంలో ఉన్న విజయనగర బీచ్ దీనిని బీచ్ నంబర్ 5 అని కూడా పిలుస్తారు. అదే విధంగా బీచ్ నంబర్ 3, బీచ్ నం 1 లు కూడా అత్యంత ప్రజాధరణ పొందాయి.

PC: Kaila5hravi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X