Search
  • Follow NativePlanet
Share
» »మహిమలు కల మూకాంబిక దేవి ఆలయం, కొల్లూర్ !!

మహిమలు కల మూకాంబిక దేవి ఆలయం, కొల్లూర్ !!

మంగళూరుకు 147 కిమీ దూరములో సౌపర్ణిక నది ఒడ్డున మరియు పచ్చని కోడచాద్రి కొండల చుట్టూ ఉన్న ఈ ఆలయం ఏటా లక్షలాది యాత్రికులను ఆకర్షిస్తుంది.

By Mohammad

మూకాంబిక దేవి కర్ణాటకలోని 'ఏడు ముక్తిస్థల క్షేత్రాలలో' ఒకటి. కొల్లూర్ లో వెలసిన మూకాంబిక దేవిని శక్తి, సరస్వతి మరియు మహాలక్ష్మి స్వరూపముగా భావించడంతో, భక్తులకు మూకాంబిక దేవి పై అపార విశ్వాసం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత, మహిమలు కలిగిన ఆలయం ఇది. కేవలం కర్ణాటక భక్తులేకాక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల నుండి దేవిని దర్శించుకోవటానికి వస్తుంటారు.

ఇది కూడా చదవండి : కర్ణాటకలోని దివ్య ముక్తిస్థల క్షేత్రాలు !

మంగళూరుకు 147 కిమీ దూరములో సౌపర్ణిక నది ఒడ్డున మరియు పచ్చని కోడచాద్రి కొండల చుట్టూ ఉన్న ఈ ఆలయం ఏటా లక్షలాది యాత్రికులను ఆకర్షిస్తుంది. హిందువులు గౌరవించే ఋషి మరియు వేద పండితుడైన అది శంకరతో ఈ ఆలయానికి సంబంధం ఉండడంతో భక్తులకు ఈ ఆలయం ఎంతో ప్రముఖమైనది. సుమారు 1200 సంవత్సరాల క్రితం కొల్లూరులో మూకాంబిక దేవి ఆలయం ఒకటి నిర్మిచాలని అది శంకర అనుకుని విగ్రహాన్ని తనే స్వయంగా ప్రతిష్ఠించారట.

కోడచాద్రి శిఖరం క్రింద

కోడచాద్రి శిఖరం క్రింద

మూకాంబికా దేవి ఆలయం కోడచాద్రి శిఖరం క్రింద ఉంటుంది. ఆ దేవత జ్యోతిర్-లింగ రూపంలో శివ మరియు శక్తి ఇద్దరినీ కలుపుకుని ఉంటుంది. శ్రీ చక్ర మీద ఉన్న ఆ దేవత యొక్క పంచలోహ మూర్తిని ఆది శంకరాచార్య ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ప్రతిష్ఠించారని అంటారు.

చిత్రకృప : Yogesa

సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళడం కష్టం

సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళడం కష్టం

దేవత యొక్క మొట్టమొదటి స్థానం కోడచాద్రి శిఖరం మీద ఉందని, సామాన్య ప్రజానీకానికి కొండ ఎక్కి వెళ్ళటం చాలా కష్టమవడంతో, శంకరాచార్య ఆ దేవాలయాన్ని కోలూర్ లో తిరిగి స్థాపించారని ప్రజలు నమ్ముతారు.

చిత్రకృప : Vinayaraj

శ్రీ దేవీ మూకాంబిక యొక్క అలంకృత ఆభరణాలు

శ్రీ దేవీ మూకాంబిక యొక్క అలంకృత ఆభరణాలు

దేవాలయంలో ఒక పెద్ద ఆభరణాల నిధి ఉంది. అవి దేవి యొక్క దీవతలతో తమ కలలు, కోరికలు తీరిన గుర్తుగా భక్త సమాజం ఇచ్చిన కానుకలు. దేవికి ఉన్న అనేక నగలలో, మరకతం ఉన్న నగ ఎంతో విలువైనది. మరకతము జ్ఞానాన్ని సూచిస్తుంది. గతంలో తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి అయిన శ్రీ ఎం.జీ.ఆర్. ఒక కిలో బరువు మరియు రెండున్నర అడుగుల పొడవు ఉన్న ఒక బంగారు కత్తిని బహుకరించార కూడా.

చిత్రకృప : Yogesa

ఆలయ దర్శన వేళలు

ఆలయ దర్శన వేళలు

మూకాంబిక దేవాలయం ను ఉదయం 5 గంటలకు తెరుస్తారు. ఉదయం 7 :30 గంటలకు - మంగళ ఆరతి, మధ్యాహ్నం 12 గంటలకు మహా నైవేద్య నిర్వహిస్తారు మరియు మధ్యాహ్నం ఒంటిగంటకు మూస్తారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తెరుస్తారు. రాత్రి 9 గంటలకు గుడి తలుపులు మూసేస్తారు.

చిత్రకృప : Yogesa

సంగీత ఉత్సవం

సంగీత ఉత్సవం

తొమ్మిది-దినాల సంగీత ఉత్సవం దేవాలయంలో ప్రతి జనవరిలో మొదలవుతుంది. ప్రఖ్యాత గాయకుడు ఏసుదాసు ఇక్కడికి వచ్చి సరస్వతిదేవి కీతనాలు పాడుతారు. ఈ సంగీతార్చనలో ‘పంచరత్న గాయాన' అనే త్యాగరాజ పద్యాలు కూడా ఉన్నాయి.

చిత్రకృప : Yogesa

ఇతర దేవాలయాలు

ఇతర దేవాలయాలు

కొల్లూర్ శ్రీ మూకాంబికా దేవాలయములోని ఇతర దేవతలు శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ పార్థేశ్వర, శ్రీ పంచముఖ గణపతి, శ్రీ చంద్రమౌళీశ్వర, శ్రీ ప్రాణలింగేశ్వర, శ్రీ నంజుండేశ్వర, శ్రీ ఆంజనేయ, శ్రీ వెంకటరమణ, శ్రీ తులసి గోపాలకృష్ణలు.

చిత్రకృప : Iramuthusamy

ఉత్సవాలు

ఉత్సవాలు

నవంబరులో జరిగే నవరాత్రి ఉత్సవాలలో, ఆ దేవాలయం భక్తులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ జన్మాష్టమి లేదా కృష్ణ జయంతి కూడా ఒక ప్రముఖ పండుగే. స్వయం భూలింగ ఈ రోజునే కనిపించిందని నమ్ముతారు. భక్తులకు ప్రతి రోజు మధ్యాహ్నము మరియు సాయంత్రము ఉచితంగా అన్నదానం చేయడం జరుగుతుంది.

చిత్రకృప : Deepugn

కొల్లూర్ పరిసరాలలో ప్రకృతి

కొల్లూర్ పరిసరాలలో ప్రకృతి

కొల్లూర్ గ్రామము చుట్టూతా పచ్చని దట్టమైన అరణ్యం మరియు అరేకా పప్పు తోటలు ఉన్న ఇతర చిన్న గ్రామాలు ఉంటాయి. పశ్చిమ ఘాట్ లోని ఇతర శిఖరాలతో పాటు కోడచాద్రి శిఖరం కూడా ఆలయం నుంచి అందంగా దర్శనం ఇస్తుంది. అడవి ఎప్పుడూ పచ్చగా ఉండి అనేక రకాల అటవీ జంతువులు మరియు పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. అరుదైన మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. కొల్లూర్ మరియు కోడచాద్రి మధ్య ఉన్నఅంబవన అనే అడవికి ఎవరూ వెళ్ళలేరట.

చిత్రకృప : syam

జలపాతాలు

జలపాతాలు

అరసినగుండి అనబడు ఒక అందమైన జలపాతం దేవాలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం కోడచాద్రి కొండల క్రింద ఉండి, ఆ ప్రాంతంలోనే అత్యంత సుందర దృశ్యాలలో ఒకటిగా నిలిచింది. డాలీ పల్లెటూరు వద్ద ఉన్న ఈ జలపాతాన్ని చూడాలంటే 3 కిలోమీటర్లు కొండ ఎక్కాలి.

చిత్రకృప : Ashwin Kumar

సౌపర్ణిక నది

సౌపర్ణిక నది

మూకాంబికా అరణ్య ప్రాంతములో ప్రవహించే అగ్నితీర్ధ & సౌపర్ణిక అనే రెండు నదులు కోడచాద్రి కొండల నుండి దిగుతున్నాయి. కాలభైరవ మరియు ఉమామహేశ్వర ఆలయాల మధ్య ఉన్న చల్లటి నీటి జలమే సౌపర్ణిక నది యొక్క మూలం. తన తల్లి వినుత యొక్క కష్టాలను పోగొట్టమని దేవిని ప్రార్థిస్తూ సుపర్ణ (గరుడ) ఈ నది ఒడ్డునే తపస్సు చేశాడని పురాణాలు చెపుతున్నాయి. తపస్సు చేసిన స్థలము "గరుడ గుహ" అని పిలవబడే ఒక చిన్న గుహగా ఈ నాటికి కూడా ఉంది.

చిత్రకృప : Wilsoncold

దగ్గరలో ఉన్న చూడవలసిన ప్రదేశాలు

దగ్గరలో ఉన్న చూడవలసిన ప్రదేశాలు

బైందూర్ - 15 కి.మీ., ఒట్టిననే - 14 కి.మీ., రహదారి దగ్గర నగర కోట - 30 కి.మీ., మూకంబిక రిజర్వ్ అటవీ - 5 కి.మీ., సిగండుర్ - 35 కి.మీ., మరవంతే - 20 కి.మీ. మొదలగునవి.

చిత్రకృప : Ashwin Kumar

నివాస వసతులు

నివాస వసతులు

కొల్లోర్ లో అనేక లాడ్జింగ్లు ఉన్నాయి. దేవాలయ దేవస్వాం సౌపర్ణిక అనే ఒక వసతిగృహాన్ని నిర్వహిస్తుంది. మొత్తం మీద దాదాపుగా 400 గదులు ఉన్నాయి. గది అద్దెలు సామాన్య భక్తులకు అందుబాటులోనే ఉంటాయి. ఒంటరి సందర్శకులకు బస్సు స్టాండు సముదాయము యొక్క ఆవరణలోనే ఒక డార్మిటరీ ఉంది.

చిత్రకృప : Ajaykuyiloor

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

కొల్లూర్ మూకాంబిక మెటల్ రోడ్డు ద్వారా చేరుకునే వీలు కలిగి ఉండి, మంగుళూరు, ఉడుపి, మరియు కుందాపూర్ నుండి నేరు బస్సులు ఉన్నాయి. కొంకణ్ రైల్వే దారిలోని కుండాపూర్ లేక మూకాంబికా రోడ్డు (బైన్డూర్) లు అత్యంత చేరువలో ఉన్న రైల్వే స్టేషన్లు. మంగళూరు విమానాశ్రయం దగ్గరలో ఉన్నది.

చిత్రకృప : Vinayaraj

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X