Search
  • Follow NativePlanet
Share
» »వినాయక చవితి రోజున వీటిలో ఒక్క దేవాలయాన్నైనా సందర్శించారా?

వినాయక చవితి రోజున వీటిలో ఒక్క దేవాలయాన్నైనా సందర్శించారా?

భారత దేశంలో అత్యంత ప్రాచూర్యం పొందిన పురాతన దేవాలయాలకు సంబంధించిన కథనం.

అన్ని వేలల అగ్రపూజలను అందుకొనే గణనాథుడిని కొలుచుకొనేందుకు దేశం నలుమూలలా ప్రజానీకం సన్నద్దమవుతోంది. సెప్టెంబర్ 13న వినాయక చవితిని ఘనంగా జరుపుకొనేందుకు భక్తులు సన్నద్దమవుతుంన్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక మంటపాలను ఏర్పాటు చేసి అక్కడ వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. అనంతరం ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాల్లో ఈ వినాయకచవితిని మరింత ప్రత్యేకంగా ఘనంగా నిర్వహిస్తారు. చిత్తూరులోని కాణిపాకం గణపతి ఆలయంలో బ్రహోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దేశంలోని ఐదు ప్రముఖ గణపతి ఆలయాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

శ్రీ సిద్ధి వినాయక దేవాలయం, ముంబై

శ్రీ సిద్ధి వినాయక దేవాలయం, ముంబై

P.C: You Tube

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో కొలువు దీరి ఉంది శ్రీ సిద్ధి వినాయక ఆలయం. ముంబైలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని 1801 లో లక్ష్మణ్ విటు, దూబే పాటిల్ నిర్మించారు. బాలివుడ్ స్టార్స్ తో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అప్పటి ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ శ్రీమంత్ దగ్దు షేత్ హల్వాయ్ గణపతి ఆలయం

శ్రీ శ్రీమంత్ దగ్దు షేత్ హల్వాయ్ గణపతి ఆలయం

P.C: You Tube
పూనేలో నెలకొన్న ఈ ఆలయం మహారాష్ట్రలోని అత్యంత ప్రముఖమైన ఆలయాల్లో రెండోది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు. సాధారణ భక్తులతో పాటు అనేకమంది ప్రముఖులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని మిఠాయి వ్యాపారం చేసుకొనే దగ్దు షేత్ హల్వాయ్ 1893లో నిర్మించారు.

కాణిపాక వినాయక ఆలయం చిత్తూరు

కాణిపాక వినాయక ఆలయం చిత్తూరు

P.C: You Tube
చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువుదీరిన ఈ ఆలయం అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకొంది. 11వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయాన్ని అభివ`ద్ధి చేశారు.

రంథమ్ బోర్ గణేష్ ఆలయం, రాజస్థాన్

రంథమ్ బోర్ గణేష్ ఆలయం, రాజస్థాన్

P.C: You Tube
దేశంలోని ప్రముఖమైన గణేష్ ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం వెనుక ఒక చారిత్రాత్మకమైన ఆసక్తికరమైన కథ ఉంది. పురాణాల ప్రకారం ఈ ఆలయంలో క`ష్ణుడు, రుక్మిణిల వివాహ ఆహ్వన పత్రికను అందజేసి పూజలు జరిపినట్లు చెబుతారు. అందుకే దేశంలోని చాలా ప్రాంతాల్లోని భక్తులు తమ, తమ వివాహ ఆహ్వాన పత్రికలను స్వామివారి ఆశిస్సుల కోసం పంపుతూ రావడం ఆనవాయితీగా వస్తోంది.

రాక్ ఫోర్ట్ ఉచ్చి పిళ్లయార్ కోయిల్

రాక్ ఫోర్ట్ ఉచ్చి పిళ్లయార్ కోయిల్

P.C: You Tube
తమిళనాడులోని తిరుచ్చురాపల్లిలో కొలువైన ఈ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించినదని చరిత్ర చెబుతోంది. దాదాపు 272 అడుగుల ఎతైన ఏక శిలా రాతిని తొలచుతూ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు.

ఇక్కడ ఆంజనేయస్వామి, కుళ్లాయిస్వామి భాయ్, భాయ్ఇక్కడ ఆంజనేయస్వామి, కుళ్లాయిస్వామి భాయ్, భాయ్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X