Search
  • Follow NativePlanet
Share
» »దేవుడు వున్నాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం దొరకదు...

దేవుడు వున్నాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం దొరకదు...

విశ్వమంతా ఓంకారంతో నిండిపోయింది.నిరాకారంతో వున్న శివుడు దేశంలోని మూలమూలలా పూజింపబడుతున్నాడు. శివుడు ఒకేవిధమైన ఆకారంలో లేదా వివిధ ఆకారాలలో అనేక పవిత్రమైన స్థలాలలో వెలసియున్నాడు.

By Venkatakarunasri

విశ్వమంతా ఓంకారంతో నిండిపోయింది.నిరాకారంతో వున్న శివుడు దేశంలోని మూలమూలలా పూజింపబడుతున్నాడు. శివుడు ఒకేవిధమైన ఆకారంలో లేదా వివిధ ఆకారాలలో అనేక పవిత్రమైన స్థలాలలో వెలసియున్నాడు.ఇప్పుడు మనం తెలుసుకోబోయేదేమిటంటే ఈ దేవాలయంలో శివలింగం యొక్క రంగు మారటం.దేవుడు వున్నాడు అనే దానికి ఇదొక వుత్తమమైన వుదాహరణ. కొన్ని శివ లింగాలు స్థలపురాణం ప్రకారం ప్రాముఖ్యత వహిస్తాయి.చిన్నశివలింగం, పెద్దశివలింగం, రంగుల శివలింగం, విభిన్న ఆకారాలు కలిగిన శివలింగం ఈ విధంగా అనేకరీతులలో వుంటాయి.ప్రస్తుతం అతిచిన్నదైన శివలింగం ఎక్కడుంది?దీని విశిష్టత ఏమిటి?అనే దానిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కోటి పల్లి

కోటి పల్లి

తూర్పు గోదావరి ఇల్లాలోని ద్రాక్షారామానికి 10కిమీలలో వుండే కోటి పల్లి అనే గ్రామంలో అత్యంత చిన్నదైనా శివలింగం వుంది.ఇక్కడ వెలసిన స్వామిని సోమేశ్వరుడు మరియు కోటేశ్వరుడు అని భక్తులు పిలుస్తారు.ఈ దేవాలయంలో వున్న శివలింగం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ కోటేశ్వరశివలింగం ఎప్పుడూ నీటిలోనే వుంటుందట.

PC: youtube

భీమారామ క్షేత్రం

భీమారామ క్షేత్రం

పంచారామ క్షేత్రాలవిషయానికొస్తే భీమారామ క్షేత్రంలో ఈ శివ లింగం తన రంగును మార్చుకుంటుందట.అందులోనూ అమావాస్యరోజుల్లో గోధుమరంగు, పౌర్ణమి రోజుల్లో తెలుపు రంగులో రంగులు మారుతుంది.

PC: youtube

భీమారామ క్షేత్రం

భీమారామ క్షేత్రం

అయితే స్వామికి కవచం అయినటువంటి పుష్పాలంకరణ చేయటంవలన శివ లింగం రంగు సాధారణంగా కంటికి కనిపించదు.ఈ ఆశ్చర్యాన్ని చూడాలంటే అమావాస్యరోజున, పౌర్ణమిరోజున దర్శించుకుంటే మనం ఈ అద్భుతాన్ని కనులారా చూసి పున్యాత్ములౌతాము.సాధారణంగా శివ లింగం అంటే పరమశివుడు లింగ రూపంలో కనిపిస్తాడు.

PC: youtube

సురుటిపల్లి

సురుటిపల్లి

తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళేమార్గంలో సురుటిపల్లి అనే వూరిలో పరమశివుడు పార్వతీ దేవి తొడమీద పవళించివున్న విభిన్నమైన శివ లింగాన్ని దర్శించుకోవచ్చును.

PC: youtube

తంజావూరు

తంజావూరు

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటేతంజావూరులో వున్న శివలింగం అత్యంత పెద్దదైన శివలింగం. ఈ దేవాలయం విశేషం ఏంటంటే దేవాలయం లోపలిభాగాన ప్రతిధ్వని అనేది లేదు.

ప్రతిధ్వని లేకుండా శివ లింగాన్ని దర్శించుటకు లోపలి వెళ్ళేవిధంగా నిర్మించారు.

PC: youtube

పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరి

దేశంలోని ఎక్కడాచూడని విధంగా విభిన్నమైన శివ లింగం ఏందంటే పశ్చిమగోదావరి జిల్లాలోని పరమేశ్వరుడు తల క్రిందులుగా వున్న శివలింగం.అంటే ఇక్కడ స్వామి తపస్సుచేస్తున్న భంగిమలో వున్నాడు అని చెప్పవచ్చును.

PC: youtube

శ్రీకాళహస్తి దేవాలయం

శ్రీకాళహస్తి దేవాలయం

శ్రీకాళహస్తి దేవాలయంలోని పరమ శివుడు వాయురూపంలో పూజలందుకుంటాడు.ఈ దేవాలయంలోని గర్భగుడిలోని కుడివైపున గల దీపం గాలిలో వేలాడుతున్నట్లు కనిపిస్తుంది.ఎందుకంటే ఈ దేవాలయంలోగాలి ఆడటానికి ఎటువంటి అవకాశం లేకుండానే దీపం గాలిలో తేలాడుతూవుండటం.ఆశ్చర్యకరమైన విషయం.

PC: youtube

జంబుకేశ్వర శివలింగం

జంబుకేశ్వర శివలింగం

జంబుకేశ్వర శివలింగం నుండి నీరు ప్రవహిస్తూనే వుంటుంది.ఈ శివలింగాన్ని భక్తులు నీటిశివ లింగం అని పిలుస్తారు.

PC: youtube

అచలేశ్వర మహదేవ్ దేవాలయం

అచలేశ్వర మహదేవ్ దేవాలయం

రాజస్థాన్ లోని అచలేశ్వర మహదేవ్ దేవాలయంలోని శివలింగం రోజుకు రెండుసార్లు రంగులు మారుతుందంట.ప్రొద్దునసమయంలో కుంకుమ రంగులో ,రాత్రి సమయంలో నలుపురంగులోకి మారుతుంటుందంట.

PC: youtube

శాస్త్రవేత్తల ప్రకారం

శాస్త్రవేత్తల ప్రకారం

శాస్త్రవేత్తల ప్రకారం సూర్యకిరణాల కారణంగా శివలింగం యొక్క రంగులు మారుతూవుంటుందని చెప్పవచ్చును.అయితే రంగులు మారటానికి ఇదే ఖచ్చితమైన కారణమని చెప్పలేము.

PC: youtube

అమర్ నాథ్ దేవాలయం

అమర్ నాథ్ దేవాలయం

అమర్ నాథ్ దేవాలయంలో మంచుతోకూడిన శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు. విషయమేమిటంటే మంచుతో కూడిన ఇటువంటి శివలింగం వేరే ఏదేశాలలో చూడటానికి సాధ్యంకాదని చెప్పవచ్చు.

PC: youtube

గుడిమల్లం

గుడిమల్లం

ఈ దేవాలయం తిరుపతికి వెళ్ళే మార్గంలో వుంది. ఇక్కడి శివలింగం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా వుంది. అదేంటంటే ఇక్కడి మహా శివుడు వేటగానివేషంలో వుండటం విశేషం. ఈ దేవాలయాన్ని 1 వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పబడింది.

PC: youtube

పశుపతినాథ దేవాలయం

పశుపతినాథ దేవాలయం

ఈ పశుపతినాథ దేవాలయంలో శివుడు లింగాకారంలో లేకుండా ముఖాన్ని కలిగివున్న ప్రత్యేకమైన దేవాలయం ఇది. శివరాత్రిరోజున అనేకమంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించటానికి వస్తూవుంటారు.

PC: youtube

విభిన్న శివలింగాలు

విభిన్న శివలింగాలు

ఇదే విధంగా అనేకరకములైన విభిన్న శివలింగాలు మన దేశంలో వుండటం మన భాగ్యం.ఒక్కసారి ఈ అద్భుతమైన ఆలయాన్ని దర్శించండి.

PC: youtube

నల్లమల అడవుల్లో ఏముందో తెలిస్తే షాక్ తినకమానరు !నల్లమల అడవుల్లో ఏముందో తెలిస్తే షాక్ తినకమానరు !

ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు !ఆ పర్వతంపై ఒక రాత్రి నిద్రిస్తే చాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X