Search
  • Follow NativePlanet
Share
» »శని చూపు పడకూడదంటే ఇక్కడికి ఒక్కసారైనా వెళ్లండి

శని చూపు పడకూడదంటే ఇక్కడికి ఒక్కసారైనా వెళ్లండి

భారత దేశంలో వివిధ చోట్ల ఉన్న శనిమహాత్ముడి దేవాలయాలకు సంబంధించిన కథనం.

నవగ్రహాల్లో శని అత్యంత శక్తివంతుడని పేరు. అతడు మనలను చూసే చూపల వల్ల మన జీవితంలో కష్టసుఖాలు కలుగుతాయని చెబుతారు. శని మహాత్ముడు మనలను మంచి దష్టితో చూస్తే మనకు మంచి కలుగుతుందని, చెడు దష్టితో చూస్తే చెడు కలుగుతుందని చెబుతారు. అందువల్లే ఆ శని మహాత్ముడి చూపు తమ పై చల్లగా ప్రచురించి తమ జీవితం సుఖమయం చేయాలన్న ఉద్దేశంతో భారత దేశంలో అత్యంత అరుదుగా ఉన్న శనీశ్వరుడి దేవాలయాలకు పనిగట్టుకొని మరీ భక్తులు వెలుతుంటారు. అక్కడి స్థానిక ఆచారాలను అనుసరించి నువ్వుల నూనే, నల్లని వస్త్రాలు తదితర వస్తువులను స్వామివారికి సమర్పించి ఆయన కపాకటాక్షణ వీక్షణలు తమ పై ప్రసురించాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శనిమహాత్మ దేవాలయాల గురించి క్లుప్తమైన సమాచారం మీ కోసం...

శనిధామ దేవాలయం

శనిధామ దేవాలయం

P.C: You Tube

భారతదేశ రాజధాని ఢిల్లీ దక్షిణ ప్రాంతంలో ఉన్న ఛతర్ పుర దేవాలయాల సమూహం నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఈ శనిధామ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయంలోని శనిమహాత్ముడి విగ్రహం ప్రపంచంలోనే రెండో అతి ఎత్తైన విగ్రహంగా పేరుగాంచింది. ప్రతి శనివారం ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు వచ్చి కానుకలు సమర్పిస్తుంటారు.

ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.

ఉడిపిలోని బెన్నంజేయ శని దేవాలయం

ఉడిపిలోని బెన్నంజేయ శని దేవాలయం

P.C: You Tube

ఉడిపి అన్న తక్షణం మనకు ఆ నల్లనయ్య దేవాలయం గుర్తుకు వస్తుంది. అయితే ఉడిపికి దగ్గర్లోని బెన్నంజెయ శనీశ్వర దేవాలయం కూడా అత్యంత ప్రాచూర్యం పొందింది. ఇక్కట ప్రతిష్టించిన శని మహాత్ముడు దాదాపు 23 అడుగుల ఎత్తు ఉంటాడు. అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఈ శని మహాత్ముడిని చూడగానే భక్తి రెట్టింపవుతుందనడంలో అతిశయోక్తి లేదు. శనివారంతో పాటు మంగళవారం కూడా ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

ఓంకారాన్ని దేవతగా పూజించే ప్రపంచంలోని ఏకైక క్షేత్రంఓంకారాన్ని దేవతగా పూజించే ప్రపంచంలోని ఏకైక క్షేత్రం

తిరునల్లార్ శనీశ్వర దేవాలయం

తిరునల్లార్ శనీశ్వర దేవాలయం

P.C: You Tube

దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధ శనిమహాత్మ దేవాలయాల్లో తిరునల్లార్ శనీశ్వర దేవాలయం ఒకటి. ఈ దేవాలయం పుదుచ్చేరిలోని కారైకాల్ లో ఉంది. ఈ దేవాలయంలో ఆధునిక సాంకేతిక పరిజ్జానానికి కూడా అంతుబట్టని ఎన్నో సంఘటనలు జరిగాయి. ఈ దేవాలయంలోని శనిమహాత్ముడి విగ్రమం విభిన్నంగా ఉంటుంది. భారత దేశంలో శనిమహాత్ముడి దేవాలయాల పైకి ఎక్కువ మంది సందర్శించే దేవాలయం తిరునల్లార్ శనీశ్వర దేవాలయం.

శని దేవాలయం, ఉత్తరప్రదేశ్

శని దేవాలయం, ఉత్తరప్రదేశ్

P.C: You Tube

శని దేవ ధామ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ ఘడ్ జిల్లాలోని విశ్వనాథ గంజ్ పట్టణం నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. నల్లరాతి గ్రానైట్ తో నిర్మించిన ఈ దేవాలయం చూడటానికి చాలా బాగుంటుంది. ప్రతి శనివారంతో పాటు నవరాత్రి సమయాల్లో ఈ దేవాలయాన్ని ఎక్కువ మంది భక్తులు సందర్శిస్తుంటారు.

లోక నాయక శనేశ్వర దేవాలయం

లోక నాయక శనేశ్వర దేవాలయం

P.C: You Tube

కాయమత్తూరులో ఉన్నటువంటి లోక నాయక శనీశ్వర దేవాలయం భారతదేశంలో ప్రాచూర్యం చెందిన శనీశ్వర దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ శనిమహాత్ముడి విగ్రహం ఏడుఅడుగులు ఉంటుంది. ప్రతి శనివారం ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. అంతేకాకుండా ప్రతి ఏటా జరిగే రథోత్సవం సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు ఎక్కువగా హాజరవుతారు.

శని సింగ్నాపూర్

శని సింగ్నాపూర్

P.C: You Tube

మహారాష్ట్రలో ఉన్న శని సింగ్నాపూర్ భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ శని మహాత్ముడు స్వయంభువుడని నమ్ముతారు. ఈ శని సింగ్నాపూర్ గ్రామంలో ఏ ఇంటికి కూడా ద్వారాలు ఉండవు. తరతరాలుగా ఈ ఆచారం ఇలా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఉన్న బ్యాంకుకు కూడా తలుపులు లేవు. ఇక్కడ ఇళ్లకు ద్వారాలు లేకపోయినా ఇప్పటి వరకూ ఒక్క దొంగతనం కూడా జరగక పోవడం గమనార్హం.

రావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవేరావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవే

ఈ ఆశ్రమంలో ఉన్నవారికి చావన్నదేరాదా?ఈ ఆశ్రమంలో ఉన్నవారికి చావన్నదేరాదా?

ఈసారి దసరా కు మైసూరు వెళుతున్నారా? ఈ విషయాలన్నీ మీకు తెలుసాఈసారి దసరా కు మైసూరు వెళుతున్నారా? ఈ విషయాలన్నీ మీకు తెలుసా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X