Search
  • Follow NativePlanet
Share
» »దయ్యాలున్న ప్రాంతాలు ఏవో తెలుసుకో?

దయ్యాలున్న ప్రాంతాలు ఏవో తెలుసుకో?

భారత దేశంలో దెయ్యాలు తిరుగుతున్నట్లు చెప్పబడే ప్రాంతాలు

దెయ్యం ఇది ఒక బ్రహ్మపదార్థం. దేవుడు గురించి ఎంత చెప్పినా ఎలా అర్థం కాదో అలాగే దయ్యం గురించి చెప్పినా కూడా అర్థం కాదు. అసలు దయ్యం ఉందా లేదా అంటే స్పష్టమైన సమాధానం మాత్రం రాదు. అయితే ఆ దయ్యం ఉన్నట్లు చెప్పే కొన్ని ప్రాంతాలు మాత్రం భారత దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా మారాయి. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. అటువంటి దయ్యంతో ముడిపడిన కొన్ని పర్యాటక ప్రాంతాలు మీ కోసం....

కుల్దారా?

కుల్దారా?

P.C: You Tube

భారత దేశంలో అత్యంత భయంకరమైన ప్రాంతం కుల్దారా అని చెబుతారు. దీంతో ఈ ప్రాంతం హెంటెడ్ టూరిజానికి చాలా ప్రాచూర్యం గాంచింది. చాలా కాలం క్రితం సుసంపన్నమైన ఈ గ్రామం ఓ మాంత్రికుడి శాపం వల్ల దయ్యాల దిబ్బగా మారి పోయిందని చెబుతారు.

రాత్రి సమయంలో

రాత్రి సమయంలో

P.C: You Tube

రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జై సల్మీర్ కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ పట్టణం ఉంటుంది. పగటి సమయంలో వందల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో మాత్రం ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఉండటానికి సాహసించరు.

బాంగ్రా కోట

బాంగ్రా కోట

P.C: You Tube

ఈ కోట కూడా రాజస్థాన్ లోనే ఉంది. భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రాంతంగా ఈ కోటకు పేరుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ మాత్రమే ఇక్కడ పర్యాటకులను అనుమతిస్తారు.

ఒక్కరిని కూడా

ఒక్కరిని కూడా

P.C: You Tube

అటు పై ఒక్కరిని కూడా ఇక్కడ ఉండనివ్వరు. ఈ విషయాన్ని అతిక్రమించిన వారు ప్రాణాలు పోగొట్టు కొన్న సంఘటనలు ఉన్నాయి. అందువల్లే ప్రభుత్వమే అధికారికంగా సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ ఎవరినీ అనుతమించబోవడం లేదు.

శనివార్ వాడ

శనివార్ వాడ

P.C: You Tube

దీనిని పేష్వా బాజీరావ్ గౌరవార్థం క్రీస్తుశకం 1732లో నిర్మించారు. ఈ కోట కూడా కేవలం ఉదయం పూట మాత్రమే చూడటానికి అనుమతి ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ నన్ను కాపాడు...నన్ను కాపాడు అన్న కేకలు వినిపిస్తూనే ఉంటాయి. అవి నారాయణ రావు అనే వ్యక్తివని చెబుతారు.

అగ్నికి ఆహుతి

అగ్నికి ఆహుతి

P.C: You Tube

అతను రాజకీయ కారణాలతో హత్య చేయించబడ్డాడు. అయితే ఈ కోట పై ఉన్న మమకారంతో అతని ఆత్మ ఇప్పటికీ ఇక్కడే తిరుగుతూ ఉందని చెబుతారు. ఆతని కోపం వల్లే ఈ కోట అగ్నికి ఆహుతి అయ్యిందని చెబుతారు. కోట అగ్నికి ఆహుతైన గురుతులను మనం ఇప్పటికీ చూడవచ్చు.

అగ్రసేన్ కి బౌలి, న్యూఢిల్లీ

అగ్రసేన్ కి బౌలి, న్యూఢిల్లీ

P.C: You Tube

ఇది ఒక చారిత్రాత్మక బావి. 60 మీటర్ల పొడవు, 15 మీటర్ల పొడవైన ఈ బావి ఢిల్లీలోని హెయిలీ రోడ్డులో ఉంది. 14వ శతాబ్దంలో అగ్రసేన్ అనే మహారాజు ఈ బావిని నిర్మించినట్లు చెబుతారు. ఈ బావిలో 108 మెట్లను దిగిన తర్వాత ఒక అసహజమైన వాతావరణం మీరు గమనించవచ్చు.

దయ్యాల వల్లే

దయ్యాల వల్లే

P.C: You Tube

ఇది దయ్యాల వల్లేనని తెలుస్తోంది. ఇక్కడ ఉన్న నీరు ఈ బావిలోకి దిగుతున్నవారిని బలవన్మరణానికి పాల్పడేటట్టు ప్రేరేపిస్తుందని చెబుతారు. అందువల్లే ఇక్కడ ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని నిశిద్ధ జాబితాలో చేర్చారు.

ముఖేష్ మిల్స్, మహారాష్ట్ర

ముఖేష్ మిల్స్, మహారాష్ట్ర

P.C: You Tube

ఈ ముఖేష్ మిల్స్ ప్రస్తుతం మీరు చాలా సినిమాలు, టీవీ సీరియల్స్ లో చూసే ఉంటారు. ముంబైలోని క్రీస్తుశకం 1870లో దీనిని కోల్బా ప్రాంతంలో నిర్మించారు. క్రీస్తుశకం 1982లో ఒక సమ్మె కారణంగా ఈ మిల్లును కొన్ని నెలల పాటు మూసివేశారు.

అగ్ని ప్రమాదంతో

అగ్ని ప్రమాదంతో

P.C: You Tube

అటు పై యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు కొంత వరకూ సఫలమై మిల్లు పనిచేయడం ప్రారంభించింది. అయితే కొన్ని రోజులకే ఘోర అగ్ని ప్రమాదం జరగడంతో ఇది పూర్తిగా నాశనమై పోయింది.
ఇప్పటికీ ఇక్కడ చాలా మంది నటీనటులు తమ సినిమా చిత్రీకరణ ఈ ముఖేష్ మిల్ లో అంటే రావడానికి చాలా భయపడుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X