» »కపిలతీర్ధానికి మహత్యం ఉందా?

కపిలతీర్ధానికి మహత్యం ఉందా?

Written By: Venkatakarunasri

LATEST: సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?

తెలుగునాట వున్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో కపిలతీర్థం ఒకటి. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది వుండటం విశేషం. హరిహరులకు ఏ బేధం లేదని నిరూపిస్తూ నిలచిన ఈ తీర్థ రాజం తిరుపతిలోని అలిపిరి మార్గంలో వుంది. శేషాచల పర్వతపాదాన వున్న ఈ క్షేత్రంలో మనోహరమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతాలు. యాత్రికులను కట్టిపడేస్తాయంటే ఏ మాత్రం అతిశయోక్తికాదు.

కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోరతపం ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుండి పుడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్రతీర్థంలో నిలచినట్లు స్థలపురాణం చెబుతోంది. కపిలుని తపస్సుకు మెచ్చి నిలచిన స్వామిని కపిలేశ్వరునిగాను, ఇక్కడ లింగాన్ని కపిల లింగంగాను పిలుస్తారు. కామాక్షీ సమేతుడై నిలచిన స్వామివారిని తర్వాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడి లింగాన్ని అగ్నిలింగంగానూ వ్యవహరిస్తారు.

తిరుమల గిరుల నుంచి గల గల ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు 25అడుగుల ఎత్తు నుంచి ఆలయపుష్కరిణిలోకి దూకే ఆకాశగంగ శివుని జటాజూటాన్ని చేరినట్టు అనిపిస్తుంది. ఇక్కడి పుష్కరిణిని శైవులు కపిలతీర్థమని,వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని,చక్రతీర్థమని పిలుస్తారు. ఇప్పుడున్న ఆలయం సుమారు వెయ్యేళ్ళ నాటిదని చెపుతారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఏలిన రాజేంద్రుని చోళుల కాలంలో ఈ నిర్మాణం జరిగిందని స్వతహాగా శైవమతాయులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టు స్పష్టంగా తెలుస్తుంది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

వైష్ణవతీర్థం

వైష్ణవతీర్థం

విజయనగరరాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవతీర్థంగా పరిగణించి,ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు. ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్నగుడి ఆళ్వారులలో ఒకరి పేరిట నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు చెపుతారు.

PC: youtube

విజయనగర పరిపాలన

విజయనగర పరిపాలన

విజయనగర పరిపాలన చివరిరోజుల్లో అక్కడ్నుంచి వచ్చి ఈ ప్రాంత నివాసమేర్పరచుకున్న ఒక దేవదాసి ఈ ఆలయంలోగణపతి ప్రతిష్టగావించిందని చెబుతారు. ఈ ఆలయప్రాంగణంలో కపిలేశ్వరస్వామితో పాటు,కార్తికేయుడు,శ్రీకృష్ణుడు, అగస్తేస్వరుడు,కాశీవిశ్వేశ్వరుడు,సహస్రలింగేశ్వరుడు,లక్ష్మీ నారాయణేశ్వరుడు కూడాకొలువై వున్నారు.

PC: youtube

సంతతి లేనివారు

సంతతి లేనివారు

సంతతి లేనివారు ఈ క్షేత్ర స్వామిని ఆరాధించి ఒక రాత్రి నిద్రచేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.

PC: youtube

పుణ్య స్నానం

పుణ్య స్నానం

ఇక్కడి తీర్థంలో పుణ్య స్నానం ఆచరించిన వారి పాపాలు పటాపంచాలౌతాయని భక్తుల విశ్వాసం. విశేషించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.వేకువజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు పెడతారు.

PC: youtube

కార్తీక మాసం

కార్తీక మాసం

కార్తీక మాసంలో వచ్చే ఆరుద్రానక్షత్రం రోజున స్వామి వారికి అత్యంత ఘనంగా నిర్వహించి మారేడుదళాల పూజ,అన్నాభిషేకం చూసితీరవలసిందే తప్ప ఆ విభవాన్ని మాటల్లో వర్ణించలేము.

PC: youtube

డిశెంబర్ మాసం

డిశెంబర్ మాసం

ఇక్కడ మహాశివరాత్రికి ముందు జరిగే బ్రహ్మోత్సవాలు, డిశెంబర్ మాసంలో వచ్చే తెప్పోత్సవాలు భక్తులను అలౌకిక ఆనందంలో ముంచివేస్తాయి. శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు.

PC: youtube

కపిలలింగం

కపిలలింగం

కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది.

PC: youtube

త్రేతాయుగము

త్రేతాయుగము

త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.

PC: youtube

కార్తిక మాసం

కార్తిక మాసం

కార్తిక మాసం నందు వచ్చు కార్తిక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఈ ఆలయం తి.తి.దే. వారి ఆద్వర్యంలో పని చేస్తుంది, శివరాత్రి పండుగ మరియు బ్రహ్మొత్సవాలు వైభవంగా జరుగుతాయి.

PC: youtube

తిరుమల

తిరుమల

తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది! అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం. ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి.

PC: youtube

శ్రీవారి ఆలయం

శ్రీవారి ఆలయం

ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామివారి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది.

PC: youtube

వర్షాకాలం

వర్షాకాలం

ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడకు వస్తే... ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపుతిప్పనివ్వవు. ఇక్కడి ప్రశాంత వాతావరణం... అడుగుతీసి అడుగు వేయనివ్వదు. ఇంతటి సుమనోహర తీర్థం ఇక్కడ ఎలా ఏర్పడిందంటే...కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట.

PC: youtube

స్థలపురాణం

స్థలపురాణం

ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు.

PC: Adityamadhav83

అగ్నిదేవుడు

అగ్నిదేవుడు

ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు.

PC: Adityamadhav83

తిరుమల కొండలు

తిరుమల కొండలు

ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు.

PC: Suresh Babunair

 కోనేటి చుట్టూ

కోనేటి చుట్టూ

వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు.

PC:Bhaskaranaidu

తీర్ధము

తీర్ధము

విజయనగర చక్రవర్తి, అచ్యుత రాయలు ఈ తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాశారు.

PC:Bhaskaranaidu

బ్రాహ్మణ సమారాధన

బ్రాహ్మణ సమారాధన

బ్రాహ్మణ సమారాధనకు ఇక్కడ కట్టియున్న విశాలమైన మంటపం అనుకూలంగా ఉండేదని, ఆ చుట్టుపక్క స్థలాల్లో హైదరాబాద్ రాజ్య పేష్కారు చందులాలా ఏర్పాటుచేసిన దానధర్మాలు బాగా జరిగేవని ఆయన వ్రాశారు.

PC:Bhaskaranaidu

11వ శతాబ్దం

11వ శతాబ్దం

11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్రచోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో రాయన్‌ రాజేంద్రచోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రధారి. చోళులు శివభక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించారు.

PC:Bhaskaranaidu

అభివృద్ధి

అభివృద్ధి

ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే... అచ్యుతదేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వారుతీర్థంగా మార్చారు. ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది.

PC:Bhaskaranaidu

నమ్మాళ్వార్‌

నమ్మాళ్వార్‌

అది నమ్మాళ్వార్‌ అనే ఆళ్వారు గుడి అని చెబుతారు. 12వ శతాబ్దం నుంచీ 18వ శతాబ్దం వరకూ దీన్ని ఆళ్వారు తీర్థంగానే వ్యవహరించారు. పదహారో శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట.

PC:Bhaskaranaidu

ఆలయం

ఆలయం

ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందట. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితోపాటు కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు.

PC:Bhaskaranaidu

మరి ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి?

మరి ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి?

తిరుపతి పట్టణ ప్రధాన బస్టాండ్ నుండి సుమారు 2కి.మీ ల దూరంలో అలిపిరి మార్గంలో వున్న కపిలతీర్థానికి చక్కని రావాణాసౌకర్యం వుంది. తిరుమలతిరుపతి తరపున బస్టాండ్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి అరగంటకు నడిచే ఉచిత బస్సుల ద్వారా కూడా ఆలయానికి చేరుకోవచ్చు.లెక్కకుమించిన ప్రవేట్ వాహనాలు, ఆటోలు వుంటాయి. మదనపల్లి, చిత్తూర్ నుంచి వచ్చే బస్సులు ఈ ఆలయం మీదుగానే వెళ్తాయి.

PC: Agasthyathepirate

Please Wait while comments are loading...