Search
  • Follow NativePlanet
Share
» »ముంబై లో ఈ ప్రదేశాలు చూశారా ?

ముంబై లో ఈ ప్రదేశాలు చూశారా ?

ముంబై నగరం పేరు చెప్పగానే ఫ్యాషన్లు, బిజీగా వుండే జీవన విధానం గుర్తుకొస్తాయి. ఆ వెంటనే బాలీవుడ్ సినిమాలు, ప్రసిద్ధ నటీ నటులు కూడా గుర్తుకు వస్తారు.

By Mohammad

ముంబై నగరం పేరు చెప్పగానే ఫ్యాషన్లు, బిజీగా వుండే జీవన విధానం గుర్తుకొస్తాయి. ఆ వెంటనే బాలీవుడ్ సినిమాలు, ప్రసిద్ధ నటీ నటులు కూడా గుర్తుకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రపంచానికి అమెరికా దేశం ఎలా ఉంటుందో, భారత దేశానికి ముంబై అలాగుంటుంది. ముంబై నగర ప్రాధాన్యతలు వివరించాలంటే అక్కడకల వివిధ మతాల ప్రజలు, వివిధ ప్రదేశాలు మరియు అక్కడి ప్రజల మతపర పూజలు మరియు స్ధానికంగా లభించే అనేక రకాల ఆహారాలు మొదలైనవాటిపై ఆధారపడి ఉంటాయి.

మొత్తంగా చెప్పాలంటే, ముంబై నగరంలో అన్ని వయసుల వారికి, అన్ని అభిరుచులవారికి తగినంత ఆనందం లభిస్తూనే ఉంటుంది. మీరు వ్యయం చేసే మొత్తాలను బట్టి మీరు పొందే సేవలు, వస్తువుల నాణ్యత ఉంటుంది. ఎంత తక్కువ సమయం అయినా సరే మీరు నగరాన్ని చూచి ఆనందించవచ్చు. నగరంలో పర్యటించటం చవక మరియు సౌకర్యం ప్రతి ప్రదేశంలోను మీకు మంచి ఆనందం దొరుకుతుంది.

కొలబా కాజ్ వే

కొలబా కాజ్ వే

భారత దేశంలో మొట్టమొదటి ఫ్యాషన్లు ముంబైలో పుడతాయనుకుంటే, వీధి కొనుగోలు ముంబైలో మొట్టమొదట ఎక్కడ మొదలవుతాయంటే కాజ్ వే లో అని చెప్పాలి. ఈ ప్రాంతంలో చాలావరకు వీధులలోనే కొనుగోళ్ళు చేస్తారు. కాజ్ వే అనుభవాలు పొందాలంటే, మీరు కాలినడకన అక్కడ తిరగాలి.

చిత్రకృప : FlickreviewR

ఎస్సెల్ వరల్డ్ మరియు వాగర్ కింగ్ డం

ఎస్సెల్ వరల్డ్ మరియు వాగర్ కింగ్ డం

ఎస్సెల్ వరల్డ్ ఆసియాలోనే అతిపెద్ద ఎమ్యూజిమెంట్ పార్క్. దీనిని డిస్నీ లాండ్ మోడల్ లో నిర్మించారు. ముంబైలోని ఎస్సెల్ వరల్డ్ కు వెళ్ళారంటే ఇక ఆరోజంతా మీకు ఆనందమే. అయితే, ఈ ప్రదేశం సాహస క్రీడలు చేయాలనేవారికి పనికి రాదు. పర్యాటకులు ఈ ప్రదేశం బాగా ఇష్టపడతారు.

చిత్రకృప : KartikMistry

గేట్ వే ఆఫ్ ఇండియా

గేట్ వే ఆఫ్ ఇండియా

ప్రసిద్ధి గాంచిన శిల్పకళా అద్భుతం గేట్ వే ఆఫ్ ఇండియా దాని 8 అంతస్తుల ఎత్తుతో ముంబై లోని కొలబాలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనిని హిందు మరియు ముస్లిం శిల్పశైలులుగా కలిపి నిర్మాణం చేశారు. ఇక్కడకు దక్షిణ ముంబై లో ప్రసిద్ధి గాంచిన రెట్టరెంట్లు బడే మియాస్, కేఫే మండేగర్ మరియు కేఫే లియో పోల్డ్ కూడా సమీపంగానే ఉంటాయి.

చిత్రకృప : Sathya1

హాజీ ఆలీ మసీదు

హాజీ ఆలీ మసీదు

హాజీ ఆలీ మసీదు ముంబై సముద్ర తీరంలో కలదు. జీవితంలో ఒకేసారి దొరికే అనుభవంగా అన్ని మతాల పర్యాటకులు తమ మతాలు, కులాలు బేధం లేకుండా మరచిపోలేని అందాలు కల హాజీ ఆలీ దర్గా దర్శిస్తారు. శుక్రవారాలు అధిక యాత్రికులు ఇక్కడకు వస్తారు. కనుక తప్పు కాదనుకుంటే శుక్రవారం దీని దర్శనకు వెళ్ళకండి. ఇక్కడే హాజీ అలీ జ్యూస్ సెంటర్ చూడండి.

చిత్రకృప : A.Savin

జుహు బీచ్

జుహు బీచ్

బీచ్ ప్రేమికులందరకూ జుహూ బీచ్ ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఇరవై నాల్గు గంటలు ఇక్కడ ఉన్నప్పటికి ఎంతో ఆనందిస్తారు. బంద్రా నుండి 30 నిమిషాల ప్రయాణంతో చేరుకోవచ్చు. బీచ్ లో దొరికే ఆహారాలు ముంబై లోనే ప్రత్యేకత. భేల్ పూరి, పాని పూరి ముంబై శాండ్ విచ్ లు దొరుకుతాయి. గోలాస్ అనే ఐస్ క్రీములు కూడా ఎంతో రుచికరం.

చిత్రకృప : Rajkiran

ఐస్ బార్

ఐస్ బార్

సాధారణంగా ముంబై వాసులకు చలి వాతావరణం అలవాటులేదు. అయితే, ఇటీవలే ఈ నగరం అధిక చలి వాతావరణాన్ని ఎదుర్కుంటోంది. అలాగని ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు కూడా పడటం లేదు. ముంబై లోని అంధేరిలో 21 డిగ్రీ ఫారెన్ హీట్ ఎపుడూ ఉష్ణంగా ఉండే ముంబై వాసులకు స్వాగతించదగినదే. మంచి ఉన్ని కోట్లు వేసుకొని నగరంలోని ఈ ఐస్ బార్ లో ఒక సాయంత్రం గడిపేయండి.

చిత్రకృప : Ray García

మెరైన్ డ్రైవ్

మెరైన్ డ్రైవ్

మెరైన్ డ్రైవ్ లో నడుస్తూంటే అది మిమ్మల్ని ప్రపంచ ప్రసిద్ధ చౌ పట్టీ బీచ్ కు చేరుస్తుంది. అక్కడ మీరు ముంబై వీధి ఆహారం అయిన భేల్ పురి, పాని పురి, శాండ్ విచెస్ మరియు ఫలూదాలు ఆరగించవచ్చు. మెరైన్ డ్రైవ్ లో ప్రసిద్ధ బ్రాండ్లు మరియు విశేషమైన హేండ్ లూమ్ స్టోర్సు కలవు. చీకటి పడితే, లైట్లు సముద్రపు ఒడ్డు అందాలను మటుమాయం చేస్తాయి. రాత్రులలో మెరైన్ డ్రైవ్ నుండి ముంబై స్కై లైన్ చూడటం ఎంతో ఆనందం కలిగిస్తుంది.

చిత్రకృప : A.Savin

నెహ్రూ మ్యూజియం & ప్లానిటోరియం

నెహ్రూ మ్యూజియం & ప్లానిటోరియం

ఇది హాజీ అలీ జ్యూస్ సెంటర్ కు దగ్గరలో ఉన్నది. ఇది ఇండియాలోనే ప్రత్యేకత. ఇక్కడ పిల్లలు ఆనందిస్తారు. పానెటోరియం, మ్యూజియం పిల్లలకు, పెద్దలకు ఒక మధ్యాహ్న సమయాన్ని గడిపేలా చేస్తుంది.

చిత్రకృప : Rakeshpate

షాపింగ్ ఏరియాలు

షాపింగ్ ఏరియాలు

పార్టీ ప్రియులకు ఏ ఐ ఆర్ లాంజ్, బాంద్రా స్ట్రీట్, ధరావి లెదర్ షాపింగ్, ఫ్యాషన్ స్ట్రీట్, మాల్ కల్చర్ వంటి ఎన్నో మాల్స్, వీధులు ముంబై లో ఉన్నాయి.

చిత్రకృప : KuwarOnline

సెంట్రల్ పార్క్

సెంట్రల్ పార్క్


న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ కు దీటుగా నవి ముంబై లో ఈ పార్క్ ను 80 హెక్టార్ల భూమిలో ఏర్పాటుచేశారు. ఇందులో వివిధ రకాల స్మారకాలను, కట్టడాలను, ఫౌంటైన్ లను ఏర్పాటుచేశారు. ఇదొక థీమ్ పార్క్. ఇందులో ఆడుకోవటానికి గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది.

చిత్రకృప : Dhavalbhatt16

బ్యాండ్ స్టాండ్

బ్యాండ్ స్టాండ్

దీనిని ముంబై లో లవర్స్ పాయింట్ అని అంటారు. చాలా మంది కాలేజీ విద్యార్థులు తరగతులను ఎగరగొట్టి ముంబై సముద్ర అందాలను చూస్తూ తెగమురిసిపోతారు. కేఫ్ లు, రెస్టారెంట్లు ఇక్కడ ఉన్నాయి.

చిత్రకృప : Rajarshi MITRA

బొరివలి నేషనల్ పార్క్

బొరివలి నేషనల్ పార్క్

బొరివలి నేషనల్ పార్క్, ముంబై సబ్ అర్బన్ ప్రాంతంలో కలదు. ఇక్కడికి శని, ఆదివారాల్లో హాయిగా గడపటానికి పర్యాటకులు వస్తుంటారు. ముంబై లో ఇదొక పిక్నిక్ స్పాట్.

చిత్రకృప : Sobarwiki

మహాలక్ష్మి ఆలయం

మహాలక్ష్మి ఆలయం

మహాలక్ష్మి ఆలయంలో సంపదను, అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మి దేవి పూజలు అందుకొంటోంది. ఈ గుడిని వారాంతంలో సందర్శించటానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇది మహాలక్ష్మి రేస్ కోర్స్ కు దగ్గరలో ఉన్నది.

చిత్రకృప : Nichalp

ఎలిఫెంటా కేవ్స్

ఎలిఫెంటా కేవ్స్

ఎలిఫెంటా గుహలు ముంబై లోని ఒక ద్వీపంలో ఉన్నాయి. ఇక్కడికి చేరాలంటే బోట్ లో వెళ్ళాలి. ఇవి యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి. పోర్చుగీసు వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలిఫెంట్ శిల్పశైలి అధికంగా కనిపించడంతో, దీనికి ఎలిఫెంటా అని పేరుపెట్టారు.

చిత్రకృప : AKS.9955

విక్టోరియా టర్మినస్

విక్టోరియా టర్మినస్

ఛత్రపతి శివాజి స్టేషన్ అనే పేరు కంటే కూడా వి.టి. స్టేషన్ లేదా విక్టోరియా టర్మినస్ అనే పేరుతో ముంబై లోని ప్రధాన వాణిజ్య కేంద్రం ఇప్పటికి ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతోంది. పట్టణ యువత అవసరాల కారణంగా ఇక్కడ కన్ స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సంబంధిత మరియు దుస్తులు వంటివి ఈ ప్రాంతంలోని వీధులలోకి వచ్చేసాయి.

చిత్రకృప : Anoop Ravi

సిద్ధి వినాయక మందిర్

సిద్ధి వినాయక మందిర్

ఇది ఒక వినాయకుడి మందిరం. సుమారుగా 1900 ల సంవత్సరంనుండి హిందూ భక్తులు, పర్యాటకులు ఇక్కడకు వస్తున్నారు. ఒకప్పుడు చిన్న ఇటుకల నిర్మాణంగా ఉండే ఈ దేవాలయం, ఇపుడు ముంబై నగరంలో అత్యంత ధనవంతమైన దేవాలయంగా మారింది. ఎంతోమందిని ఆకర్షిస్తోంది.

చిత్రకృప : Darwininan

సహారా మార్కెట్

సహారా మార్కెట్

విక్టోరియా టర్మినస్ నుండి సహారా మార్కెట్ కు నడిచి వెళ్ళవచ్చు. సరిగ్గా హాజీ ఆలీ మసీదు నుండి గల రోడ్డు టార్డియో లోని హాజీ ఆలీ మార్కెట్ కాంప్లెక్స్ కు దోవ తీస్తుంది. ఇక్కడ మీకు ఐ పోడ్లు, ఐ ప్యాడ్ లు, ఎంపి 3 ల్యాప్ టాపులు, ఏది కావాలంటే ఆ వస్తువు దొరకుతుంది. ఇవి బ్రాండెడ్ వస్తువులే అయినప్పటికి ముంబై నగర స్ధాయిని బట్టి మీరు బేర సారాలు సాగించండి.

చిత్రకృప : Nicholas

మౌంట్ మేరీ ఫెయిర్

మౌంట్ మేరీ ఫెయిర్

ప్రసిద్ధి చెందిన బేసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది మౌంట్ లేదా మౌంట్ మేరీ చర్చి సముద్ర మట్టానికి సుమారు 80 మీటర్ల ఎత్తున వుండి అరేబియా మహా సముద్రాన్ని చూస్తూ ఉంటుంది. సెయింట్ మేరీ ఫీస్ట్ జరిగేటపుడు సెప్టెంబర్ లో ఇక్కడ జరిగే మౌంట్ మేరీ ఫెయిర్ చూడగలిగితే పర్యాటకులకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ చర్చి అతి పెద్దది, దాని శిల్పకళా వైభవం నేటికి చక్కగా నిర్వహించబడుతోంది.

చిత్రకృప : Rakesh Krishna Kumar

ముంబై సీ లింక్

ముంబై సీ లింక్

బంద్రా - ముంబై సీ లింకు ముంబై లోని ప్రధాన మరియు తాజా నిర్మాణం. ముంబై స్కై లైన్ కు ఇది ఒక అద్భుత నిర్మాణం. వేలాడే ఈ 8 లైనుల బ్రిడ్జి మోటారిస్టులను వర్లి మరియు బంద్రాల మధ్య పది నిమిషాలలో ప్రయాణింపజేస్తుంది. బ్రిడ్జి నుండి అరేబియా మహా సముద్ర అందాలు అద్భుతంగా గోచరిస్తాయి. ఈ బ్రిడ్జి కి టోల్ రేటు రెండు వైపులా కలిపి రూ.75 గా మోటారిస్టులనుండి చార్జి వసూలు చేస్తారు.

చిత్రకృప : yatriksheth

ముంబై ఎలా చేరుకోవాలి ?

ముంబై ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : ముంబై లో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ, విదేశాల నుండి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని మీ ప్రయాణాన్ని మొదలుపెట్టవచ్చు.

రైలు మార్గం : ముంబై లో రైల్వే స్టేషన్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.

బస్సు మార్గం : హైదరాబాద్, బెంగళూరు, గాంధీనగర్ తదితర ప్రాంతాల నుండి ముంబై కు పలు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

చిత్రకృప : Superfast1111

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X