Search
  • Follow NativePlanet
Share
» » వ‌ర్షాకాలంలో హిల్ స్టేష‌న్ సంద‌ర్శించాలంటే ముస్సోరీ వెళ్లాల్సిందే...!

వ‌ర్షాకాలంలో హిల్ స్టేష‌న్ సంద‌ర్శించాలంటే ముస్సోరీ వెళ్లాల్సిందే...!

వ‌ర్షాకాలంలో హిల్ స్టేష‌న్ సంద‌ర్శించాలంటే ముస్సోరీ వెళ్లాల్సిందే...!

ముస్సోరీని ప‌ర్వ‌తాల రాణి అని పిలుస్తారు. ఉత్త‌రాఖండ్ లోని డెహ్ర‌డూన్ లో ఉన్న ఒక ప్ర‌ఖ్యాత‌ హిల్ స్టేష‌న్ ముస్సోరీ. ఇది స‌ముద్రమ‌ట్టానికి సుమారు 1880 మీట‌ర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో శివాలిక్ ప‌ర్వ‌తం, దున్ లోయలోని అద్భుత‌మైన వ్యూను చూడొచ్చు. దీనిని యుమునోత్రి, గంగోత్రి ఆధ్యాత్మక కేంద్రాల ప్ర‌వేశ ద్వారంగా చెప్పుకుంటారు. ఈ ప్రాంతాన్ని అక్క‌డివారు మంసూరి అని కూడా పిలుస్తుంటారు. ముస్సోరీ హిల్ స్టేష‌న్ అక్క‌డి పురాత‌న ఆల‌యాలు, ప‌ర్వ‌తాలు, జ‌ల‌పాతాలు, లోయ‌లు, వ‌న్య‌ప్రాణుల‌కు ప్ర‌సిద్ధి. ఇదే పేరుగ‌ల ఇంకో ప్రాంతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గ‌జియాబాద్‌లో ఉంది.

జ్వాలా దేవి మందిర్

జ్వాలా దేవి మందిర్

నాగ దేవ‌త మందిర్‌, భ‌ద్ర్‌రాజ్ మందిర్ ముస్సోరీలో ఉన్న ప్ర‌సిద్ధ‌మైన ఆల‌యాలు. జ్వాలా దేవి మందిర్ హిందువులు దేవ‌త‌గా పూజించే దుర్గా దేవికి ప్ర‌తిక‌. ఈ ఆల‌యం స‌ముద్ర‌మ‌ట్టానికి 2100 మీట‌ర్ల ఎత్తులో ఉంది. ఈ దేవాల‌యం హిందువుల దేవాల‌యాల్లో ముఖ్య‌మైన‌ది. ఈ ఆల‌యంలో రాళ్ల‌తో క‌ట్టిన దేవ‌త విగ్ర‌హం ఉంది. ఇక్క‌డ మ‌రో ముఖ్య‌మైన ఆల‌యం నాగ దేవ‌త మందిర్. నాగుల‌చ‌వితి నాడు భ‌క్తులు ఇక్క‌డికి అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తారు. అంద‌మైన ప‌ర్వ‌తాలు, ఘ‌న్ హిల్ (ఘ‌న్ ప‌ర్వ‌తం) లాల్ టిబ్బా,నాగ్ టిబ్బాతో ఈ ప్రాంతం ఎంతో గుర్తింపు పొందింది.

ఘ‌న్ హిల్

ఘ‌న్ హిల్

ఈ ప్రాంతం సముద్ర మ‌ట్టం నుంచి సుమారు 2122 మీట‌ర్ల ఎత్తులో ఉంది. ముస్సోరీలోని రెండ‌వ ఎత్త‌యిన ప‌ర్వతంగా పేరుపొందింది. స్వాతంత్య్రం కంటే ముందు స్థానికులు స‌మ‌యం తెలుసుకోవ‌డానికి ప్ర‌తి రెండుగంట‌ల‌కొక‌సారి ఈ ప‌ర్వతం ద‌గ్గ‌ర కెన‌న్ షూటింగ్ చేసేవార‌ని ఇక్క‌డి వారు చెబుతున్నారు. స్థానికులు దీని ఆధారంగానే వారి గ‌డియారాల‌ను బాగు చేసుకునేవార‌ట‌! ఘ‌న్ హిల్ కోసం రోప్‌వే స‌వారీ ఇక్క‌డి ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

లాల్ టిబ్బా

లాల్ టిబ్బా

లాల్ టిబ్బా ముస్సోరీలోని ఎత్త‌యిన శిఖ‌రాగ్రం. అత్యంత ప్ర‌సిద్ధ ప్ర‌దేశం. దీనిని డిపో హిల్ అని కూడా అంటారు. ఎందుకంటే, ఇక్క‌డే ఒక డిపో ఉంది. సూర్య‌స్త‌మం, సూర్యోద‌యం వీక్షించ‌డానికి ఈ ప్రాంతం ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. ఆల్ ఇండియా రేడియో, దూర‌ద‌ర్శ‌న్ ట‌వ‌ర్ ఈ ప‌ర్వతం ద‌గ్గ‌రే ఉంది. భార‌తీయ సైన్య సేవ‌లు కూడా ఈ ప‌ర్వ‌తం పైనే ఉన్నాయి. ప‌ర్యాట‌కుల సౌక‌ర్యార్థం 1967లో ఈ ప‌ర్వ‌తం పైనా ఒక జ‌పానీ టెలిస్కోప్ ను పెట్టారు. దీని సహాయంతో ప‌ర్యాట‌కులు బంద‌ర్‌పుంచ్‌, కేదార‌నాథ్, భ‌ద్రీనాథ్ ఆల‌యాల‌ను వీక్షించ‌వచ్చు. నాగ్ టిబ్బా ముస్సోరీలోని మ‌రొక ప‌ర్వ‌త ప్రాంతం. దీనిని పాముల శిఖ‌రంగా చెప్ప‌కుంటారు.

విద్యాల‌యాల‌కు ప్ర‌సిద్ధి...

విద్యాల‌యాల‌కు ప్ర‌సిద్ధి...

ప‌ర్యాట‌కులు ఇక్క‌డ చాలా అడ్వంచ‌ర్ గేమ్స్ ఆడొచ్చు. ఈ ప్రాంతం అంద‌మైన జ‌ల‌పాతాలకు ఎంతో ప్ర‌సిద్ధి. అవెంటో చూద్దాం. కెంప్టి జ‌ల‌పాతం, జ‌రిపానీ జ‌ల‌పాతం, బ‌ట్టా జ‌ల‌పాతం, మోసీ జ‌ల‌పాతం. కెంప్టి జ‌ల‌పాతం, జ‌రిపానీ జ‌ల‌పాతం ప‌ర్యాట‌కుల‌కు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. జరిపాని గ్రామంలో ఉన్న ఒక ప్ర‌సిద్ద టూరిస్టు ప్రాంతం ఇది. బ‌ట్టా జ‌ల‌పాతం, మోసీ జ‌ల‌పాతం ముస్సోరీ నుంచి సుమారు ఏడు కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇవి ఒక అంద‌మైన టూరిస్టు ప్రాంతాలే కాకుండా విద్యాల‌యాల‌కు కూడా ప్ర‌సిద్ధిగాంచిన‌వి. ఇక్క‌డ చాలా యూరోపియా స్కూల్స్ ఉన్నాయి. వీటిని బ్రిటిష్ రాజు స్థాపించాడు. ఈ ప్రాంతంలో కొన్ని పురాత‌న బోర్డింగ్ స్కూల్స్ కూడా ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X