Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలో పాతాళ శిలతో మలిచిన ఏకైక విగ్రహం...సందర్శిస్తే పెళ్లి, శోభనం

ప్రపంచంలో పాతాళ శిలతో మలిచిన ఏకైక విగ్రహం...సందర్శిస్తే పెళ్లి, శోభనం

గురువాయుర్ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం

By Kishore

హిందూ పురాణాల ప్రకారం పాతాళ శిల అత్యతం పవిత్రమైనది, అరుదైనది. ఇటువంటి శిలతో తయారుచేసిన విష్ణువు విగ్రహం ఈ భూ మండలం పై ఒకే ఒక చోటు ఉంది. ఈ విగ్రహానికి అతీత శక్తులు ఉన్నాయని భక్తులు నమ్మకం. ముఖ్యంగా ఈ విగ్రహాన్ని ఆరాధిస్తే వివాహ సంబంధ సమస్యలన్నీ తీరిపోతాయని భక్తులు నమ్ముతారు. అందువల్లే ఆ విగ్రహ దర్శన కోసం ప్రపంచంలోని నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యక్షేత్రానికి వస్తుంటారు. మరోవైపు ఈ క్షేత్రంలో వివాహం చేసుకొంటే వివాహ బంధం గట్టిగా ఉంటుందని చెబుతారు. అందువల్లే దేశంలో ఏ దేవాలయంలో జరగనన్ని వివాహాలు ఆ దేవాలయంలో జరుగుతాయి. ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు నేటివ్ ప్లానెట్ తెలుగు పాఠకులైన మీ కోసం.

ఈ దేవాలయంలో ప్రసాదంగా ఏమిస్తారో తెలుసాఈ దేవాలయంలో ప్రసాదంగా ఏమిస్తారో తెలుసా

1. ఐదువేల ఏళ్ల నాటిది

1. ఐదువేల ఏళ్ల నాటిది

Image Source:

దాదాపు ఐదువేల సంత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని సాక్షాత్తు దేవతల గురువు బ`హస్పతి వాయు దేవుడుతో కలిసి నిర్మించినట్లు చెబుతారు. ఇక ఈ దేవాలయంలోని విగ్రహాన్ని త్రిమూర్తులైన శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురూ పూజించారని పురాణ కథనం.

2. శివభక్తుడైన సూతపాశుడు

2. శివభక్తుడైన సూతపాశుడు

Image Source:

పూర్వం పరమ శివభక్తుడైన సూతపాశ అనే బుుషి ఉండేవాడు. ఆయన ప్రతి రోజూ శివపూజ చేయనిదే పచ్చిగంగను కూడా ముట్టుకొనేవాడు కాదు. అయితే ఆయనకు సంతానం లేదు.

3. త్రిమూర్తులతో సమానమైన

3. త్రిమూర్తులతో సమానమైన

Image Source:

దీంతో శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి ఏదైన వరం కోరుకోమనగా తనకు త్రిమూర్తులతో సమానమైన మేధస్సు కలిగిన కుమారుడు కావాలంటాడు.

4. పాతాళశిలతో

4. పాతాళశిలతో

Image Source:

దీంతో శివుడు పాతాళశిలతో తయారైన విష్ణువు విగ్రహాన్ని అందజేసి దీనిని నిత్యం పూజించాలని అప్పుడు కోరిక నెరవేరుతుందని చెబుతాడు. శివుడి సూచనమేరకు సూతపాశ బుుషి ఆ విగ్రహాన్ని పూజించగా కవ్యప ప్రజాపతి అనే కుమారుడు కలుగుతాడు.

5. కష్యప ప్రజాపతి

5. కష్యప ప్రజాపతి

Image Source:

తండ్రి నుంచ పాతాళశిల ద్వారా తయారైన నారాయణ విగ్రహం కష్యప ప్రజాపతికి వారసత్వంగా అందుతుంది. దానిని తన శిష్యుడైన వసుదేవుడికి కష్యప ప్రజాపతి అందజేస్తాడు.

6. ద్వారకలో

6. ద్వారకలో

Image Source:

అటు పై ఆ విగ్రహం శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడు. ఇక అవతారం చాలించే సమయం ఆసన్నమయ్యిందని గ్రహించిన శ్రీకృష్ణుడు తన శిష్యుడైన ఉద్దవుడిని చెంతకు రమ్మని పిలుస్తాడు.

7. దేవతల గురువైన

7. దేవతల గురువైన

Image Source:

త్వరలో ద్వారక సముద్రంలో మునిగి పోతుందని అప్పుడు పాతళశిలతో తయారైన విష్ణు విగ్రహం నీటి పై తేలుతుందని చెబుతాడు. అంతేకాకుండా అలా తేలిన విగ్రహాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమని చెబుతాడు.

8.ద్వారక మునిగి పోతుంది

8.ద్వారక మునిగి పోతుంది

Image Source:

అంతేకాకుండా ఆ విగ్రహం తీసుకొని ప్రస్తుతం కేరళ ఉన్న తీరానికి వెళ్లాల్సిందిగా సూచిస్తాడు. అనుకొన్నట్లుగానే కురుక్షేత్ర యుద్దం తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు. అటు పై ఒక రోజు రాత్రి సముద్రంలో ద్వారక పూర్తిగా మునిగిపోతుంది.

9.విగ్రహాన్ని అందేస్తాడు

9.విగ్రహాన్ని అందేస్తాడు

Image Source:

విషయం తెలుసుకొన్న ఉద్దవుడు అక్కడకు చేరుకొని నీటి పై తేలుతున్న పాతాళ శిలతో తయారైన విష్ణువు విగ్రహాన్ని తీసుకొని శ్రీకృష్ణుడు సూచనమేరకు కేరళ తీరానికి చేరుకుంటాడు. అక్కడ దేవతల గురువైన బృహస్పతికి విగ్రహాన్ని అందజేస్తాడు.

10.శివుడుని కలుస్తారు.

10.శివుడుని కలుస్తారు.

Image Source:

తరువాత బృహస్పతి శ్రీకృష్ణుడి ఆదేశంమేరకు వాయుదేవుడిని కలుస్తాడు. వారిద్దరూ కలిసి శివుడు తపస్సు చేసుకొంటున్న కోనేరు వద్దకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెబుతారు. దీంతో శివుడు ఆ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్టించాల్సిందిగా ఆదేశిస్తాడు.

11.సరస్సు ఒడ్డున

11.సరస్సు ఒడ్డున

Image Source:

శివుడి ఆదేశం మేరకు బృహస్పతి వాయుదేవుడు ఇద్దరూ కలిసి ఆ విగ్రహాన్ని సరస్సు ఒడ్డున ప్రతిష్టిస్తారు. అటు పై గుడిని విశ్వకర్మ నిర్మించాడు. ఇలా గురువు.....వాయుదేవుడు ఇద్దరూ కలిసి ప్రతిష్టించడం వల్లే ఈ ప్రాంతానికి గురువాయూర్ అనే పేరు వచ్చినట్లు చెబుతారు.

12.అదే రుద్ర తీర్థం

12.అదే రుద్ర తీర్థం

Image Source:

ఇదిలా ఉండగా శివుడు తపస్సు చేసిన స్థలంలోని కోనేరు ప్రస్తుతం రుద్రతీర్థం పేరుతో పిలువబడుతోంది. ఇక్కడే ఒక శివాలయం కూడా ఉంది. ఈ శివాలయంలో కూడా నిత్యం పూజలు జరుగుతుంటాయి. అంటే ఒకే క్షేత్రంలో అటు విష్ణువుకు ఇటు శివుడికి కూడా పూజలు నిర్వహిస్తారు. ఇటువంటి క్షేత్రాలు చాలా అరుదు.

13. బ్రహ్మ ముహుర్తంలో

13. బ్రహ్మ ముహుర్తంలో

Image Source:

భక్తులు ఇక్కడి నారాయణుడిని గురువాయురప్పని కన్నన్, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌ తదితర పేర్లతో ఆరాధిస్తారు. ఆలయ ప్రధాన పూజారి ప్రతి రోజు బ్రహ్మముహుర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశిస్తాడు.

14. నిర్మల దర్శనం

14. నిర్మల దర్శనం

Image Source:

ప్రత్యేక నాద స్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకిస్తారు, అటు పై పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు.

15. ప్రత్యేకమైన నైవేద్యం

15. ప్రత్యేకమైన నైవేద్యం

Image Source:

బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. వీటిని ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు.

16. సంతానం కలుగుతుందని

16. సంతానం కలుగుతుందని

Image Source:

మొదట చెప్పుకొన్నట్లు ఈ విగ్రహాన్ని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. అందువల్లే చాలా మంది దంపతులు తమకు సంతానం ప్రసాదించాల్సిందిగా ఇక్కడకు వచ్చి స్వామి వారిని వేడుకొంటూ ఉంటారు.

17.వివాహ సంబంధ సమస్యలు

17.వివాహ సంబంధ సమస్యలు

Image Source:

అదే విధంగా వివాహ సమస్యలు ఉన్నవారు కూడా స్వామివారిని భక్తితో కొలుస్తారు. దీని వల్ల వారికి వివాహ సంబంధ సమస్యలు తొలిగిపోతాయాని నమ్ముతారు. మరోవైపు స్వామి సమక్షంలో వివాహ బంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయమవుతుందని చాలా మంది భావిస్తారు.

18. అందు వల్లే ఎక్కువ వివాహాలు

18. అందు వల్లే ఎక్కువ వివాహాలు

Image Source:

అందువల్లే ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ ఇక్కడ వివాహం చేసుకునేందుకు ఇష్టపడుతారు. ఈ కారణం వల్లే కేరళలో మరే దేవాలయంలో జరగనన్ని వివాహాలు ప్రతి ఏడాది ఇక్కడ జరుగుతుంటాయి.

19. ప్రతి రోజూ తులాభారం

19. ప్రతి రోజూ తులాభారం

Image Source:

ఇక్కడ ప్రతి రోజూ తులాభారం అనే తంతు జరుగుతూ ఉంటుంది. తమ బరువుకి సమానమైన అరటిపళ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారను భక్తులు స్వామివారికి ముడుపుగా చెల్లిస్తుంటారు.

20. పున్నత్తూర్ కోటలో

20. పున్నత్తూర్ కోటలో

Image Source:

గురువాయూరుకు సుమరు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్ కోటలో ఆలయానికి చెందిన గజశాల ఉంది. ఇందులో దేవస్థనానికి చెందిన సుమారు 50 ఏనుగులు ఉన్నాయి.

21. పద్మనాభన్, కేశవన్ అనే గజరాజులు

21. పద్మనాభన్, కేశవన్ అనే గజరాజులు

Image Source:

ఇదిలా ఉండగా స్వామివారికి అత్యంత భక్తితో సేవలు చేసిన పద్మనాభన్, కేశవన్ అనే రెండు ఏనుగుల గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. పద్మనాభన్ చనిపోయినప్పుడు మూల విరాట్టు విగ్రమం నుంచి గంధం కిందికి రాలిపోయిందని చెబుతారు.

22. కేశవన్ విగ్రహం

22. కేశవన్ విగ్రహం

Image Source:

అదే విధంగా 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే కేశవన్ అనే ఏనుగు స్వామివారికి అభిముఖంగా తిరిగి తనువు చాలించిందని చెబుతారు. ఇప్పటికీ కేశవన్ విగ్రహం గజశాలలో ఉంది.

23. కుంభ ఉత్సవం

23. కుంభ ఉత్సవం

Image Source:

ఇదిలా ఉండగా ప్రతి ఏడాది గురువాయూరులో జరిగే కుంభ ఉత్సవంలో ఏనుగులకు పలు పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీని చూడటానికి దేశ విదేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు గురువాయూరుకు చేరుకొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X