Search
  • Follow NativePlanet
Share
» » ఎండకాలంలో చల్లగా, చలి కాలంలో వేడిగా ఉండే గర్భగుడిని సందర్శించారా?

ఎండకాలంలో చల్లగా, చలి కాలంలో వేడిగా ఉండే గర్భగుడిని సందర్శించారా?

బాపట్లలోని భావన్నారాయణ స్వామి దేవాలయానికి సంబంధించిన కథనం

ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. దాదాపు 1,500 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ దేవాలయం ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ దేవాలయంలో చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది.

ఇక ఈ దేవాలయంలో విగ్రహం మునికాళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంటుంది. ఇటువంటి విగ్రహం భారత దేశంలో ఇది ఒక్కటే అని చెబుతారు. ఇక ఇక్కడ ఉన్న మరో మూలవిరాట్టు ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం శాంతకేశవ విగ్రహాన్ని ప్రతిష్టించాల్సి వచ్చింది. ఇక మూలవిరాట్టును ఏమి కోరుకొంటే అది నెరవేరుతుందని చెబుతారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ దేవాలయం పూర్తి వివరాలు మీ కోసం...

అత్యంత ప్రాచీన దేవాలయం

అత్యంత ప్రాచీన దేవాలయం

P.C: You Tube

భావనారాయన స్వామి దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారత దేశంలోనే అత్యంత ప్రాచీన దేవాలయాలు. వీటి నిర్మాణం దాదాపు 1500 ఏళ్లకు పూర్వం జరిగిందని తెలుస్తోంది.

పంచ భావన్నారాయణ దేవాలయాలు

పంచ భావన్నారాయణ దేవాలయాలు

P.C: You Tube

భావనారాయణ స్వామి దేవాలయాలు మొత్తం ఐదు. అందువల్లే వీటిని పంచ భావన్నారాయ క్షేత్రాలు అని పిలుస్తారు. ఈ ఐదు క్షేత్రాలు వరుసగా బాపట్ల, పొన్నూరు, భావరేవరపల్లి, సర్పవరం, పట్టిసీమ.

భావన్నారాయణుడి వల్ల భావపురి

భావన్నారాయణుడి వల్ల భావపురి

P.C: You Tube

మరికొంతమంది ఇందులో ప్రకాశం జిల్లాలోని పెద గజాం కూడా ఉందని చెబుతారు. వీటిలో ముఖ్యమైనది బాపట్ల. ఇక్కడ నెలకొన్న భావనారాయణ స్వామి వల్ల ఈ ఊరిని మొదట భావపురి అని పిలిచేవారు.

అటు పై భాపట్లగా

అటు పై భాపట్లగా

P.C: You Tube

అటు పై బావపట్ల కాలక్రమంలో భావపురిగా మారింది. ఈ దేవాలయంలో భావన్నారాయణుడితో పాటు పరివార దేవతలైన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవారు, ఆళ్వారులు ఉన్నారు.

కాలి వేళ్ల పై నిలబడి

కాలి వేళ్ల పై నిలబడి

P.C: You Tube

ఇక్కడ భావన్నారాయణ స్వామి కాలి వేళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటుందిం. ఇలా ఓ దేవతా మూర్తి భక్తుల కోసం ఎదురు చూడటం భారత దేశంలో మరెక్కడా కనిపించవు.

చలికాలంలో వెచ్చగా

చలికాలంలో వెచ్చగా

P.C: You Tube

ఈ ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగా ఉంటుంది. ఇది అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఆ ఆలయానికి రెండు ధ్వజస్థంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు గజపాద (ఏనుగు కాలు) ఆకారంలో ఉండటం విశేషం.

చేప ఆకారంలో

చేప ఆకారంలో

P.C: You Tube

ఆలయ గర్భగుడి వెనుక పై కప్పు మత్స్యం అంటే చేప ఆకారంలో కనిపిస్తుంది. దీన్ని తాకితే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 594లో భావనారాయణుడి సూచనమేరకు చోళ రాజైన క్రిమికంఠ చోళుడు నిర్మించినట్లు చెబుతారు.

దేవరాయులు

దేవరాయులు

P.C: You Tube

ఇతని తర్వాత చోళ భూపాల దేవుడు, వీర ప్రతాప శూర భల్లయ చోళ మహారాజు, కుళోత్తుంగ చోళదేవరాజు, గజపతులు, దేవరాయులు అటుపై అచ్చుత దేవరాయులు, సదాశివరాయులు ఈ ఆలయం అభివ`ద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు.

పునాదులు

పునాదులు

P.C: You Tube

ఇదిలాఉండగా భావనారాయణ స్వామి దేవాలయ నిర్మాణం జరిగే సమయంలో పునాదుల కోసం తవ్వుతుండగ అక్కడి వారికి జ్వాలా నరసింహ స్వామి విగ్రహం దొరికింది. దీంతో ఆ విగ్రహన్ని స్వామివారి విగ్రహం పక్కనే పెట్టి పూజించేవారు.

పురోహితులు

పురోహితులు

P.C: You Tube

అయితే ఆ విగ్రహం అక్కడ పెట్టినప్పటి నుంచి దేవాలయానికి దగ్గరగా ఉన్న కారంచేడు అనే గ్రామం తరుచుగా అగ్నిప్రమాదాలు జరిగేవి. ఈ విషయమై క్రిమకంఠ చోళుడు అక్కడి పురోహితులను సంప్రదించి పరిష్కారం చూపమని అడిగారు.

జ్వాలా నరసింహుడు

జ్వాలా నరసింహుడు

P.C: You Tube

దీంతో పురోహితులు జ్వాలా నరసింహుడి ఉగ్ర రూపం వల్ల ఇక్కడ తరుచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఆయన్ను శాంతింప చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం స్వామివారి ఆలయానికి ఎదురుగా శాంత కేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

అగ్ని ప్రమాదాలు

అగ్ని ప్రమాదాలు

P.C: You Tube

అప్పటి నుంచి ఆ కారంచేడు గ్రామంలో అగ్నిప్రమాదాలు నిలిచిపోయాయని చెబుతారు. ఇక జ్వాలా నరసింహుడి విగ్రహం ఆసీన రీతిలో ఉంటుంది. నాలుగు చేతులు ఉంటాయి. పై రెండు చేతులతో శంఖం, చక్రం ఉండగా కింది కుడి చేయి అభయ హస్తం. ఎడమ చేయి తొడపై ఉంటుంది.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

P.C: You Tube

బాపట్లకు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల నుంచి నిత్యం నేరుగా బస్సు సర్వీసులు ఉన్నాయి. అదే విధంగా దక్షిణ భారతదేశంలోని చాలా నగరాల నుంచి రైలు సౌకర్యాలు ఉన్నాయి. బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి భావనారాయణ స్వామి దేవాలయం కేవలం అర కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఆటోలు అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X