Search
  • Follow NativePlanet
Share
» »కేరళ సారవంతమైన భూములకు కారణమైన ఈ పుణ్యక్షేత్రం సందర్శనతో...

కేరళ సారవంతమైన భూములకు కారణమైన ఈ పుణ్యక్షేత్రం సందర్శనతో...

కేరళలోని వెట్టికోడ్ నాగరాజ దేవాలయానికి సంబంధించిన కథనం.

కేరళలో అత్యంత అరుదైన దేవాలయం వెట్టికోడ్ నాగరాజ దేవాలయం. ఈ దేవాలయం నిర్మాణానికి మూలకారణం పరశరాముడు. ఇక ఈ దేవాలయం నిర్మాణ సమయంలో త్రిమూర్తులు స్వయంగా ఇక్కడకు విచ్చేసి సహకారం అందించారని చెబుతారు.

ఈ వెట్టికోడ్ నాగరాజ దేవాలయం వల్లే కేరళలోని భూములన్నీ సారవంతంగా మారాయని చెబుతారు. ఈ దేవాలయాన్ని సందర్శించడం వల్ల సర్ప, కాల దోష నివారణ జరిగి ఎంచుకొన్న రంగంలో అగ్రశిఖరాలను చేరుకోవడానికి వీలవుతుందని చెబుతారు.

అందువల్లే చూడటానికి చాలా చిన్న దేవాలయంగా కనిపించినా ఈ వెట్టికోడ్ నాగరాజ దేవాలయాన్ని ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇందుకు గల కారణాలన్నీ ఈ కథనంలో మీ కోసం...

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

తన తండ్రి మరణానికి కారణమైన క్షత్రియులను సంహరించడానికి వీలుగా ఈ భూ మండలం పై పరుశరాముడు 24 సార్లు పర్యటించి కనిపించిన క్షత్రియుడిని సంహరిస్తాడు. దీంతో ఈ భూమండలం మొత్తం మీద తాను వశపరుచుక్క భూమి మొత్తాన్ని కశ్యప మహర్షికి అందజేస్తాడు.

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

అయితే ఆ భూమి మొత్తం రక్తంతో తడిసిపోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. అంతే కాకుండా బంజరుభూమిగా మారిన ఆ భూమిని తాను ఏమి చేసుకోవాలని కశ్యప మహర్షి సదరు భూమిని పరుశరాముడికి వెనక్కు ఇచ్చేస్తాడు.

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

దీంతో పరుశరాముడు కోపంతో తన ఆయుధమైన పరుశువను సముద్రంలోకి విసిరి వేస్తాడు. అటు పై ఆలోచించి సముద్రుడిని ప్రార్థించి తన పరుశువు ఎంత పరిమాణంలో ఉందో అంత పరిమాణంలోని భూమిని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతాడు.

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

సాక్షాత్తు విష్ణువు ప్రతిరూపమైన పరుశరాముడు కోరడంతో సముద్రుడు తనలో ఉన్న భూమిని నీటి పైకి తీసుకువస్తాడు. అదే ప్రస్తుత కేరళ రాష్ట్రం. అయితే సముద్ర లవణాల వల్ల ఆ భూమి కూడా వ్యవసాయానికే కాకుండా నివాసయోగ్యంగా కూడా పనికి రాదు.

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

దీంతో పరుశరాముడు తిరిగి సర్పరాజు గురించి ఘెర తపస్సు చేస్తాడు. పరుశరాముడి తపస్సుకు మెచ్చిన నాగరాజు ప్రత్యక్షమై వరాలను కోరుకోమంటాడు. దీంతో తన పరిస్థితి వివరించి ఆ భూమి మొత్తం సారవంతం అయ్యేలా చూడమని కోరుతాడు.

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

దీంతో నాగరాజు తన జాతి మొత్తాన్ని అక్కడకి రప్పించి భూమి పై, లోపల ఉన్న లవణాలను మొత్తం పాములు తమలోకి తీసుకోవాలని ఆదేశిస్తాడు. దీంతో పాములు ఆ భూమి పై, లోపల ఉన్న లవణాలను తమలోకి తీసుకోవడంతో ఆ ప్రాంతం అంటే ప్రస్తుతం కేరళ ప్రాంతం మొత్తం సస్యస్యామలవుతుంది.

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

అందువల్లే ఈ కేరళ రాష్ట్రం సారవంతమైన భూములు ఉన్నాయని చెబుతారు. ఇక నాగరాజు చేసిన పనికి గుర్తుగా పరుశరాముడు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాలని భావిస్తాడు. ఇందుకు త్రిమూర్తుల సహకారం కోరుతాడు.

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

దీంతో త్రిమూర్తులైన పరమేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు స్వయంగా ప్రత్యక్షమవుతారు. దేవాలయ నిర్మాణానికి బ్రహ్మ ముహుర్తం నిర్ణయించగా, పరమేశ్వరుడు అవసరమైన వస్తువలన్నీ సమకూరుస్తాడు. ఇక విష్ణు స్వయంగా నాగరాజు విగ్రహాన్ని తయారు చేస్తాడు.

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

ఇలా ఇక్కడ నాగరాజు దేవాలయం నిర్మాణంలో త్రిమూర్తులు స్వయంగా పాల్గొనడం వల్ల ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైన దేవాలయంగా భావిస్తున్నారు. అంతేకాకుండా విష్ణు ప్రతిరూపమైన పరుశరాముడు వల్ల త్రిమూర్తుల సహకారంతో వెలిసిన ఈ దేవాలయంలో కాల, సర్పదోష నివారణ పూజలు చేయించడం వల్ల జీవితంలో కష్టాలు ఎదురుకావని ప్రజలు నమ్ముతారు.

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

P.C: You Tube


అందువల్లే ప్రతి ఏడాది వేల సంఖ్యలో ఇక్కడకు భక్తులు వస్తుంటారు. ఇదిలా ఉండగా ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో వేల సంఖ్యలో మనం పాములను చూడవచ్చు. వాటి వల్ల ఇప్పటి వరకూ ఒక్కరికి కూడా అపాయం సంభవించలేదని ఇక్కడ ఉన్నవారు చెబుతారు.

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

వెట్టికోడ్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం కేరళలోని అలప్పీ జిల్లాలోని పల్లిక్కల్ శివారులోని వెట్టికోడ్ అనే గ్రామంలో ఉంది. ఈ క్షేత్రానికి దగ్గరగా కాయంకులం, మావేలిక్కర అనే రైల్వే స్టేషన్లు దగ్గరగా ఉంటాయి. పనలూరు నుంచి కాయంకులం వెళ్లే రోడ్డు మార్గంలో ప్రతి బస్సు ఇక్కడ ఆగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X