Search
  • Follow NativePlanet
Share
» »ఈ ద్వారం నుంచి వెళ్లి స్వర్గాన్ని, ఆ ద్వారం నుంచి వెళ్లి మోక్షాన్ని పొందవచ్చు మరెందుకు ఆలస్యం

ఈ ద్వారం నుంచి వెళ్లి స్వర్గాన్ని, ఆ ద్వారం నుంచి వెళ్లి మోక్షాన్ని పొందవచ్చు మరెందుకు ఆలస్యం

ద్వారక నగరంలోని ద్వారకాధీశ ఆలయం గురించి కథనం.

భారత దేశంలో ఒక్కొక్క ఆలయానిది ఒక్కొక్క విశిష్టత. ఈ దేవాలయాల సందర్శన కోసం చేసే యాత్రలకు కూడా ప్రత్యేకత ఉంటుంది. అటువంటి కోవకు చెందినదే ఛార్ ధామ్ యాత్రలో భాగమైన ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయం. ఏ వైష్ణవ ఆలయంలో లేనట్టు ఈ దేవాలయంలో రెండు ద్వారాలు ఉంటాయి. ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని మోక్షద్వారం అని, దక్షిణ దిశలో ఉన్న ద్వారాన్ని స్వర్గ ద్వారం అని అంటారు.

భక్తులు స్వర్గ ద్వారం గుండా వెళ్లి మోక్షద్వారం గుండా వస్తారు. అందువల్లే ఈ ద్వారక నగరానికి మోక్షనగరమని పేరు. ఇక్కడి మూల విరాట్టు వైష్ణవుడైనా ఆలయ నిర్మాణం మాత్రం శైవ సంప్రదాయంలో చోటు చేసుకొంది. సున్నపురాయితో 2500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ ఆలయం గురించి కుప్లంగా మీ కోసం...

ఛార్ ధామ్ యాత్రలో ఒకటి

ఛార్ ధామ్ యాత్రలో ఒకటి

P.C: You Tube

హిందూ మతంలో ఛార్ ధామ్ యాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారత దేశంలోని నాలుగు దిక్కుల్లో ఉన్న నాలుగు పవిత్రమైన ఆలయాల సందర్శననే ఛార్ ధామ్ యాత్ర అని పేర్కొంటారు. అవి ఉత్తర దిక్కున ఉన్న బద్రీనాథ్ ఆలయం, తూర్పున ఉన్న పూరీలోని జగన్నాథ ఆలయం.

పడమర ఉన్న ద్వారక

పడమర ఉన్న ద్వారక

P.C: You Tube

అదే విధంగా దక్షిణ దిశలో ఉన్న రామేశ్వరంలోని రామనాథస్వామి దేవాలయం, పడమర ఉన్న ద్వారకాలోని ద్వారకాధీశ్ ఆలయం. శైవ, వైష్ణవ మతాలకు ప్రతీకగా ఈ నాలుగు దేవాలయాల్లో మూల విరాట్టులు భక్తులతో నిత్యం పూజలు అందుకొంటూ ఉన్నారు.

కృష్ణుడు ద్వారకాధీశుడి పేరుతో

కృష్ణుడు ద్వారకాధీశుడి పేరుతో

P.C: You Tube

హిందువులు జీవితంలో ఒక్కసారి అయినా ఛార్ దామ్ యాత్ర చేయాలని భావిస్తూ ఉంటారు. ఇందులో ద్వారక నగరం దేశంలోని ఏడు అతి పతిత్రమైన నగరాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ నగరంలోనే శైవులు పవిత్రంగా బావించే అష్టాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటై నాగేశ్వర లింగంతో పాటు వైష్ణవులకు ఆరాధ్యదైవ మైన కృష్ణుడు ద్వారకాధీశుడి పేరుతో ఇక్కడ కొలువై ఉన్నాడు.

దీనిని జగత్ మందిరం అని కూడా పిలుస్తారు

దీనిని జగత్ మందిరం అని కూడా పిలుస్తారు

P.C: You Tube

ఈ మందిరాన్ని శ్రీ కృష్ణుడి మనుమడైన వజ్రనాభుడి చేత నిర్మించబడినదని మన పురాణాలు చెబుతాయి. దీనిని జగత్ మందిరం అని కూడా పిలుస్తారు. అయితే ప్రస్తుత ఆలయం క్రీస్తు శకం 16వ శతాబ్దంలో నిర్మించారని చెబుతారు. ఆలయం చాళుక్యుల నిర్మాణశైలిని పోలి ఉంటుంది. ఈ ఆలయం ఎత్తు 51.8 మీటర్లు.

అద్భుతమైన శిల్పాలు కలిగిన 60 స్తంభాలు

అద్భుతమైన శిల్పాలు కలిగిన 60 స్తంభాలు

P.C: You Tube

ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పాలు కలిగిన 60 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలతో పాటు ఆలయ ప్రాకారాలన్నీ ద్వారకను పరిపాలించిన గుప్తులు, పల్లవుల రాజులు ఏర్పాటు చేశారని చెబుతారు. ఇక గర్భాగుడిలో 2.25 అడుగుల కృష్ణుడి విగ్రహం ఉంటుంది.

నాలుగు చేతులుతో ఉంటాడు

నాలుగు చేతులుతో ఉంటాడు

P.C: You Tube

ఈ విగ్రహంలో భగవానుడు నాలుగు చేతులుతో ఉంటాడు. ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో సుదర్శన చక్రం ఇంకో చేతిలో గద ఉండగా, నాల్గవ చేతిలో తామర పుష్పం ఉంటుంది. పురాణాలను అనుసరించి ఈ ఈ దేవాలయాన్ని విశ్వకర్మ ఒక్క రాత్రిలో నిర్మించాడని, అదే సమయంలో విగ్రహాన్ని కూడా ఆయనే చెక్కి ఇక్కడ ప్రతిష్టించాడని చెబుతారు.

 2500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం

2500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం

P.C: You Tube

ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సూర్యచంద్రులు కలిగిన జండాలు ఆలయ గోపురం పై నిత్యం ఎగురుతూ ఉంటాయి. అయితే ఈ జండాలను రోజుకు ఐదు సార్లు మారుస్తారు. ఇక్కడి మూల విరాట్టు వైష్ణవుడైనా ఆలయ నిర్మాణం మాత్రం శైవ సంప్రదాయంలో చోటు చేసుకొంది. సున్నపురాయితో 2500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.

దేవాలయంలో రెండు ద్వారాలు

దేవాలయంలో రెండు ద్వారాలు

P.C: You Tube

ఏ వైష్ణవ ఆలయంలో లేనట్టు ఈ దేవాలయంలో రెండు ద్వారాలు ఉంటాయి. ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని మోక్షద్వారం అని, దక్షిణ దిశలో ఉన్న ద్వారాన్ని స్వర్గ ద్వారం అని అంటారు. భక్తులు స్వర్గ ద్వారం గుండా వెళ్లి మోక్షద్వారం గుండా వస్తారు. అందువల్లే ఈ ద్వారక నగరానికి మోక్షనగరమని పేరు.

పుష్టి మార్గం ప్రకారం అనేక సేవలు

పుష్టి మార్గం ప్రకారం అనేక సేవలు

P.C: You Tube

ఇక గర్భగుడిలో ఉన్న ద్వారాకాధీశుడికి అనేక సేవలు జరుగుతాయి. అవి వరుసగా మంగళ, శ`ంగార్, గ్వాల్, రాజభోగ్, ఉథాపన్, భోగ్, సంధ్యా ఆరావళి, ష్యాన్. ఒక్కొక్క సేవకు స్వామివారికి ఒక్కొక్క వస్త్రాలంకారం ఉంటుంది. ఈ పూజా విధానాలన్నీ వల్లభాచార్యుల చేతర రాయబడిన పుష్టి మార్గం ప్రకారం జరుగుతాయి.

జామ్ నగర్ జిల్లాలో

జామ్ నగర్ జిల్లాలో

P.C: You Tube

గుజరాత్ లోని జామ్ నగర్ జిల్లాలో ద్వారక ఉంది. ఇక్కడకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు ఉన్నాయి. ద్వారకకు దగ్గరగా ఉన్న ద్వారకా వనంలో జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర లింగం ఉంది. అంతేకాకుండా ఇక్కడకు దగ్గర్లోనే బెట్ ద్వారక కూడా చూడదగిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X