Search
  • Follow NativePlanet
Share
» »శ్రీరాముడు పూజించిన చర్మరోగాలను నయం చేసే శివలింగం ఇదే

శ్రీరాముడు పూజించిన చర్మరోగాలను నయం చేసే శివలింగం ఇదే

శ్రీకాకుళంలోని ఎండల మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

By Kishore

భారత దేశం పుణ్యక్షేత్రాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఉన్నన్ని పుణ్యక్షేత్రాలు మరెక్కడా ఉండవు. ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రం అత్యంత పవిత్రమైనది. తన భక్తుడి కళేబరం పై శివుడు శివలింగం రూపంలో ఉద్భవించాడు. ఆ భక్తుడు చేసే పనిని తాను చేస్తూ ప్రజల పాలిట వైద్యుడిగా మారాడు. అందరికి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో తనకు తాను దేవాలయమే వద్దని చెప్పాడు. ఎండకు ఎండుతూ వానకు నానుతూ కూడా ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీరుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన సమస్త సమాచారం ఈ కథనంలో మీ కోసం...

ఈ చోటీ కాశీలో సర్పాలు ఇళ్లలోకి ప్రవేశించవుఈ చోటీ కాశీలో సర్పాలు ఇళ్లలోకి ప్రవేశించవు

1. తిరుగు ప్రయాణంలో

1. తిరుగు ప్రయాణంలో

Image Source:

రామరావణ యుద్ధంలో రాముడు గెలుస్తాడు. ఈ యుద్ధంలో తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరినీ అయోధ్యకు తీసుకువెళుతాడు. అలా వెళ్లే సమయంలో మార్గ మధ్యలో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం రావి వలస వద్దకు వచ్చే సరికి అందరూ అలసి పోతారు.

2. సుమంచ పర్వత శిఖరం పై

2. సుమంచ పర్వత శిఖరం పై

Image Source:
దీంతో ఆ రోజు రాత్రి అక్కడే వివిధ రకాల ఔషద గుణాల మొక్కలతో కూడిన సుమంచ పర్వతగిరి శిఖరం చేరుకొని విశ్రమిస్తారు. ఆ బ`ందంలో రాముడికి యుద్ధంలో సహాయపడిన సుశేణుడనే దేవ వైద్యుడు కూడా ఉంటాడు.

3. ఏదో ఒక రోగంతో

3. ఏదో ఒక రోగంతో

Image Source:

తెల్లవారిన తర్వాత అతడికి ఆ పర్వతం చుట్టు పక్కల ఉన్న ప్రజలంతా ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండటం కనిపిస్తుంది. స్వతహాగా వైద్యుడైన సుశేషణుడు తాను ఇక్కడే ఉండి వారికి సహాయం చేయాలని భావిస్తాడు.

4. అటు పై అయోధ్యకు వెళ్లిపోతాడు

4. అటు పై అయోధ్యకు వెళ్లిపోతాడు

Image Source:

తన కోరికను రాముడికి తెలుపుతాడు. ఆ వైద్యుడి కోరికను మన్నించడమే కాకుండా అతని ఆలోచనను శ్రీరాముడు ప్రశంసిస్తాడు. అటు పై శ్రీరాముడు తన పరివారంతో అయోధ్యకు వెళ్లిపోతాడు.

5. వైద్యం చేస్తూ ఉంటాడు

5. వైద్యం చేస్తూ ఉంటాడు

Image Source:

శ్రీరాముడితో పేర్కొన్న విధంగానే సుశేణుడు స్థానికులకు వైద్యం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తన ఇష్టదైవమైన పరమశివుడిని ప్రార్థిస్తూ కాలం గడుపుతుంటాడు.

6. ఒక రోజు సుశేణుడు

6. ఒక రోజు సుశేణుడు

Image Source:

ఈ క్రమంలోనే ఒక రోజు సుశేణుడు చనిపోతాడు. ఇదిలా ఉండగా కొంత కాలం తర్వాత సుశేణుడు ఎలా ఉన్నాడో చూసి రావాల్సిందిగా శ్రీరాముడు తన నమ్మిన బంటు అయిన హనుమంతుడిని ఆదేశిస్తాడు.

7. అస్థిపంజరం కనిపిస్తుంది

7. అస్థిపంజరం కనిపిస్తుంది

Image Source:

హనుమంతుడు సుమంచ పర్వత ప్రాంతానికి చేరుకొంటాడు. అయితే అక్కడ సుశేణుడి కోసం ఎంత వెదికినా కనిపించడు. చివరికి ఒక చోట ఒక అస్థిపంజరం కనిపిస్తుంది.

8. యోగ మాయ ద్వారా

8. యోగ మాయ ద్వారా

Image Source:

హనుమంతుడు తన యోగ మాయ ద్వారా చూడగా ఆ అస్థిపంజరం సుశేణుడదని అర్థం అవుతుంది. శివుడి గురించి తపస్సు చేస్తూ చివరికి ఆ శివుడిలోనే ఐక్యం అయిపోయాడని తెలుస్తుంది.

9.అయోద్యకు వెళ్లిపోతాడు

9.అయోద్యకు వెళ్లిపోతాడు

P.C. Ravivalasa002

దీంతో ఆ కళేబరాన్ని పర్వత శిఖరం పై గొయ్యి తీసి పూడ్చిపెడుతాడు. దాని పై అక్కడే పూచిన మల్లెపూలను వేసి అటు పై జింక చర్మాన్ని కప్పి తిరిగి అయోద్యకు తిరిగి వెళ్లిపోతాడు.

10. రాముడు సీతా సమేతుడై

10. రాముడు సీతా సమేతుడై

P.C. Ravivalasa002

హనుమంతుని ద్వారా విషయం తెలుసుకున్న శ్రీరాముడు సీత, లక్ష్మణ సమేతుడై తిరిగి ఆ సుమంచ పర్వతం వద్దకు వస్తాడు. సుశేణుడి కళేబరాన్ని రాముడిని చూపడానికి హనుమంతుడు ఆ జింక చర్మాన్ని తీస్తాడు.

11. కళేబరం స్థానంలో శివలింగం

11. కళేబరం స్థానంలో శివలింగం

P.C. Ravivalasa002

అక్కడ కళేబరం స్థానంలో శివలింగం ఉంటుంది. దాని పై పువ్వులు కూడా అలాగే ఉంటాయి. దీంతో ఇది శివలీలగా భావించిన శ్రీరాముడు వెంటనే పక్కనే ఉన్న కొలనులో స్నానం చేసి ఆ శివలింగాన్ని పూజించడం ప్రారంభిస్తాడు.

12. పెరిగి పోతూ ఉంటుంది

12. పెరిగి పోతూ ఉంటుంది

P.C. Ravivalasa002

ఒక వైపున శ్రీరాముడు పూజిస్తుంటే మరోవైపు ఆ శివలింగం పెరిగి బ`హదాకారాన్ని సంతరించుకొంటుంది. ఇక ఆ ప్రాంతంలోని ఔషద మూలికల చెట్ల నుంచి వీచిన గాలులు ఆ శివలింగాన్ని తాకి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు విస్తరిస్తాయి.

13. రోగాలన్నీ నయమవుతాయి

13. రోగాలన్నీ నయమవుతాయి

P.C. Ravivalasa002

ఆ గాలులు అలా వీచిన వెంటనే వాటిని పీల్చిన మానవులకు ఉన్న సర్వ రోగాలు నయమవుతాయి. ఇక ఆ శివలింగానికి దేవాలయం నిర్మించాలని భావించినా ఆ లింగం పెరుగుతూ ఉండటం వల్ల తన ఆలోచనను విరమించుకొని తిరిగి అయోధ్యకు వెళ్లిపోతాడు.

14. అందుకే ఆ పేరు

14. అందుకే ఆ పేరు

P.C. Ravivalasa002

మల్లెపూలతో పూజింపబడి, జీనంతో (చర్మం) కప్పబడి ఉన్నప్పుడు ఈశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో వెలిసినాడు కాబట్టి స్వామివారిని మల్లికాజీన స్వామి అనే వారు. అదే కాల క్రమంలో మల్లికార్జుడిగా మార్పు చెందింది.

15. ఎన్ని సార్లు ప్రయత్నించినా

15. ఎన్ని సార్లు ప్రయత్నించినా

P.C. Ravivalasa002

ఇదిలా ఉండగా 1870 ప్రాంతంలో టెక్కలి జమిందారు హరిశ్చంద్ర జగద్దేవ్ దేవాలయాన్ని నిర్మించాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా దేవాలయం కూలిపోవడం ప్రారంభించింది.

16.స్వయంగా చెబుతాడు

16.స్వయంగా చెబుతాడు

P.C. Ravivalasa002

ఈ సమయంలో స్వామి వారు ఒక భక్తుడి కలలో కనిపించి తనకు దేవాలయం అక్కర లేదని తాను ఆరు బయటనే ఉంటానన్నారు. అప్పుడు మాత్రమే చుట్టూ ఉన్న ఔషద గుణాలు ఉన్న మొక్కల నుంచి వచ్చే గాలులు తనను తాకి తిరిగి ప్రజల వద్దకు వస్తాయని దీనితో వారి రోగాలన్నీ పోతాయని చెబుతారు. అందువల్లే ఇక్కడ స్వామి వారికి దేవాలయం ఉండదు.

17. విశేష పూజలు జరుగుతాయి

17. విశేష పూజలు జరుగుతాయి

P.C. Ravivalasa002

ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఇక్కడ ఉన్న తీర్థంలో స్నానం చేసి స్వామి వారిని కొలిస్తే సర్వ వ్యాధులు నివారించబడుతాయని విశ్వసిస్తారు. ఇక్కడ మహాశివరాత్రితో పాటు కార్తీకమాసంలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ దేవాలయం శ్రీకాకులం జిల్లా టెక్కలి మండలం రావివలసకు దగ్గర్లో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X