Search
  • Follow NativePlanet
Share
» »దురదృష్టం పోగొట్టి అదృష్టం కలుగజేసే ఆలయం

దురదృష్టం పోగొట్టి అదృష్టం కలుగజేసే ఆలయం

తెలంగాణలోని జోగులాంబ దేవాలయం, అక్కడ ఉన్న నవ బ్రహ్మలకు సంబంధించిన విషయం.

By Kishore

త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు సృష్టికర్త పేరుంది. ఈ భూ మండలం పై ఉన్న సకల ప్రతి జీవి పుట్టుకకు ఆయనే కారణం. అయితే ఆయనకు భారత దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీదా వేళ్లమీద లెక్కపెట్టగలిగిన దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్ లోని పుష్కర్ లో మాత్రమే భారత దేశంలో బ్రహ్మకు చెప్పొకోదగ్గ దేవాలయం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో కూడా బ్రహ్మకు దేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మమనకు తొమ్మిది రూపాల్లో కనిపిస్తారు. ఇటువంటి దేవాలయం మరెక్కడా లేదు. ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అంతులేని జ్జానం, సంపద మన సొంతమవుతుందని స్థానికులు విశ్వసిస్తూ ఉంటారు. అంతే కాకుండా దురదృష్టం పోగొట్టి అదృష్టం కలుగజేస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయం విశిష్టత, ఆ దేవాలయం ఎక్కడ ఉంది తదితర వివరాలన్నీ మీ కోసం...

తడిచిన అందాలను చూడాలంటే...గోవాకే వెళ్లాల్సిన అవసరం లేదుతడిచిన అందాలను చూడాలంటే...గోవాకే వెళ్లాల్సిన అవసరం లేదు

1. ఎక్కడ ఉంది?

1. ఎక్కడ ఉంది?

Image Source:

వేదాలు, పురాణాల ప్రకారం భూ మండలంం పై జీవరాసి పుట్టుకకు మూలం బ్రహ్మ. అయితే ఆయనకు దేవాలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అటువంటి దేవాలయాల్లో ఒకటి మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆలంపూరలో ఉంది. ఇక్కడి జోగుళాంబ దేవాలయం ఆవరణంలోనే బ్రహ్మ దేవాలయం ఉంది

2. తొమ్మిది రూపాల్లో

2. తొమ్మిది రూపాల్లో

Image Source:

శ్రీ జోగులాంబ దేవాలయం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. ఇక్కడ బ్రహ్మ మొత్తం తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇలా బ్రహ్మ తొమ్మది వేర్వేరు రూపంలో ఉండటం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు.

3. ఇక్కడే తపస్సు చేశాడు...

3. ఇక్కడే తపస్సు చేశాడు...

Image Source:

ఆ బ్రహ్మ పరమశివుడి గురించి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని చెబుతారు. అందువల్లే ఈ పుణ్యక్షేత్రాన్ని పరమ పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ దేవాలయంతో పాటు శివుడికి కూడా గుడి ఉంది.

4. ఆ తొమ్మిది రూపాలు ఏవి

4. ఆ తొమ్మిది రూపాలు ఏవి

Image Source:

బాలబ్రహ్మేశ్వర, విశ్వబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్థబ్రహ్, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, వీరబ్రహ్మ పేర్లతో భక్తులకు బ్రహ్మ దేవుడు దర్శనమిస్తాడు.

5. అద్భుతమైన శిల్ప కళ

5. అద్భుతమైన శిల్ప కళ

Image Source:

ఇక్కడి దేవాలయాలు అద్భుతమైన శిల్పకళకు నిలయం. అనేక పురాణ కథలను అద్భుతమైన శిల్పాలుగా మలిచిన తీరు ఎటువంటి వారికైనా ఇట్టే నచ్చుతుంది. ఇక్కడి శిల్ప కళ పై అధ్యయనం చేయడానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు. అదే విధంగా ఇక్కడ శాసననాల పై నిత్యం అధ్యయనం జరుగుతూ ఉంటుంది.

 6. శివ లింగాలే ఆ రూపాలు?

6. శివ లింగాలే ఆ రూపాలు?

Image Source:

అయితే మరో కథనం ప్రకారం బ్రహ్మ తపస్సు చేయడంతో పాటు ఇక్కడ తొమ్మిది లింగాలను ప్రతిష్టించి పూజించాడని చెబుతారు. అవే బ్రహ్మ రూపంలో పూజించబడుతున్నాయని కూడా చెబుతారు. ఇక ఈ దేవాలయాన్ని ఒక్క సారి సందర్శిస్తే మన దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

7.ఎలా చేరుకోవాలి?

7.ఎలా చేరుకోవాలి?

Image Source:

తెలంగాణలోని అలంపూర్ లో జోగులాంబ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ఆవరణంలోనే మనకు నవబ్రహ్మ రూపాలు కనిపిస్తాయి. ఈ దేవాలయం గద్వాల్ నుంచి 54 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు సౌకర్యం కూడా ఉంది. హైదరాబాద్ నుంచి 208 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ నుంచి 289 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X