Search
  • Follow NativePlanet
Share
» »ప్రళయం కూడా ఏమీ చేయలేని మహాలక్ష్మీ అమ్మవారి నగరం

ప్రళయం కూడా ఏమీ చేయలేని మహాలక్ష్మీ అమ్మవారి నగరం

కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారి చరిత్రకు సంబంధించిన కథనం.

By Kishore

ప్రళయంలో కూడా చెక్కుచెదరని రెండే రెండు నగరాలు భారత దేశంలో ఉన్నట్లు పురాణాలు చెబుతాయి. అందులో ఒకటి వారణాసి కాగా మరొకటి కొల్హాపూర్. ఇందులో వారణాసిని సాక్షాత్తు పరమశివుడు తన త్రిశూలంతో పైకి ఎత్తి రక్షించాడని చెబుతారు. ఇక కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో అంటే చేతులతో కొల్హాపూర్ ను పైకి ఎత్తారని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రానికి కరవీర నగరగరమని కూడా పేరు. ఇక్కడ అమ్మవారిని కొలిస్తే సకల ఐశ్వర్యాలతో పాటు సంతానం లేని వారికి వెంటనే ఫలితం ఉంటుందని చెబుతారు. ఇక సూర్యగ్రహణం రోజు ఇక్కడ స్నానం చేస్తే పంచమహాపాతకాలు తొలిగిపోతాయని చెబుతారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం...

కోరుకొన్న వాడే వరుడుగా రావాలనుకొంటున్నారా?కోరుకొన్న వాడే వరుడుగా రావాలనుకొంటున్నారా?

1. మహాయాగం

1. మహాయాగం

Image Source:

పూర్వం దక్షుడు మహాయాగాన్ని చేడయానికి ఉపక్రమిస్తాడు. అయితే మిగిలిన బిడ్డలను వారి భర్తలను యాగానికి ఆహ్వనించిన దక్షుడు తన కుమార్తే అయిన దాక్షాయణిని ఆమె భర్త పరమశివుడిని యాగానికి ఆహ్వనించడు.

2.అయినా కూడా

2.అయినా కూడా

Image Source:

అయినా కూడా పుట్టింటి పై మమకారం చావని దాక్షాక్షాయని యాగం జరిగే స్థలానికి వస్తుంది. కుమార్తె అన్న మమకారం కూడా లేని దక్షుడు ఆమెను, ఆమె భర్త అయిన పరమశివుడిని దూశిస్తాడు.

3.ఆత్మాహుతికి పాల్పడుతుంది

3.ఆత్మాహుతికి పాల్పడుతుంది

Image Source:

దీంతో ఆ అవమానం భరించలేక దాక్షాయని ఆత్మాహుతికి పాల్పడుతుంది. ఈ విషయం తెలిసిన పరమశివుడు ఆగ్రహంతో రగిలిపోతాడు. వీర భద్రుడిని సష్టించి యాగాన్ని ధ్వసం చేయడమే కాకుండా దక్షుడిని వీరభద్రుడి చేత సంహరింపజేస్తాడు.

4.విష్ణువు సహాయం

4.విష్ణువు సహాయం

Image Source:

అటు పై దాక్షాయని శరీరాన్ని భుజం పై వేసుకొని ప్రళయ తాడవం చేస్తాడు. దీంతో భీతిల్లిన దేవతులు విష్ణువు సహాయం అర్థిస్తారు.

5. సుదర్శన చక్రం

5. సుదర్శన చక్రం

Image Source:

సమస్య పరిష్కారం కోసం తన సుదర్శన చక్రంతో దాక్షాయణి శరీరాన్ని 51 ముక్కలుగా కత్తిరిస్తాడు. అలా కత్తిరించిన ముక్కలు దేశంలో వివిధ చోట్ల పడుతాయి అలా పడిన ప్రాంతాలు తర్వాత కాలంలో శక్తిపీఠాలుగా వెలిశాయి.

6. ఎడమ కనుగుడ్డు పడిన ప్రాంతమే

6. ఎడమ కనుగుడ్డు పడిన ప్రాంతమే

Image Source:

ఈ నేపథ్యంలోనే దాక్షాయని ఎడమ కనుగుడ్డు పడిన కొల్హపూర్ లో అమ్మవారు మహాలక్ష్మి రూపంలో వెలిశారని స్థలపురాణం చెబుతుంది.

7.అగస్త్య మహాముని

7.అగస్త్య మహాముని

Image Source:

మరో కథనం ప్రకారం అగస్త్య మహాముని ప్రతి సంవత్సరం కాశీకి వెళ్లి అక్కడి విశ్వనాథుడిని సందర్శించుకొని వచ్చేవాడు. అయితే వయోభారం వల్ల ఒక ఏడు కాశీకి వెళ్లలేకపోయాడు.

8.శంకరుడు ప్రత్యక్షమవుతాడు

8.శంకరుడు ప్రత్యక్షమవుతాడు

Image Source:

పరమశివభక్తుడైన అగస్త్యమహాముని శివుడిని ప్రార్థించగా ఆ బోళా శంకరుడు ప్రత్యక్షమవుతాడు. స్వామి నేను వయోభారం వల్ల కాశీకి రాలేకపోతున్నానని తనకు ప్రత్యామ్నాయం చూపించాలని వేడుకొంటాడు.

9.కాశీతో సమానమైన ప్రాశస్త్యం కలిగినది

9.కాశీతో సమానమైన ప్రాశస్త్యం కలిగినది

Image Source:

కాశీతో సమాయనమైన ప్రాశస్త్యం కలిగిన ప్రదేశం కొల్హపుర్ అని అక్కడ అమ్మవారు మహాలక్ష్మీ రూపంలో కొలువై ఉన్నట్టు సాక్షాత్తు పరమశివుడు అగస్త్య మహామునికి చెబుతాడు.

10.అంతటిపుణ్యం

10.అంతటిపుణ్యం

Image Source:

అమ్మవారిని సందర్శించి పూజిస్తే కాశీలో విశ్వేశ్వరుడితోపాటు అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని సందర్శించుకున్నంత పుణ్యమని చెబుతాడు.

11.ఇప్పటికీ

11.ఇప్పటికీ

Image Source:

అప్పటి నుంచి అగస్తుడు తనకు దగ్గరగా ఉన్న కొల్హాపూర్ లో అమ్మవారిని సందర్శించుకునేవాడు. ఇప్పటికీ కూడా అగస్తుడు ప్రతి ఏడు ఇక్కడికి వచ్చి అమ్మవారిని సందర్శించుకుంటున్నట్లు స్థానికుల నమ్మకం.

12. కరవీర నగరమని

12. కరవీర నగరమని

Image Source:

ఈ క్షేత్రానికి కరవీర నగరమని పేరు. అదే విధంగా అమ్మవారిని కరివీర మహాలక్ష్మీ అమ్మవారిగా కొలుస్తారు. ఇందుకు సంబంధించి పురాణ కథనాన్ని కూడా స్థానిక పూజారులు చెబుతారు.

13.అమ్మవారు చేతులతో

13.అమ్మవారు చేతులతో

Image Source:

ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీ నగరాన్ని ఎత్తి రక్షించగా, నీటిలో మునిగిపోయిన ఈ కొల్హపూర్ ను అమ్మవారు తన కరముల (చేతులు)తో ఎత్తి కాపాడిందని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రానికి కరివీర నగరమని పేరు వచ్చింది.

14. అధిష్టాన దేవత మహాలక్ష్మి అమ్మవారు

14. అధిష్టాన దేవత మహాలక్ష్మి అమ్మవారు

Image Source:

కొల్హాపూర్ లో అధిష్టాన దేవత మహాలక్ష్మి అమ్మవారు. ఇక ఈ క్షేత్రంలో సూర్యగ్రహనం రోజున శివుడు నీరుగా, మహావిష్ణువు రాయిగగా మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా మూడుకోట్ల మంది దేవతలు తీర్థాలుగా కొలువుతారని చెబుతారు.

15. సూర్యగ్రహనం రోజున

15. సూర్యగ్రహనం రోజున

Image Source:

అందువల్లే సూర్యగ్రహనం రోజు క్షేత్రంలో స్నానం చేస్తే పంచమహాపాతకాలు తొలిగిపోతాయని చెబుతుంటారు. అందువల్లే సూర్యగ్రహనం రోజున ఇక్కడ ఎక్కువ మంది
పర్యాటకులు వస్తూ ఉంటారు.

16.సంతానం, వివాహ యోగం

16.సంతానం, వివాహ యోగం

Image Source:

కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని పుష్పాలతో పూజిస్తే పువ్వులాంటి పిల్లలు పుడుతారని చెబుతారు. అదే విధంగా ఇక్కడ అవివాహితులు శ్రీచక్రపూజలు నిర్వహిస్తే వివాత్వరగా జరుగుతుందని భక్తుల నమ్మకం.

17. హేమాడ్ పంతి నిర్మాణశైలి

17. హేమాడ్ పంతి నిర్మాణశైలి

Image Source:

ఇక అమ్మవారి దేవాలయం హేమాడ్ పంతి నిర్మాణశైలిలో ఉంటుంది. చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయంలో ఉన్న శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి.

18. విశాలమైన మండపం

18. విశాలమైన మండపం

Image Source:

పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందు వందఅడుగుల పొడవు ఉన్న విశాలమైన పండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం ఉంటుంది.

19.అంబాబాయి అని పిలుస్తారు.

19.అంబాబాయి అని పిలుస్తారు.

Image Source:

గర్భగుడిలో సుమారు ఆరడుగుల ఎతైన వేదిక మీద రెండడుగుల పీఠం ఉంటుంది. దీని మీద మూడు అడుగుల ఉన్న మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులు కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X