Search
  • Follow NativePlanet
Share
» »గొడ్రాళ్లకు కూడా సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించే ముక్తేశ్వర దేవాలయం

గొడ్రాళ్లకు కూడా సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించే ముక్తేశ్వర దేవాలయం

భువనేశ్వర్ లోని ముక్తేశ్వర ఆలయం గురించి కథనం.

భారత దేశంలోని చాలా ఆలయాలు పురాణ ప్రాధన్యత కలిగినవే. అయితే కొన్ని దేవాలయాలు మాత్రం శిల్ప కళతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ఆ కోవకు చెందినదే ఒరిస్సాలోని ముక్తేశ్వర ఆలయం. ఇక్కడ ప్రధాన దైవాన్ని పూజిస్తే ముక్తి లభిస్తుందని చెబుతారు.

ఇక ఈ దేవాలయంలోని శిల్పకళ అప్పటి వరకూ ఉన్న భారతీయ శిల్పకళకు కొత్త మార్గాన్ని చూపించిందని చరిత్ర కారుల అభిప్రాయం. అందుకు తగ్గట్టే ఆలయ నిర్మాణంతో పాటు ఆలయంలోని శిల్ప కళ విభిన్నంగా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం కూడా విభిన్న శైలిని పోలి ఉంటుంది.

ఈ ఆలయంలో సంవత్సరానికి ఒకసారి జరిగే రథోత్సవానికి దేశంలో చాలా ప్రాంతాల నుంచి మహిళలు ఎక్కువగా వస్తారు. ఇందుకు కారణం ఈ కథనంలో వివరించాము. అదే విధంగా ఈ దేవాలయంలో తాంత్రిక ఆరాధన చేసేవారు కూడా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు. ఈ నేపథ్యంలో ఆయంలోని శిల్పకళారీతితో పాటు అక్కడి విశిష్టతలను వివరించే కథనం మీ కోసం

1. భువనేశ్వర్ పట్టణం

1. భువనేశ్వర్ పట్టణం

P.C: You Tube

ముక్తేశ్వర దేవాలయం ఒడిషా రాష్ట్రరాజధాని భువనేశ్వర్ పట్టణంలో ఉంది. ఈ దేవాలయాన్ని శ్రీస్తు శకం 950 నుంచి 975 మధ్య నిర్మించినట్లు చెబుతారు. కళింగ ఆలయ వాస్తు ప్రకారం ఈ దేవాలయాలన్ని నిర్మించారు.

2. పరిశోధనలు చేస్తూనే ఉన్నారు

2. పరిశోధనలు చేస్తూనే ఉన్నారు

P.C: You Tube

అయితే ఈ దేవాలయంలోని ఈ శిల్ప సంపద అంతకు ముందున్న శిల్ప కళతో పోలిస్తే ఎంతో ఉన్నత స్థాయికి చేరుకొందని పురావస్తుశాఖ అధికారుల అభిప్రాయం. ఈ విషయం పై ఇంకా పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

3. శిల్ప సంపదను చూడటానికి

3. శిల్ప సంపదను చూడటానికి

P.C: You Tube

అందువల్లే ఈ దేవాలయానికి పురాణ ప్రాధాన్యత అంతగా లేకపోయినా ఇక్కడి శిల్ప సంపదను చూడటానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు.

4. ఇతర దేవాలయాలకు మార్గదర్శకమయ్యింది

4. ఇతర దేవాలయాలకు మార్గదర్శకమయ్యింది

P.C: You Tube

అదే విధంగా ఇక్కడి ఉన్న శిల్పకళ ఒడిషాలోని ఈ ఆలయం నిర్మించిన తర్వాత నిర్మించిన రాజారాణీ దేవాలయం, లింగరాజ దేవాలయాలకు మార్గదర్శకమయ్యింది. అంటే ఇక్కడి శిల్ప కళ ఎంత నయన మనోహరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

5. యయాతి-1

5. యయాతి-1

P.C: You Tube

ఈ దేవాలయాన్ని ఒడిషాతో పాటు చుట్టుపక్కల ఉన్నకొన్ని రాష్ట్రాలను పరిపాలించిన సోమవంపురాజుల్లో ముఖ్యడైన యయాతి-1 క్రీస్తుశకం 966లో నిర్మించినట్లు ఇక్కడ దొరికిన శాసనాలతో పాటు కే.సీ పాణిగ్రాహి పరిశోధనల వల్ల తేలింది.

6. జెమ్ ఆఫ్ ఒడిషా ఆర్కిటెక్చర్

6. జెమ్ ఆఫ్ ఒడిషా ఆర్కిటెక్చర్

P.C: You Tube

భువనేశ్వర్ తో పాటు చుట్టు పక్కల ఉన్న దేవాలయాలతో పోలిస్తే ఈ దేవాలయం పరిమాణంలో కాస్త చిన్నదిగా ఉంటుంది. అయితే ఇక్కడ శిల్పసంపద అమోఘం. అందువల్లే దీనిని జెమ్ ఆఫ్ ఒడిషా ఆర్కిటెక్చర్ అని పిలుస్తారు.

7. అప్పటి వరకూ లేని వాస్తు శాస్త్రాన్ని

7. అప్పటి వరకూ లేని వాస్తు శాస్త్రాన్ని

P.C: You Tube

దేశీయ శిల్పకళలో నూతన సంప్రదాయానికి ఈ దేవాలయం ద్వారం తెరిసిందని చెప్పబడుతుంది. అప్పటి వరకూ లేని వాస్తు శాస్త్రాన్ని ఈ దేవాలయం పరిచయం చేసింది. ముఖ్యంగా ఈ దేవాలయ ప్రాకారానికి ద్వారంగా ఒక ఎతైన తోరణం కనిపిస్తుంది.

8. బౌద్ధ ఆలయ నిర్మాణ శైలి

8. బౌద్ధ ఆలయ నిర్మాణ శైలి

P.C: You Tube

ఈ తోరణం పై అనేక లతలు, పక్షులు అందంగా చెక్కబడ్డాయి. దీని నిర్మాణంలో బౌద్ధ ఆలయ నిర్మాణ శైలి ప్రభావం కనిపిస్తుంది. ఈ తోరణానికి వెడల్పాటి స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాల పై భారతీయ సంస్క`తి సంప్రదాయాలను ప్రతిబింభించే స్త్రీ మూర్తుల విగ్రహాలు చెక్కబడ్డాయి.

9. ముందు నుంచి చూసినా వెనుక నుంచి చూసినా

9. ముందు నుంచి చూసినా వెనుక నుంచి చూసినా

P.C: You Tube

ఇప్పటికీ ఈ స్త్రీ మూర్తుల విగ్రహాల పై ఉన్న ఆభరణాల రూపంలో సరికొత్త బంగారు ఆభరణాలు అక్కడి వారు తయారు చేస్తున్నారు. ఈ తోరణం ముందు నుంచి చూసినా, వెనుక నుంచి చూసినా ఒకే విధంగా కనిపిస్తుండటం విశేషం.

10. పిరమిడ్ ఆకారంలో

10. పిరమిడ్ ఆకారంలో

P.C: You Tube

సాదారణంగా ఆలయంలోని మండపాలు అంతస్తుల ప్రకారం నిర్మించబడి ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం మనం దేవాలయం పశ్చిమాభిముఖంగా ఉన్న మండపం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అప్పట్లో ఇది అరుదైన నూతన విధానం.

11. చతురస్రాకారంలో ఉండి

11. చతురస్రాకారంలో ఉండి

P.C: You Tube

వీమాన గోపురం అడుగు చతురస్రాకారంలో ఉండి నాలుగు ముఖాలను కలిగి ఉంటుంది. నాలుగు వైపులా నాలుగు నటరాజ విగ్రహాలు ఉంటాయి. వీమాన గోపురం పై భాగంలో మరో శిఖరం ఉండి అణువణువూ శిల్పాకృతులతో అలంకరించబడి ఉంటుంది.

12. అందమైన స్త్రీల బొమ్మలు

12. అందమైన స్త్రీల బొమ్మలు

P.C: You Tube

గర్భగుడి చుట్లూ లోపలి భాగంలోని గోడల పై అందమైన స్త్రీల బొమ్మలు చెక్కబడి ఉంటాయి. ముఖ్యంగా నాగినులు పెనువేసుకన్న రీతిలో చెక్కిన శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. గర్భగుడి లోపలి భాగం ఘనాకారంలో ఉండగా వెలుపల స్థూపాకారంలో ఉంటుంది.

13. జగన్మోహన మండపం

13. జగన్మోహన మండపం

P.C: You Tube

జగన్మోహన మండపం 115 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ మండపం ఎర్రని ఇసుకరాయితో నిర్మించారు. ఇక్కడ సాధువులతో పాటు శృంగార స్త్రీల బొమ్మలు కూడా చెక్కబడివున్నాయి. గజలక్ష్మీ, రాహు, కేతు విగ్రహాలు ఇక్కడ చూడముచ్చటగా కనిపిస్తాయి.

14. కేతువు విగ్రహం

14. కేతువు విగ్రహం

P.C: You Tube

గర్భగుడి ద్వారం పై నవగ్రహాల్లో ఆఖరిది అయిన కేతువు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం చుట్టూ మూడు పడగులతో ఉన్న పాము ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీని పక్కన కూడా నిగినుల బొమ్మలు ఎన్నో ఉంటాయి.

15. శైవక్షేత్రం

15. శైవక్షేత్రం

P.C: You Tube

ఇక ఈ దేవాలయం ప్రముఖ శైవక్షేత్రం ఇక్కడి వైదాన్ని కొలుస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం అందువల్లే ఇక్కడి పరమేశ్వరుడిని ముక్తేశ్వరుడిని అంటారు. ఈ ఆలయంలో తాంత్రిక విద్యలు ఆరాధించే సాధువులు కూడా ఎక్కువగా కనిపిస్తారు.

16. మారీచకుండం అనే కోనేటిలో

16. మారీచకుండం అనే కోనేటిలో

P.C: You Tube

అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం రథోత్సవం జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడి ఆలయం నైరుతి దిశలో ఉన్న మారీచకుండం అనే కోనేటిలో స్నానం చేస్తే గొడ్రాళ్లకు కూడా సంతానం కలుగుతుందని నమ్ముతారు. అందువల్లే ఈ ఉత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాల వరకూ ఇక్కడికి వస్తుంటారు.

 17. ముక్తేశ్వర నాట్యోత్సవాల పేరుతో

17. ముక్తేశ్వర నాట్యోత్సవాల పేరుతో

P.C: You Tube

ఒడిషా పర్యాటక శాఖ ప్రతి ఏడూ ఇక్కడ ముక్తేశ్వర నాట్యోత్సవాల పేరుతో మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రఖ్యాతిగాంచిన ఒడిస్సీ నృత్య కళాకారులు, కళాకారిణులు తమ నృత్యాలతో అలరిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X