Search
  • Follow NativePlanet
Share
» »శ్రావణ మాసంలో వీటిలో ఒక్క దేవాలయాన్ని సందర్శించినా చాలు

శ్రావణ మాసంలో వీటిలో ఒక్క దేవాలయాన్ని సందర్శించినా చాలు

శ్రావణ మాసంలో సందర్శించదగిన శివాలయాల గురించి కథనం.

లయకారకుడైన ఆ పరమశివుడికి ఇష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ సమయంలో ఆ పరమేశ్వరుడిని పూజిస్తే అనుకొన్న కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతున్నారు. అనాదిగా ఈ నమ్మకంతోనే భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాను సందర్శిస్తున్నారు. ఇక దేశంలో ఇటువంటి పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో అత్యంత విశిష్టమైన దేవాలయాాలయాలకు సంబందిచిన క్లుప్త సమాచారం మీ కోసం అందిస్తున్నాం. వీటిలో మీకు దగ్గర్లో ఉన్న ఏ ఒక్క దేవాలయాన్ని ఈ శ్రావణ మాసం లోపు సందర్శించినా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ధార్మిక వేత్తలు చెబుతున్నారు. శ్రావణ మాసం ముగియడానికి ఇంకా ముప్పై రోజుల సమయం ఉంది. కాబట్టి వీటిలో ఏదో ఒకదానికి వారాంతంలోవ ెళ్లడానికి ప్రయత్నించండి.

సోమనాథ్ దేవాలయం

సోమనాథ్ దేవాలయం

P.C: You Tube

భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన సోమనాథ్ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ ఉత్తర భారత దేశంలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం అత్యంత ప్రచీనమైనది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటి క్షేత్రం. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు.

మల్లికార్జున దేవాలయం

మల్లికార్జున దేవాలయం

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. నల్లమల అడవుల్లో క`ష్ణానది ఒడ్డున ఉన్న ఈ దేవాలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ ఆ పరమశివుడు భ్రమరాంబ సహితంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రానికి శ్రీగిరి, శ్రీపర్వతమని కూడా పేరు.

మహాకాలేశ్వర లింగం

మహాకాలేశ్వర లింగం

P.C: You Tube

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాలేశ్వర లింగం పురాణ ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ పరమేశ్వరుడు మహాకాళ రూపంలో కొలువై ఉన్నాడు. ప్రతి రోజూ ఉదయం జరిగే భస్మ హారతిని చూడటానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. హిందువులు ముఖ్యంగా శైవులు జీవితంలో ఒక్కసారైన ఇక్కడి శివలింగాన్ని దర్శించుకోవాలని భావిస్తుంటారు.

ఓంకారేశ్వర దేవాలయం

ఓంకారేశ్వర దేవాలయం

P.C: You Tube

మధ్యప్రదేశ్ లోని నర్మద నది మధ్యలో ఉన్న మందాత ద్వీపంలో ఈ ఓంకారేశ్వర దేవాలయం ఉంటుంది. ఆకాశం నుంచి చూస్తే ఈ ద్వీపం ఓంకార రూపంలో కనిపిస్తుంది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ పరమేశ్వరుడు మూడు ముఖాలతో కనిపిస్తాడు. ముఖ్యంగా శ్రావణ మాసంలోని సోమవారం జరిగే ప్రత్యేక పూజలకు వేల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

భీమాశంకర్ దేవాలయం, మహారాష్ట్ర

భీమాశంకర్ దేవాలయం, మహారాష్ట్ర

P.C: You Tube

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమ శంకరక్షేత్రం మహారాష్ట్రలోని పూణేకు 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమానది ఒడ్డున ఈ క్షేత్రం ప్రక`తి సంపదతో నిండి ఉంటుంది. ఇక్కడ పరమేశ్వరుడు భీమాశంకరుడి పేరుతో శాకినీ, డాకిని మైదలైన రాక్షసగణాలతో సేవించబడుతుంటాడని ప్రతీతి.

కాశీ విశ్వనాథ్, ఉత్తరప్రదేశ్

కాశీ విశ్వనాథ్, ఉత్తరప్రదేశ్

P.C: You Tube

భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో కాశీ ఒకటి. దీనిని వారనాసి, అని కూడా పిలుస్తారు. ఇక్కడ పరమేశ్వరుడు విశ్వనాథుడి పేరుతో పూజలు అందుకొంటూ ఉన్నాడు. ఇక్కడి గంగానదిలో స్నానం చేస్తే అప్పటి వరకూ చేసిన పాపాలన్నీ పోతాయని హిందూ భక్తులు నమ్ముతారు.

త్రయంబకేశ్వరాలయం, నాసిక్

త్రయంబకేశ్వరాలయం, నాసిక్

P.C: You Tube

మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ పుణ్యక్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. పవిత్ర నదిగా పేర్కొనబడే గోదావరి జన్మస్థానం త్రయంబకేశ్వరాలయం దగ్గరే అని చెబుతారు.

వైద్యనాథ్, జార్ఘండ్

వైద్యనాథ్, జార్ఘండ్

P.C: You Tube

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన వైద్యనాథ్ దేవాలయం జార్ఘండ్ లో ఉంది. ఇక్కడే రావణుడు తన పది తలలను ఆ పరమశివుడి దర్శనం కోసం తెగనరుక్కొన్నాడని చెబుతాడు. అటు పై రావణుడి భక్తికి మెచ్చి పరమశివుడు వైద్యుడి రూపంలో వచ్చి ఆయనకు చికిత్స చేశాడని చెబుతారు. శ్రావణ మాసంలో లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.

నాగేశ్వర్, గుజరాత్

నాగేశ్వర్, గుజరాత్

P.C: You Tube

గుజరాత్ లోని నాగేశ్వర్ జ్యోతిర్లింగం స్వయంభువుగా చెబుతారు. ఈ దేవాలయం గోమతి ద్వారక, బెట్ ద్వారక మధ్యన వస్తుంది. శ్రావణ మాసంలో ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విషప్రభావం వల్ల మరణ భయం ఉండదని భక్తులు నమ్ముతారు. అందువల్లే వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

రామనాథ స్వామి దేవాలయం, తమిళనాడు

రామనాథ స్వామి దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

దక్షిణ భారత దేశంలోని అత్యంత ప్రాచూర్యం చెందిన శైవదేవాలయాల్లో రామేశ్వరంలోని రామనాథ స్వామి దేవాలయం ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచంలో పొడవైన కారిడార్ ఉన్న దేవాలయం ఇదే. ఛార్ దామ్ పుణ్యక్షేత్రాల్లో రామేశ్వరంలోని రామనాథ స్వామి దేవాలయం కూడా ఒకటి.

ఘృష్టీశ్వర లింగం, ఘృష్టీశ్వరం

ఘృష్టీశ్వర లింగం, ఘృష్టీశ్వరం

P.C: You Tube

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరిదని శైవపురాణాల్లో చెబుతారు. ప్రపంచ పర్యాటకంలో అత్యంత ఆదరణ పొందిన ఎల్లోర గుహలు ఈ క్షేత్రానికి అత్యంత సమీపంలోనే ఉన్నాయి. ఇక్కడి ఘృశ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకొంటేకాని జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదని చెబుతారు.

లింగరాజ దేవాలయం

లింగరాజ దేవాలయం

P.C: You Tube

ఒడిషాలోని లింగరాజ దేవాలయాన్ని ఇసుక రాతితో నిర్మించారు. సోమవంశం ఈ దేవాలయాన్ని మొదటిసారిగా నిర్మించగా అటు పై గాంగై వంశీయులు ఈ దేవాలయాన్ని పున: నిర్మించారు. భువనేశ్వర్ లో ఉన్న ఈ ప్రాచీన దేవాలయాన్ని సందర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి నిత్యం వేల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక శ్రావణ మాస సోమవారం రోజులన ఈ దేవాలయాన్ని లక్షల సంఖ్యలో సందర్శించుకొంటారు.

కోటిలింగాల క్షేత్రం

కోటిలింగాల క్షేత్రం

P.C: You Tube

కర్నాటకలోని కోలారు జిల్లా కమ్మసంద్ర దగ్గరగా ఉన్న ఈ క్షేత్రంలో కోటి లింగాలు ఉంటాయి. ఈశ్వరుడి భక్తుడైన మంజునాథుడు ఈ లింగాలను ఇక్కడ ఏర్పాటు చేశాడని చెబుతాడు. 33 మీటర్ల ఎతైన ప్రధాన శివలింగం ఎదురుగా 11 మీటర్ల ఎతైన శివలింగం చూడటానికి ఎంతో ఆకర్షనీయంగా ఉంటుంది.

అన్నామలై, తమిళనాడు

అన్నామలై, తమిళనాడు

P.C: You Tube

తమిళనాడులోని అననామలై క్షేత్రంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి దేవాలయాన్ని మొదట కట్టించినది చోళులు. ఇది పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా చెబుతారు.

మురుడేశ్వర దేవాలయం, కర్నాటక

మురుడేశ్వర దేవాలయం, కర్నాటక

P.C: You Tube

అరేబియా సముద్ర తీరంలో వెలిసిన మురుడేశ్వర్ ను చూడటానికి రెండు కళ్లు చాలవు. రామాణంతో ముడిపడిన ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడి పెద్ద విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ పరమశివుడి విగ్రహం ఎత్తు 37 మీటర్లు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X