Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ స్వామివారిని సందర్శిస్తే వెంటనే సంతానభాగ్యం

ఇక్కడ స్వామివారిని సందర్శిస్తే వెంటనే సంతానభాగ్యం

చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేదనారాయణ స్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

భారత దేశంలోని కొన్ని ఆలయాలు అటు పురాణ పరంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎన్నో విషయాలను తమలో దాచుకొన్నాయి. ఈ కోవకు చెందినదే చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేదనారాయణస్వామి దేవాలయం. బ్రహ్మదేవుడి నుంచి దొంగలించబడ్డ వేదాలకు ఆ శ్రీమన్నారాయణుడు తిరిగి రక్షించిన ప్రాంతం ఇదేనని పురాణాలు చెబుతాయి. అదేవిధంగా ఈ ఆలయంలోని శాసనాలు శ్రీకృష్ణ దేవరాయల దక్షిణ దేశ యాత్రల గురించి తెలయజేస్తుంది.

మరోవైపు ఇక్కడ శ్రీమన్నారయణుడు మత్య్సరూపంలో వేదవళ్లి సహితంగా వెలిసినందువల్ల స్వామివారిని సందర్శిస్తే సంతానభాగ్యం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. ఈ పుణ్యక్షేత్రంలో మార్చిలో జరిగే సూర్యోత్సవం, ఏప్రిల్ లో జరిగే తెప్పోత్సవాలు తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచాయి. ప్రస్తుతం తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధీనలోని ఈ దేవాలయానికి చిత్తూరుతో పాటు తిరుపతి నుంచి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.

సోమకాసురడనే రాక్షసుడు

సోమకాసురడనే రాక్షసుడు

P.C: You Tube

బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను సోమకాసురడనే రాక్షసుడు అపహరించి సముద్ర గర్భంలో దాస్తాడు. దీంతో స`ష్టికార్యానికి అంతరాయం ఏర్పడి ముల్లోకాలు అల్లకల్లోలమవుతాయి. దేవతలు, బుుషి పుంగవులు అంతా కలిసి మహావిష్ణువును వేడుకొని ఈ గండం నుంచి కాపాడమని ప్రార్థిస్తారు.

మత్స్యావతరం దాల్చి

మత్స్యావతరం దాల్చి

P.C: You Tube

దీంతో ఆ మహావిష్ణువు మత్య్సావతరం దాల్చి సముద్ర గర్భంలోకి వెళ్లి సోమకాసురడను వధించి నాలుగు వేదాలను భూమి పైకి తీసుకువస్తాడు. ఇలా నారాయణుడు భూమిపైకి వేదాలయను తీసుకువచ్చిన ప్రాంతం కాబట్టే దీనిని వేదపురి అని వేదారాణ్యక్షేత్రం అని పిలిచేవారు.

నాగలాపురం

నాగలాపురం

P.C: You Tube

ఈ క్షేత్రాన్ని హరికంఘాపురమని కూడా వ్యవహరించేవారని మన పురాణాల్లో ఉంది. అలా మహావిష్ణువు సముద్రం నుంచి భూమి పై భాగానికి వచ్చిన ప్రాంతం చిత్తూరు జిల్లా నాగరాలపురం. ఇక్కడ మహావిష్ణువు మత్య్స రూపంలో కొలువై ఉంటాడు.

శంఖు, చక్రాలను

శంఖు, చక్రాలను

P.C: You Tube

మూల విరాట్టు నడుము నుండి పాదం వరకూ మత్స్య రూపంలో ఉండగా పై భాగం మాత్రం విష్ణువు రూపంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు శంఖు చక్రాలను ధరించి ఉంటారు. గర్భాలయం చుట్టూ అనేక ఉపాలయాలు ఉన్నాయి.

ఉత్తర ద్వారంలోని శాసనాలు

ఉత్తర ద్వారంలోని శాసనాలు

P.C: You Tube

ఈ ప్రాంతం పురాణ పరంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎంతో పేరుగాంచింది. ఈ ఆలయంలో ఉత్తర ద్వారంలో ఉన్న శాసనం ద్వారా ఈ ఆలయానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగుచూశాయి.

 శ్రీకృష్ణ దేవరాయలు

శ్రీకృష్ణ దేవరాయలు

P.C: You Tube

మొదట ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించారు. అప్పట్లో ఈ ఆలయాన్ని శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్ గా అభివర్ణించేవారు. అంతేకాకుండా ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉండేది. అటు పై దక్షిణ దేశ పర్యటనలో భాగంగా శ్రీకృష్ణ దేవరాయలు ఈ ప్రాంతాన్ని సందర్శించారు.

పంచ ప్రాకారాలతో, సప్త ద్వారాలతో

పంచ ప్రాకారాలతో, సప్త ద్వారాలతో

P.C: You Tube

అప్పటికే కొంత శిథిలావస్తలో ఉన్న ఆయాలన్ని అభివ`ద్ధి చేయడానికి అనేక వందల ఎకరాల భూములను దానంగా ఇచ్చాడు. అటు పై ఆలయాన్ని పంచ ప్రాకారాలతో, సప్త ద్వారాలతో అత్యంత కళాత్మకంగా అభివ`ద్ధి చేశారు.

తన తల్లి పేరు పై ఈ ప్రాంతానికి నాగలాపురంమని నామకరణం

తన తల్లి పేరు పై ఈ ప్రాంతానికి నాగలాపురంమని నామకరణం

P.C: You Tube

అటు పై శ్రీకృష్ణ దేవరాయలు తన తల్లి పేరు పై ఈ ప్రాంతానికి నాగలాపురంమని నామకరణం చేసినట్లు శాసనాలద్వారా తెలుస్తుంది. ప్రతి సంవత్సరం మార్చిలో 25,26,27 లేదా 26,27, 28 తేదీల్లో సాయకాలం మూలవిరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుంచి సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి.

ఇందుకు గల కారాణాలను

ఇందుకు గల కారాణాలను

P.C: You Tube

రెండోరోజు ఆ కిరణాలు స్వామివారి నాభి భాగాన్ని, మూడో రోజు స్వామివారి ముఖాన్ని తాకడం ఈ ఆలయం విశిష్టత. ఇందుకు గల కారాణాలను ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. ఇక ఆ మూడురోజులు స్వామివారికి సూర్య పూజోత్సవం పేరుతో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుపుతారు.

బ్రహోత్సవాలు

బ్రహోత్సవాలు

P.C: You Tube

ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. అదే విధంగా ప్రతి ఏడాది ఏప్రిల్ లో వచ్చే పౌర్ణమి నుంచి పది రోజుల పాటు ఇక్కడ బ్రహోత్సవాలు చాలా బాగుగా జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X