Search
  • Follow NativePlanet
Share
» »వరాహ వినాయకుడి దర్శనంతో మీ జీవితంలో...

వరాహ వినాయకుడి దర్శనంతో మీ జీవితంలో...

కుంభకోణంలోని కరుంబైరం పిళ్లయార్ దేవాలయం గురించి కథనం.

ప్రళయం తర్వాత జీవ బీజాలు ఉన్న కుంభం భూమిని మొదట తాకిన ప్రదేశం కుంభకోణం. తళనాడులోని కుంభకోణం ఆలయాల నిలయం. ఒకొక్క ఆలయానికి ఒక్కొక్క కథనం ఉంటుంది. ఈ కథనాలన్నీ మన పురాణాల్లో ఎక్కడో ఒకచోట కనిపిస్తాయి. అటు వంటి ఆలయమే కురుంబైరం పిళ్లయార్.

ఈ వినాయకుడిని మొదట వరాహ వినాయకుడని పిలిచేవారు. హిరణ్యాక్షుడిని సంహరించి భూ దేవిని రక్షించిన వరాహ స్వామి ఈ వినాయకుడిని ప్రతిష్టించి పూజించడం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతారు.

ఈ వినాయకుడిని పూజించడం వల్ల మన జీవితంలో కష్టాలు ఉండవని ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని స్థానిక భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో వరాహ వినాయకుడు కురుంబైరం పిళ్లయార్ గా ఎందుకు మారాడన్న విషయానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం మీ కోసం...

హిరణ్యాక్షుడు

హిరణ్యాక్షుడు

P.C: You Tube

హిరణ్యాక్షుడు భూదేవిని పాతాళ లోకంలో దాచడం తెలిసిన విషయమే. ఆ భూదేవిని రక్షించడానికి ఈ మహావిష్ణువు వరాహ రూపం దాల్చి అక్కడివెళ్లి హిరణ్యాక్షుడతో జరిగిన భీకర యుద్ధంలో శ్రీమన్నారయణుడు గెలిచి భూదేవిని రక్షించాడని మన పురాణాలు చెబుతాయి.

వరాహస్వామి

వరాహస్వామి

P.C: You Tube

అయితే ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఆ మహావిష్ణువు విఘ్నవినాయకుడిని ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని చెబుతారు. అందువల్లే ఈ వినాయకుడికి వరాహ వినాయకుడనే పేరు వచ్చినట్లు స్థలపురాణ కథనం.

పురాణ కథనం ప్రకారం

పురాణ కథనం ప్రకారం

P.C: You Tube

ఇదిలా ఉండగా ఈ వినాయకుడికి అటు పై కుబైరమ్ పిళ్లయార్ అనే పేరు స్థిరపడిపోయింది. తమిళంలో కరుంబు అంటే చెరుకు పిళ్లయార్ అంటే వినాయకుడు. ఇక ఈయనకు ఈ పేరు రావడానికి గల కారణానికి సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది.

చెరుకు పండించేవారు

చెరుకు పండించేవారు

P.C: You Tube

పూర్వం ఈ ప్రాంతంలో ఎక్కువగా చెరుకు పండించేవారు. అటు పై ఆ చెరుకు నుంచి రసం తీసి బెల్లాన్ని కూడా తయారు చేసేవారు. ఈ క్రమంలో ఒక రైతు ఒకసారి తాను పండించిన చెరుకు పంటను తీసుకునిఈ దేవాలయం ముందు నుంచి వెలుతున్నాడు.

రాత్రి సమయం

రాత్రి సమయం

P.C: You Tube

ఇంతలో పొద్దు మునిగింది. దీంతో తన బండిని దేవాలయం ముందు ఆపి రాత్రికి అక్కడ విశ్రాంతి తోసుకోవాలనుకొన్నాడు. తన వెంట వచ్చిన పరివారానికి కూడా ఈ విషయం చెప్పి అందరికీ రాత్రి బస దేవాలయంలోనే ఏర్పాటు చేసుకున్నారు.

 వినాయకుడు చిన్న బాలుడి రూపంలో

వినాయకుడు చిన్న బాలుడి రూపంలో

P.C: You Tube

సరిగ్గా తెల్లవారుజామున ఓ వినాయకుడు చిన్న బాలుడి వేశంలో అక్కడికి వచ్చి తనకు ఓ చెరుకు ముక్క ఇవ్వాల్సిందిగా రైతును అడిగాడు. అయితే రైతు తాను ఇవ్వనని కోసంతో చెప్పడమే కాకుండా అక్కడి నుంచి వెళ్లిపొమ్మని గదమాయించాడు.

చెరుకు పిప్పి

చెరుకు పిప్పి

P.C: You Tube

పొద్దున లేచి చూసే సమయానికి ఆ చెరుకు మొత్తం పిప్పిగా మారిపోయింది. దీంతో రైతు తెల్లవారుజామున వచ్చిన వాడు సామాన్యుడైన బాలుడు కాదని సాక్షాత్తు వినాయకుడే ఆ రూపంలో వచ్చాడని తెలుసుకొంటాడు.

చెరుకు రైతు

చెరుకు రైతు

P.C: You Tube

దీంతో తన తప్పును మన్నించమని వేడుకొంటాడు. వెంటనే చెరుకు మాములు రూపానికి వస్తుంది. అటు పై రైతు ప్రతి ఏడాది తాను పండించిన పంటలో కొంత భాగాన్ని ఈ దేవాలయంలోని వినాయకుడికి కానుకగా ఇచ్చేవాడు.

 అందువల్లే ఆ పేరు

అందువల్లే ఆ పేరు

P.C: You Tube

ఆ సంప్రదాయం ఇప్పటికీ అలాగే కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాంత రైతులు తమ పొలాల్లో కోతలు ముగిసిన తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చి వినాయకుడికి అందులో కొంతభాగాన్ని ఇచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అందువల్లే ఈ వినాయకుడిని కుబైరమ్ పిళ్లయార్ అనే పేరు వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X