Search
  • Follow NativePlanet
Share
» »శేషతల్పం పై శివుడు, ఏడాదికి ఒక్కరోజే దైవ దర్శనం దీంతో మీ జీవితంలో

శేషతల్పం పై శివుడు, ఏడాదికి ఒక్కరోజే దైవ దర్శనం దీంతో మీ జీవితంలో

ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర ఆలయానికి సంబంధించిన కథనం.

భారత దేశంలో పాములను దేవతలగా భావించి పూజించే గుణం అనాదికాలంగా వస్తోంది. ఈ పాములకు కొన్ని ప్రత్యేక దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు ఆ దేవాంశ సంభూతులుగా భావించే ఆ ఆలయాల్లోని నాగ దేవతలను పూజించడానికి భక్తులకు అవకాశం ఉంటుంది. అయితే పురాణ ప్రాధాన్యత కలిగిన పట్టణంలోని ఓ దేవాలయం ఇందుకు పూర్తిగా విభిన్నం.

కేవలం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ దేవాలయాన్ని తెరుస్తారు. ఇక ఇక్కడ ఉన్నటు వంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా ఉండదు. ఈ దైవ దర్శనం వల్ల మన జీవితంలో అప్పటి వరకూ ఎదుర్కొన్న సర్పదోశ నివారణతో పాటు భవిష్యత్తులో కలిగే సర్ప సంబంధ దోషాలన్నీ సమిసిపోతాయని భక్తులు నమ్మకం.

అందువల్లే ఆ ఒక్క రోజే ఆ దేవాలయాన్ని దాదాపు మూడు లక్షల మంది సందర్శిస్తూ ఉంటారు. ఇందులో విదేశీ భక్తులు కూడా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఆ దేవాలయంతో పాటు ఆ పురాణ ప్రాధాన్యత కలిగిన పట్ణణంలోని మరికొన్ని దేవాలయల గురించిన వివరాలు మీ కోసం...

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి

P.C: You Tube

భారత దేశంలో శివుడు ద్వాదశ జ్యతిర్లింగాల రూపంలో కొలువై ఉన్నాడని హిందువుల నమ్మకం. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటే ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగం. ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్న శివలింగాలకకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

లక్షల ఏళ్ల నుంచి పూజలు

లక్షల ఏళ్ల నుంచి పూజలు

P.C: You Tube

ఇక్కడి జ్యోతిర్లింగాన్ని మహాకాళేశ్వర లింగం అని అంటారు. కొన్ని లక్షల ఏళ్ల నుంచి పూజల అందుకొంటున్న ఈ లింగం స్వయంభువు అని భక్తుల కథనం. ఇక్కడి దేవాలయాన్ని ఎవరు నిర్మించారన్న దానికి సరైన ఆధారాలు లేవు.

దక్షిణా మూర్తి అని కూడా

దక్షిణా మూర్తి అని కూడా

P.C: You Tube

ఇక్కడి మహాకాళేశ్వరుడిని దక్షిణా మూర్తి అని కూడా పిలుస్తారు. ఈ శివలింగం యోక్క ముఖం దక్షిణ దిశలో ఉండటమే ఇందుకు కారణం. దక్షిణ దిశలో శివలింగం ఉండటం చాలా అరుదైన విషయం. అందుకే జ్యోతిర్లింగాల్లో ఈ శివలింగానికి విశిష్ట శక్తులు ఉన్నాయని నమ్ముతారు.

రెండు దేవాలయాలు

రెండు దేవాలయాలు

P.C: You Tube

ఈ గర్భగుడిలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర దిశల్లోని గోడల పై పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు ఉంటాయి. దక్షిణ దిశలో మాత్రం నంది ఉంటాడు. మహాకాళేశ్వర లింగంతో ఈ దేవాలయంలో మరో రెండు దేవాలయాలను ఉన్నాయి.

మూడో అంతస్తులో నాగ చంద్రేశ్వరుడు

మూడో అంతస్తులో నాగ చంద్రేశ్వరుడు

P.C: You Tube

మహాకాళేశ్వర లింగం పై భాగంలో అంటే మొదటి అంతస్తులో ఓంకార లింగేశ్వరుడు లింగం రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఈ దేవాలయం పై భాగంలో అంటే మూడో అంతస్తులో నాగ చంద్రేశ్వరుడు మనకు కనిపిస్తాడు.

మూడు లక్షల మంది

మూడు లక్షల మంది

P.C: You Tube

ఈ దేవాలయం ఏడాదిలో ఒక్క రోజుమాత్రమే తెరుస్తారు. శ్రావణ శుక్ల పంచమి రోజున ఆలయ ద్వారాలు తీసి దైవదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. దీంతో దైవ దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. ఆ ఒక్కరోజే సుమారు 3 లక్షల మంది దైవదర్శనం చేసుకొంటారు.

ప్రపంచంలో మరెక్కడా కనిపించదు

ప్రపంచంలో మరెక్కడా కనిపించదు

P.C: You Tube

శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే సర్పరాజైన తక్షకుడు ఈ ఆలయంలో ఉంటాడని పురాణ కథనం. అందువల్లే ఆ రోజుకు అంత ప్రాధాన్యత. ఇక ఈ దేవాలయంలో ఉన్న ప్రతిమ ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.

శివపార్వతులు

శివపార్వతులు

P.C: You Tube

సాధారణంగా శేష తల్పం పై విష్ణువు శయనిస్తాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ చంద్ర నాగేశ్వరాలయంలో మాత్రం పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకొని కుర్చొన్న శివపార్వతులను మనం చూడవచ్చు.

వినాయకుడిని కూడా

వినాయకుడిని కూడా

P.C: You Tube

ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వారి కుమారుడైన వినాయకుడిని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ శ్రావణ శుక్ల పంచమి రోజునే దేవాలయం ద్వారం తెరవడానికి గల కారణానికి సంబంధించి ఒక పురాణ కథనం ప్రచారంలో ఉంది.

సర్పరాజు

సర్పరాజు

P.C: You Tube

సర్పరాజైన తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. దీంతో కరిగిపోయిన పరమేశ్వరుడు తక్షకుడికి కోరిక కోరుకోమంటాడు. దీంతో నా పై సాదా కొలువై ఉండిపోవాలని తక్షకుడు కోరుతాడు.

ఆ ఒక్కరోజున

ఆ ఒక్కరోజున

P.C: You Tube

అయితే పరమేశ్వరడు తనకు అప్పటికే నంది వాహనంగా ఉందని చెబుతాడు. అయితే నాగపంచమి రోజున అంటే శ్రవణ శుక్ల పంచమి రోజు నీ పై కొర్చోవడమే కాకుండ శయనిస్తానని చెబుతాడు. అందువల్లే ఈ దేవాలయంలో పరమేశ్వరుడు తక్షకుడి పై కూర్చొన్న స్థితిలో కనిపిస్తాడు.

శతాబ్దాల చరిత్ర

శతాబ్దాల చరిత్ర

P.C: You Tube

నాగడచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1050లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించినట్లు అక్కడ దొరికిన శాసనాల వల్ల తెలుస్తోంది. అటు పై సింధియా వంశానికి చెందిన రాణోజీ మహరాజ్ క్రీస్తు శకం1732లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు.

సర్పదోషాలన్నీ

సర్పదోషాలన్నీ

P.C: You Tube

ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శించుకొంటే చాలు సర్పదోషాలన్నీ తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా జీవితంలో అప్పటి వరకూ ఉన్న సర్ప దోషాలే కాకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటి సర్వ దోషాలు తలెత్తవని భక్తులు భావిస్తుంటారు.

ఉజ్జయినీలో అనేక సందర్శనీయ స్థలాలు ఉన్నాయి.

ఉజ్జయినీలో అనేక సందర్శనీయ స్థలాలు ఉన్నాయి.

P.C: You Tube

ఉజ్జయినీ పురాణ ప్రాధాన్యత కలిగిన నగరం. భారత దేశంలోని ఏడు మోక్ష నగరాల్లో ఉజ్జయినీ కూడా ఒకటి. అందువల్లే ఇక్కడ అనేక పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అందులో కాళభైరవ దేవాలయం, హరిసిద్ధి దేవాలయం, మంగళ్ దేవాలయం వంటివి ముఖ్యమైనవి.

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

P.C: You Tube

ఉజ్జయినికి దగ్గరగా దేవీ అహల్యాభాయ్ హోల్కర్ ఎయిర్ పోర్టు ఉంది. దేశంలోని వివిధ నగరాల నుంచి ఇక్కడికి విమాన సర్వీసులు ఉన్నాయి. ఈ ఎయిర్ పోర్టు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయిని చేరుకోవడానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

రైలు, బస్సు మార్గాలు

రైలు, బస్సు మార్గాలు

P.C: You Tube

ఉజ్జయినిలో ప్రధాన రైల్వే స్టేషన్ ఉంది. దేశంలోని వివిధ చోట్ల నుంచి ఇక్కడకు రైలు సదుపాయం ఉంది. అదేవిధంగా గ్వాలియర్, భోపాల్ నుంచి కూడా ఉజ్జయినికి నేరుగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X