Search
  • Follow NativePlanet
Share
» »ఈ జలపాతాల ‘అందాలు’ వర్షాకాలంలో తప్ప మరెప్పుడూ చూడలేరు

ఈ జలపాతాల ‘అందాలు’ వర్షాకాలంలో తప్ప మరెప్పుడూ చూడలేరు

కర్నాటకలోని జలపాతాలకు సంబంధించిన కథనం.

By Gayatri Devupalli

భారతదేశం పర్వతాలు, సరస్సులు, లోయలు, నదులు మరియు జలపాతాల వంటి అందమైన ప్రకృతి సహజ వనరులకు నెలవు. భారతదేశంలో సుమారుగా 200 కంటే అధికంగా చిన్న మరియు పెద్దజలపాతాలు ఉన్నాయి. అనేక హిల్ స్టేషన్లలకు ఈ జలపాతాలే ప్రధాన ఆకర్షణ. మన సెలవు దినాలను గడపడానికి, ఈ జలపాతాలు ఉత్తమ గమ్యాలు.

కొన్ని జలపాతాలు, మిగిలిన వాటితో పోలిస్తే ఎంతోఅద్భుతంగా ఉంటాయి. అత్తిరపల్లి జలపాతం, ధూద్ సాగర్ జలపాతం, జోగ్ జలపాతం వంటి ప్రధాన జలపాతాలు,నయాగరా జలపాతం, ఏంజెల్ ఫాల్స్ లేదా విక్టోరియా జలపాతాలకు ఏ మాత్రం తీసిపోవు. కొన్నిజలపాతాలు మీడియా మరియు సినిమాల మూలంగా గుర్తింపు పొందినా, కొన్ని అద్భుతమైన జలపాతాలు ఇంకా ప్రాచుర్యంలోకి రాకుండా మరుగున ఉండిపోయాయి.

ఈ జలపాతాలలో అధిక భాగం పశ్చిమకనుమలలోని దట్టమైన, పచ్చని అడవులలో నెలకొని ఉన్నాయి. జూలై-సెప్టెంబరు మధ్యకాలంలో, వర్షాకాల సమయం అవటం మూలాన నదులన్నీ నీటితో నిండి ఉంటాయి మరియు జలపాతాలు హోరుతోఉరకలు వేస్తుంటాయి.

సతోడి జలపాతం:

సతోడి జలపాతం:

P.C: You Tube

దట్టమైన అడవుల మధ్య, నెలకొన్న ఈ ప్రకృతి సుందర దృశ్యాన్ని, 'కర్ణాటక నయాగర' గా పిలుస్తారు. వర్షాకాలం పూర్తి అయిన తర్వాత సతోడి జలపాతాన్ని సందర్శించడం ఉత్తమం, ఎందుకంటే వర్షాకాల
సమయంలో, అడవులకు దారితీసే రహదారులు చాలా ప్రమాదకరంగా మారతాయి. ఈ జలపాతం, స్నానం చేయడానికి అనువుగా ఉండే సరస్సును కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎటువంటి రెస్టారెంట్లు లేదా
దుకాణాలు ఉండవు కనుక మీతో పాటుగా తినుబండారాలను తప్పక తీసుకుని వెళ్ళాలి.

మాగోడ్ జలపాతం

మాగోడ్ జలపాతం

P.C: You Tube

సతోడి జలపాతాలతో పాటుగా, యల్లాపుర పట్టణానికి సమీపంలో ఉన్న మాగోడ్ జలపాతాలను కూడా చూడవచ్చు. ఉధృతంగా ప్రవహించే బెడ్తీ నది, రెండు శాఖలుగా చీలి, రెండంచలుగా కొండల పైనుండి దుముకుతుంది. మాగోడ్ జలపాతాల సమీపంలో, ప్రకృతి రమణీయతకు పర్యాయపదాలుగా తోచే, జెనుకల్లు గుడ్డ మరియు కవడి కేరేలను కూడా సందర్శించవచ్చు.

జోగ్ జలపాతాలు:

జోగ్ జలపాతాలు:

P.C: You Tube

భారతదేశంలో, జొగ్ జలపాతం అత్యంత ఎత్తైన జలపాతం. ఈ జలపాతాలను సందర్శించటానికి జూలై-సెప్టెంబర్ మధ్యాకాలంలో, వర్షాలు ముమ్మరంగా పడే సమయం అనువైనది.

శరావతి నది నాలుగు శాఖలుగా చీలి, రాజా, రాణి, రాకెట్ మరియు రోరర్ అనే నాలుగు జలపాతాలుగా ఏర్పడతాయి. మీరు ఈ జలపాతాల పైనుండి కొండ యొక్క పీఠ భాగం వరకు దూకవచ్చు. పడిపోయే పాదాలకు ఎక్కవచ్చు. జోగ్ జలపాతం నుండి 6 కిమీ దూరంలో ఉన్న లింగనమక్కి డ్యాం ఉంది. దీనిని విద్యుదుత్పత్తికి ఉపయోగిస్తున్నారు.

హన్బల్ జలపాతం

హన్బల్ జలపాతం

P.C: You Tube

మీరు హసన్ చుట్టు పక్కల ఉన్నట్లైతే, సకలేష్ పూర్సమీపంలో ఉన్న హన్బల్ జలపాతాన్ని తప్పక చూసి తీరాల్సిందే! వర్షాకాలంలోనే ఈ జలపాతాన్ని సందర్శించాలి. ఎందుకంటే వర్షాకాలం ముగిసినంతనే నీరు కిందకి వెళ్ళిపోయి, జలపాతం ఖాళీ అయిపోతుంది. ఇది ఒక గొప్ప ఎత్తు నుండి ప్రవహించనప్పటికీ, జలపాతం చుట్టూ ఉండే ప్రాంతం చాలా జారుగా ఉంటుంది కనుక, నడిచేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ జలపాతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెట్టాడ భైరవేశ్వర ఆలయం కూడా సందర్శించదగినది.

ధూద్ సాగర్ జలపాతం

ధూద్ సాగర్ జలపాతం

P.C: You Tube

మీరు మాలాగే, ఒక అందమైన జలపాతంను దాటుకుంటూ ప్రయాణిస్తున్న ఒక రైలు యొక్క ఫోటోను చూసి, ఇది ఎక్కడ ఉందబ్బా? అని ఆలోచిస్తున్నారా! అయితే ఇది ఖచ్చితంగా, గోవా-కర్ణాటక సరిహద్దులో ఉన్న ధూద్ సాగర్ జలపాతమే! ఈ జలపాతాల వద్ద పనిచేసే సిబ్బంది, పర్యాటకులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. ఇక్కడి సరస్సులో మునకలు వేయడానికి, ఈత చొక్కా ధరించడం తప్పనిసరి. టికెట్ కౌంటర్ వద్ద పర్యాటకులు బారులు తీరి ఉంటారు కనుక, ఇక్కడకు కొంచెం ముందుగా చేరుకోండి.

గోకక్ జలపాతం

గోకక్ జలపాతం

P.C: You Tube

ఈ జలపాతం బెళగావి జిల్లాలోని ఘటప్రభ నదిపై ఉంది. గుర్రపు నాడా ఆకారంలో ఉండే గోపాక్ జలపాతం వద్ద, ఎపార్చియన్ అస్థిరత దర్శనమిస్తుంది కనుక భౌగోళిక శాస్త్రవేత్తల ఇది ఉత్సుకత రేకెత్తించే
ప్రదేశం.
జలపాతానికి సమీపంలో చాళుక్యుల నిర్మాణ శైలిలో నిర్మితమైన స్మారక చిహ్నాలు ఉన్నాయి. జలపాతము వద్ద నిర్మితమైన వేలాడే వంతెనపై నుండి చూస్తే, నది మరియు జలపాతాల అద్భుతమైన వీక్షణ లభిస్తుంది. అంతేకాదు, ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన, రుచికరమైన గోకక్ కర్దంట్ అనే మిఠాయిని తప్పక రుచి చూడండి.

కల్హట్టి జలపాతం

కల్హట్టి జలపాతం

P.C: You Tube

ఈ జలపాతం చికమగళూరులోని కెమ్మంగుండి హిల్ స్టేషన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం వెలుపల వీరభద్రేశ్వర ఆలయం ఉన్నందున, ఇక్కడ రద్దీగా అధికం. దీని పర్యవసానంగా ఈ జలపాతం, సబ్బు నురుగు, తినుబండారాలు, విడిచిన వస్త్రాలు, మొదలైన వాటిని కలుషితమై ఉంటుంది. రుతుపవన కాలంలో, స్పష్టమైన నీటిని ఆస్వాదించవచ్చు. ప్రసిద్ధ ముల్లయగిరిరి శిఖరం, ఇక్కడ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అప్సరకోండ జలపాతం

అప్సరకోండ జలపాతం

P.C: You Tube

ఉత్తర కర్ణాటకలోని హొన్నవార్ గుండా మీరు ప్రయాణిస్తుంటే అప్సరకోండ జలపాతంను తప్పక చూడాలి. ఈ జలపాతాన్ని దేవదూతలు జలకాలాటలకు వినియోగించారు, కనుక దీనికి అప్సరకోండ అని పేరు వచ్చింది. జలపాతానికి కొద్ది దూరంలో ఒక బీచ్ ఉంది.

జలపాతాల నుండి కొంచెం దూరంలో ఉన్న అప్సరకోండ గుట్టల పైనుండి అరేబియా సముద్రం తీర దృశ్యం, చూపరులను కళ్ళు తిప్పుకొనివ్వదు.పాండవ గుహలు అని పిలువబడే భారీ గుహలు, జలపాతానికి సమీపంలో ఉన్నాయి. పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఈ గుహలలో కొద్దికాలం గడిపారని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు.

అరిషినగుండి జలపాతం

అరిషినగుండి జలపాతం

P.C: You Tube

కొల్లూర్ సమీపంలో పశ్చిమ కనుమలలోని అద్భుతమైన జలపాతాలలో, అరుషినగుండి జలపాతం ఒకటి. ఈ జలపాతాలకు చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేయాలి. ప్రఖ్యాత కొల్లూరు మూకాంబిక ఆలయం వద్ద నుండి ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది. 4.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన తర్వాత మీ కష్టానికి తగిన ఫలం అందమైన జలపాతాల రూపంలో అందుకోవచ్చు. మీరు మరింత పైకి కొనసాగితే, కోడాచాద్రి శిఖరానికి చేరుకుంటారు. అరిషినగుండి అంటే కన్నడలో "పసుపు సరస్సు" అని అర్ధం. ఇక్కడి సరస్సులోని నీరు శరీరాన్ని పునరుత్తేజితం చేస్తుందని స్థానికులు నమ్ముతారు.

బందజే అర్బి జలపాతం

బందజే అర్బి జలపాతం

P.C: You Tube

బందజే అర్బి జలపాతం, దక్షిణా కన్నడ జిల్లాలోని చార్ముడి ఘాట్ లో ఉంది. దీనిని సందర్శించదలచుకునేవారు గైడ్ సేవలను వినియోగించుకోవాలని సూచించబడింది. ఇది ఒక దట్టమైన అడవి అయినందున సులభంగా దారితప్పే అవకాశం ఉంది. మీరు పిల్లలు లేదా వృద్ధులతో కలసి ప్రయాణిస్తున్నట్లైతే, ట్రెక్ చాలా కష్టతరమవుతుంది. బల్లలారాయణ దుర్గ కోట ఇక్కడికి దాదాపు 2 గంటల ట్రెక్ దూరంలో ఉంది.

హిడ్లుమనే జలపాతం

హిడ్లుమనే జలపాతం

P.C: You Tube

కొడచాద్రి కొండల పీఠ భాగం వద్ద జాలువారే హిడ్లుమనే జలపాతాల శ్రేణి షిమోగా జిల్లాలో ఉంది. ఎత్తైన కొండలు మరియు దట్టమైన అటవీ ప్రాంతాలను దాటుకుంటూ, హిడ్లుమనే జలపాతాలకు ట్రెక్కింగ్ చేయాలనుకోవడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. హిడ్లుమనే జలపాతానికి దగ్గరలో ఉండే కొడచాద్రి శిఖరం, పచ్చని చెట్లతో ప్రకృతి అందాలకు పుట్టినిల్లులా ఉంటుంది. మూకాంబిక నేషనల్ పార్క్ మరియు మూకాంబిక ఆలయం ఇక్కడ దర్శించదగిన ఇతర ఆకర్షణలు.

బర్కానా జలపాతం

బర్కానా జలపాతం

P.C: You Tube

పశ్చిమ కనుమల మధ్యలో ఉన్న బార్కానా ఫాల్స్, అగుంబే నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడి కొండలు నిటారుగా ఉన్నందున, ఈ జలపాతం చేరడానికి చేసే ట్రెక్కింగ్ చాలా ప్రమాదకరమైనది. అయితే, అష్టకష్టాలు పడి, ట్రెక్కింగ్ చేసి పైకి చేరాక, వ్యూ పాయింట్ వద్ద నుండి కనపడే లోయ మరియు జలపాతం యొక్క అద్భుతమైన దృశ్యం చూడగానే అలసటంతా చిటికెలో మటుమాయం అయిపోతుంది. ఈ అడవిలో ఏడు సంవత్సరాలకు ఒకసారి విచ్చుకునే, 'గురుజీ' అనే పూలు ఉంటాయి. పశ్చిమ కనుమల యొక్క మంత్రముగ్ధమైన అందాలను ఆస్వాదించడానికి బార్కన వ్యూ పాయింట్ సరైన ప్రదేశం.

కుద్లు తీర్థ జలపాతం:

కుద్లు తీర్థ జలపాతం:

P.C: You Tube

ఉడుపి నుండి 42 కి.మీ. దూరంలో ఉన్న హైబ్రి వద్ద కుద్లు తీర్థ జలపాతం ఉంది. 126 అడుగుల ఎత్తు నుండి ప్రవహించే ఈ జలపాతం, నేరుగా సరస్సులోకి దూకుతుంది. మునులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడానికి ఇక్కడకు వచ్చేవారు కనుక, ఈ చెరువు పవిత్రమైనదని స్థానికులు నమ్ముతారు. ఈ జలపాతం దూరంగా విసిరేసినట్లు ఉంటుంది కనుక, ఇక్కడ పర్యటించేటప్పుడు తోడుగా గైడ్ ను వెంట తీసుకుని వెళ్లడం మరువకండి. ట్రెక్కింగ్ మార్గంలో, అన్ని అటవీ ప్రాంతాలకు మల్లే జలగలు అధికంగా ఉన్నందున, వాటి బారినుండి తప్పించుకోవడానికి ఉప్పును తీసుకుని వెళ్ళటం మరువకండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X