Search
  • Follow NativePlanet
Share
» » మైసూరు దసరా - పర్యాటక ఆకర్షణలు ...!

మైసూరు దసరా - పర్యాటక ఆకర్షణలు ...!

మైసూరు దసరా ఉత్సవ వేడుకలు దేశం లోనే కాక విదేశాలలో సైతం ఖ్యాతి గాంచాయి. కర్నాటక రాష్ట్రం లోని మైసూరులో కల రాజ భవనాలు, అందమైన తోటలు, పెద్ద పెద్ద నీటి ఆనకట్టలు మైసూరు నగరాన్ని మరువ లేనిది గా చేస్తాయి. కర్నాటక రాష్ట్ర ‘రాచ నగరం' గా మైసూరు ను వర్ణిస్తారు. నేటికి మైసూరు రాజ వంశ పాలకుల కుటుంబ సాంప్రదాయాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ లో జరిగే దసరా వేడుకల లో అట్టహాసంగా ప్రదర్శించ బడతాయి. ఈ ‘దసరా' పండుగ వేడుకలను చూసేందుకు, దేశం లోని వివిధ ప్రాంతాలనుండే కాక ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు తరలి వస్తారు

అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు, మైసూరు నగరం పండుగ వాతావరణం సంతరించుకొంటుంది. మైసూరు ఈ సమయం లో చాలా మంది తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో కూడా పర్యటిస్తారు. మరి ఇక్కడ వారు చూసేందుకు దసరా వేడుకలే కాక నగరంలో వినోదాన్ని, ఆనందాలను కలిగించే అనేక ఇతర ఆకర్షణలు కూడా కలవు. అందుకు గాని మైసూరు పట్టణం లోని కొన్ని ప్రదేశాలను గురించి వివరిస్తున్నాం పరిశీలించండి.

మైసూరు లోని జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ .

ఈ పార్క్ నగర ప్రధాన ఆకర్షనలలో ఒకటి. పర్యాటకులకు అనేక అంశాలు అందిస్తుంది. జి ఆర్ ఎస్ పార్క్ లో వాటర్ మరియు ల్యాండ్ వినోదాలు కలవు. జల తరంగ , కిడ్స్ పూల్, ఆక్వా టొర్నాడో రైడ్, లేజి రివర్, డ్రా గన్స్ డెన్, 5 డి వర్చువల్ రైడ్ వంటివి ఎన్నో కలవు. టూరిస్ట్ లకు ఈ ఫాంటసీ పార్క్ తప్పక అంతులేని ఆనందాలను అందిస్తుంది. ఈ జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ వారం రోజులలో ఉదయం 10.30 గం నుండి సాయంత్రం 6 గం. వరకు మరియు వారాంతం లోని, సెలవు దినాలలో ఉదయం 10.30 గం. నుండి రా. 7 గం. వరకు తెరచి వుంటుంది.

‘బ్లూ లగూన్ '
మరొక ఆకర్షణ అయిన ‘బ్లూ లగూన్ ' కే ఆర్ ఎస్ డాం నుండి 2 కి. మీ. కల దూరం లో కలదు. ఇది డాం బ్యాక్ వాటర్స్ తో ఏర్పడి ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. స్నేహితులతో, లేదా కుటుంబ సభ్యులతో సందర్శనకు ఇది ఒక మంచి పిక్నిక్ ప్రదేశం. ఫోటోగ్రఫీ ప్రియులకు ఈ ప్రదేశం మరింత ఆకర్షణ.

బలమురి - ఎడ మురి జలపాతాలు

 మైసూరు దసరా - పర్యాటక ఆకర్షణలు ...!

బలమురి - ఎడ మురి జలపాతాలు కే ఆర్ ఎస్ మెయిన్ రోడ్ లో కలవు. ఈ రెండు జలపాతాలు మైసూరు నగరానికి 3 కి. మీ. ల దూరం లో కలవు. మైసూరు వచ్చే సందర్శకులకు బలమురి - ఎడ మురి జలపాతాలు అక్కడ కల అనేక సుందర దృశ్యాలతో ఒక ప్రధాన ఆకర్షణ. ఈ ప్రదేశం వారాంతపు విహారాలకు లేదా పిక్నిక్ లకు అనుకూలంగా వుంటుంది. ఎగిసి పడే నీటి ధారలు, చుట్టూ కల పచ్చదనం నిజానికి ఈ ప్రదేశం ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X