Search
  • Follow NativePlanet
Share
» »మహా మహిమాన్విత శక్తి పీఠము జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయంలోని రహస్యాలు !

మహా మహిమాన్విత శక్తి పీఠము జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయంలోని రహస్యాలు !

By Venkatakarunasri

ఈ గ్రామంలో 75 ఇళ్లుంటే 45 మంది IAS !ఈ గ్రామంలో 75 ఇళ్లుంటే 45 మంది IAS !

గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా జొన్నవాడ కామాక్షి తల్లిని భక్తులు పేర్కొంటుంటారు. నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణానికి సమీపంలో వెలసిన జొన్నవాడ క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడుతుంటుంది. తమ కోర్కెలను ముడుపుగా కడితే అమ్మ అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. పవిత్ర పెన్నా నది తీరాన ఈ క్షేత్రం కొలువై ఉంది. ఈ క్షేత్రంలో కొలువైన పార్వతీదేవిని కామాక్షి తాయిగాను, శివుని మల్లికార్జునిడిగాను పిలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు ఈ క్షేత్రంలోని కామాక్షీ తల్లిని పిలుస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు లేనివారు ఈ క్షేత్రంలోని కామాక్షి తల్లిని సేవిస్తే తప్పక పిల్లలు పుడతారని భక్తుల విశ్వాసం.

ఇందుకోసం ఈ ఆలయంలో ఇచ్చే కొడిముద్దలను స్వీకరించడానికి పిల్లలు లేని భక్తులు బారులు తీరుతుంటారు. కామాక్షి తల్లికి జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ నిర్వహించే సమయంలో బియ్యం, పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని అందరి దేవతలకు నివేదించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. దీనినే కొడిముద్ద అంటారు. ఈ కొడిముద్దను స్వీకరించి భుజిస్తే తప్పకుండా పిల్లలు పుడుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ద్వజారోహణ సమయంలో కూడా ఈ కొడి ముద్దలు ఇస్తుంటారు. దీంతోపాటు సంతానం కోసం వేడుకునే భక్తులు జొన్నవాడలో వరపడటం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.

ఇది కూడా చదవండి: హాయి.. హాయిగా.. చల్ల.. చల్లగా.. నెల్లూర్ బీచ్ లో సందడి చేద్దాం రండి !

ఇందులో భాగంగా దేవాలయానికి సమీపంలో ఉన్న పెన్నా నదిలో స్నానం చేసి తడిబట్టలతో అమ్మవారిని సేవిస్తారు. ఇలా తమ కోర్కె నెరవేరేవరకు చేస్తుంటారు. పురాణ ప్రసశ్త్యం ఉన్న ఈ క్షేత్రాన్ని ఆదిశంకరులవారు ప్రతిష్టించినట్టుగా పురాణాలు పేర్కొంటున్నాయి. శక్తి క్షేత్రాల్లో ఒకటిగా జొన్నవాడ క్షేత్రం విలసిల్లుతోంది.

జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయంలోని రహస్యాలు !

1. జొన్నవాడ పుణ్యక్షేత్రం

1. జొన్నవాడ పుణ్యక్షేత్రం

దక్షిణ కాశీగా వెలుగొందుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న పవిత్ర పినాకిని నదిలో స్నానమాచరించిన జలం సేవించిన సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం.

pc: Youtube

ఇంద్రలోకాధిపతి

ఇంద్రలోకాధిపతి

ద్వాపరయుగంలో ఇంద్రలోకాధిపతి అయిన దేవేంద్రుడు పదవిని కోల్పోయి వృశపర్వుడనే రాక్షసునిచే బాధింపబడ్డాడు.

pc: Youtube

3.రాక్షసబాధలు

3.రాక్షసబాధలు

అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడకు చేరిన ఇంద్రుడు పెన్నానదిలో స్నానమాచరించి కామాక్షితాయిని సేవించడంతో పునీతుడవ్వడమేకాకుండా రాక్షసబాధల నుంచి కూడా విముక్తుడైనాడు.

pc: Youtube

కామాక్షితాయి

కామాక్షితాయి

పార్వతీదేవి ప్రతిరూపమై పరమశివుని ఇష్టసఖియై అష్టలక్ష్మిలకు అప్పచెల్లెలై భక్తుల పాలిట కల్పవల్లియై విరాజిల్లుతోంది జొన్నవాడ కామాక్షితాయి.

pc: Youtube

5. పెన్నానది

5. పెన్నానది

శ్రీ పొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్లెం మండలం జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నానధి తీరాన కొలువై శరణుజొచ్చిన వారి కోర్కెలు ఈడేర్చుతూ భక్తుల కొంగుబంగా రంగా విరాజిల్లుతోంది.

pc: Youtube

6. యజ్ఞానికి అనువైనది

6. యజ్ఞానికి అనువైనది

ప్రజాపతులలో శ్రేష్ఠుడైన శ్యప ప్రజాపతి యజ్ఞమాచరించాలని దక్షిణ భారత యాత్ర నిర్విహంచారు.పవిత్ర పినాకినీ (పెన్న) నదికి ఉత్తర దిక్కున ఉన్న రజతగిరి ప్రాంతాన్ని యజ్ఞానికి అనువైనదిగా భావించి దక్షణాగ్ని, ఆహావనియాగ్ని, ఆరస్పత్యాగ్ని అను మూడు అగ్ని కుండలాలను ఏర్పాటు చేశారు.

pc: Youtube

7. స్వయంభు

7. స్వయంభు

కశ్యపుని యజ్ఞయాగానికి పర్వశించిన పరమశివుడు యజ్ఞగుండం నుండి స్వయంభుగా ఉద్భవించి నట్లు స్కందపురాణంలో చెప్పబడివుంది. అప్ప టి యజ్ఞవాటిక జన్నాడ నేడు జొన్నవాడగా ప్రసిద్ధి గాంచింది.

ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం - శ్రీకాళహస్తి !

pc: Youtube

8. బిందుబింబంగా అమ్మవారు

8. బిందుబింబంగా అమ్మవారు

స్వామి కైలాసంలో కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన పార్వతిదేవి పతిదేవుడిని వెతుకుతూ జొన్నవాడకు చేరింది. అక్కడ కొలువై ఉన్న స్వామి తనతో వుండమని కోరగా భర్త కోరిక మేరకు నీటిబొట్టుగా మారి శిలా రూపం దాల్చింది.

ఏపీలో నోరూరించే వంటలు ఎక్కడ తినాలి ?

pc: Youtube

9. పెన్నానది

9. పెన్నానది

అనంత కాలంలో జాలర్ల వలలో చిక్కిన అమ్మవారి శిలావిగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్టించి సేవించనారంభించారు.

నెల్లూరు ...దేవాలయాలు, ప్రకృతి దృశ్యాలు !

pc: Youtube

10. కైలాసగిరి

10. కైలాసగిరి

నాలుగోశతాబ్దంలో హిమాలయాల్లోని కైలాసగిరికి వెళుతున్న ఆదిశంకరాచార్యులు పెన్నలో పూజలందుకుంటున్న అమ్మవారిని లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరిదేవిల అంశగా గుర్తించి కోవెలలో ప్రతిష్టించారు.

ప్రకృతిలో మమేకమైన చిత్తూర్ సోయగాలు !!

pc: Youtube

11. కామాక్షి విలాసం

11. కామాక్షి విలాసం

అప్పటి నుంచి పరమేశ్వరుడు మల్లిఖార్జున స్వామి గాను పార్వతి దేవి కామాక్షితాయిగాను భక్త కోటి పూజలందుకుంటున్నారని అష్టాదశ పురాణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని కామాక్షి విలాసం పేర్కొంటోంది.

pc: Youtube

12. పినాకిని తీర్థం సర్వపాపహరణం

12. పినాకిని తీర్థం సర్వపాపహరణం

త్రేతాయుగంలో కుష్ఠువ్యాధిగ్రస్తుడైన అశ్వత్థామ పినాకినిలో స్నానం చేసి స్వస్తత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కవిబ్రహ్మ తిక్కన సోమ యాజి భారత గ్రంథ తెనిగీకరణను ఇక్కడి నుంచే ప్రారంభించి నట్లు చెబుతారు.

ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం - శ్రీకాళహస్తి !

pc: Youtube

13. ప్రసిద్ధిచెందిన జొన్నవాడ క్షేత్రం

13. ప్రసిద్ధిచెందిన జొన్నవాడ క్షేత్రం

పురాణ కాలం నుంచి ప్రసిద్ధిచెందిన జొన్నవాడ క్షేత్రం దుర్వాసముని శాపానికి గురై 5 శతాబ్ధాలు పూజాపునస్కారాలకు నోచు కోలేదు. దీంతో ఆలయ ప్రాంగణం ఇసుక మేట వేసింది.

గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?

pc: Youtube

14. ఆలయ పునరుద్ధరణ

14. ఆలయ పునరుద్ధరణ

13వ శతాబ్ధంలో మనుమసిద్ధి మహారాజు ఆలయ పునరుద్ధరణ గావించినట్లు తాళపత్ర గ్రంథాల ద్వారా అవగత మవుతుంది.

మతసామరస్యానికి ప్రతీక .. రొట్టెల పండగ !

pc: Youtube

15. కనులపండువ

15. కనులపండువ

శైవాగమ సంప్రదాయ ఉత్సవాలు ఆలయంలో శైవాగమ సంప్రదాయ రీతిలో పూజాదికాలను నిర్వహిస్తారు. ప్రతి వైశాఖ బహుళ షష్ఠి నుండి అమావాస్య వరకు స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపం డువగా జరగుతాయి.

pc: Youtube

16. భక్తులే దాతలు

16. భక్తులే దాతలు

9 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూల ల నుండే గాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తు న్నారు.

నెల్లూరులో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు !

pc: Youtube

17. స్నప్నదర్శనం

17. స్నప్నదర్శనం

ఆలయ కార్యనిర్వాహణాధికారి వేగూరు రవీంద్రారెడ్డి, ప్రధాన అర్చకులు వారణాసి వెంకట శివగంగా ప్రసాద్‌ లు కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. అవివాహితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలతో తల్లడిల్లేవారు పావన పినాకినిలో తీర్థ మాడి మూడు రోజుల పాటు ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్నప్నదర్శనం ద్వారా కటాక్షించి కోర్కెలు ఈడేరుస్తారని భక్తుల నమ్మిక.

pc: Youtube

18. సంతానప్రాప్తికి కొడిముద్ద...

18. సంతానప్రాప్తికి కొడిముద్ద...

సంతానం లేనివారు అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిదిరోజుల పాటు దీక్షపూని ధ్వజస్తంభ ప్రసాదమైన కొడిముద్దను ఫలహారంగా స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

ఆంధ్రప్రదేశ్ బీచ్ లు ... వారంతపు విహారాలు!!

pc: Youtube

19. పెద్దస్థాయి సౌకర్యాలు

19. పెద్దస్థాయి సౌకర్యాలు

దేవాలయం ప్రాంగణంలో కామాక్షితాయి, మల్లిఖార్జుని సన్నిధులు ఉన్నాయి. అలాగే ఇతర దేవతలు సైతం ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. విశాలంగా ఉండే ఈ ఆలయ పరిసరం భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఆలయం వెలుపల చిన్నపాటి దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెద్దస్థాయి సౌకర్యాలు మాత్రం ఇక్కడ లేవనే చెప్పవచ్చు.

pc: Youtube

వసతి సౌకర్యాలు

వసతి సౌకర్యాలు

సౌకర్యవంతమైన వసతి కావాలంటే మాత్రం దగ్గర్లో ఉన్న నెల్లూరుకు చేరుకోవాల్సిందే. నెల్లూరు నుంచి జొన్నవాడకు కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రమైనందున ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

భక్తుల కోర్కెలను తీర్చే ఘటిక సిద్దేశ్వర స్వామి !

pc: Youtube

21. ఆలయం తెరచు వేళలు

21. ఆలయం తెరచు వేళలు

ఉదయం 6:00 గం.ల నుండి మధ్యాహ్నం 12:30ని ల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30ని ల వరకు.

సెలబ్రెటీలు - దత్తత గ్రామాలు !

pc: Youtube

22. ఎలా వెళ్ళాలి

22. ఎలా వెళ్ళాలి

రైలు సౌకర్యం - నెల్లూరు రైల్వే స్టేషన్

బస్సు సౌకర్యం - నెల్లూరు బస్ కాంప్లెక్స్ నుండి బస్ కలదు.

జిల్లా కేంద్రం నుంచి జొన్నవాడ 8 కి.మీ దూరంలో వుంది. నెల్లూరు ములుమూడి బస్టాండు నుంచి ఇరుకళల పరమేశ్వరి ఆలయం మీదుగా వెళ్లవచ్చు. లేదా వెంకటేశ్వరపురం, బుచ్చిరెడ్డిపాళెం మీదుగా చేరుకోవచ్చు.

పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం !

pc: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X