Search
  • Follow NativePlanet
Share
» »జైసల్మేర్ లోని తన్నోట్ మాతా ఆలయం - అంతుచిక్కని రహస్యాలు

జైసల్మేర్ లోని తన్నోట్ మాతా ఆలయం - అంతుచిక్కని రహస్యాలు

తన్నోట్ మాతా ఆలయం భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్ జిల్లాలో వుంది. పురాతన చరణ్ సాహిత్యం ప్రకారం తన్నోట్ మాతా యొక్క రూపాలు హింగ్లాజ్ మాత, కర్ని మాత మరియు చరణ్ యొక్క దేవత అని పిలుస్తారు.

By Venkata Karunasri Nalluru

తన్నోట్ మాతా ఆలయం భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్ జిల్లాలో వుంది. పురాతన చరణ్ సాహిత్యం ప్రకారం తన్నోట్ మాతా యొక్క రూపాలు హింగ్లాజ్ మాత, కర్ని మాత మరియు చరణ్ యొక్క దేవత అని పిలుస్తారు. తన్నోట్ గ్రామం పాకిస్తాన్ సరిహద్దుల దగ్గరగా వుంది. అంతేకాకుండా 1971 నాటి భారత-పాకిస్తాన్ యుద్ధం జరిగిన లొంగేవాలా అనే ప్రదేశానికి చాలా దగ్గరలో వుంది. పర్యాటకులు ఈ ఆలయం మాత్రమే కాకుండా ఇండో-పాక్ సరిహద్దు చూడటానికి తప్పకుండా మిలిటరీ అధికారుల నుంచి ముందుగానే సంబంధిత డాక్యుమెంటేషన్ పొందాలి. ఇది ఇప్పుడు భారతదేశంలో ఒక పర్యాటక కేంద్రంగా వుంది. ఈ ప్రాంతంలో చమురు మరియు వాయువు నిల్వలు కలిగివున్నవని చెబుతారు.

జైసల్మేర్ లోని తన్నోట్ మాతా ఆలయం

1. చరిత్ర

1. చరిత్ర

ఇది 1965 ఇండో-పాక్ యుద్ధం సమయంలో పాకిస్తానీ సైన్యం ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ ప్రాంతం మీద 3000 బాంబులు పేల్చింది. కానీ మాతా ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదు.

చిత్రకృప: Paulrudd

2. తన్నోట్ మాతా

2. తన్నోట్ మాతా

యుద్ధం తరువాత పాకిస్తానీ జనరల్ నిజానికి ఈ సంఘటన గురించి మరియు ఈ ప్రాంతంలో వున్న ఆలయాన్ని రక్షించిన శక్తి ఒకటి వుంది. దీని గురించి తెలుసుకొనుటకు ఈ స్థలం చూడటానికి భారతదేశానికి వచ్చారు.

చిత్రకృప: Suresh Godara

3. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

3. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

యుద్ధం తరువాత ఆలయ నిర్వహణ వారి అభ్యర్థన మేరకు భారతదేశం యొక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి ఆలయాన్ని బిఎస్ ఎఫ్ సైనికులు నిర్వహిస్తున్నారు.

చిత్రకృప: Suresh Godara

4. మ్యూజియం

4. మ్యూజియం

పాకిస్తానీ ట్యాంకులు ఆలయం మీద వేసిన పేలని బాంబులు సేకరణలు కలిగిన మ్యూజియం కూడా ఇక్కడ ఉంది.

చిత్రకృప: Suresh Godara

5. ఇండియన్ ఎయిర్ ఫోర్స్

5. ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ఈ ప్రాంతంలో 1971 లో పాకిస్తాన్ మరియు భారతదేశం యుద్ధం జరిగినప్పుడు మళ్ళీ 4 రోజులు పాకిస్తాన్ అన్ని ట్యాంకులు ఇసుకలో నిలిచిపోయాయి. కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సులభంగా బాంబు దాడులు చేయగల్గినది.

చిత్రకృప: Suryansh Singh (DarkUnix)

6. పాకిస్తాన్ ట్యాంకులు

6. పాకిస్తాన్ ట్యాంకులు

పాకిస్తాన్ ట్యాంకులు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నా కూడా ఒక్క అంగుళం కూడా తరలించడానికి కుదరలేదు. 200 పైగా పాకిస్తానీ ట్యాంక్ దళాలు ఇక్కడ మరణించారు.

చిత్రకృప: Suresh Godara

7. క్రీ.శ 1965 నుంచి క్రీ.శ 1971

7. క్రీ.శ 1965 నుంచి క్రీ.శ 1971

ఈ ఆలయం సరిహద్దు కేంద్రం నుంచి 10 కి.మీ మాత్రమే వున్నది కనుక ఈ ప్రాంతంలో వున్న రక్షణ సైన్యం, బిఎస్ఎఫ్ సైనికులు ఇప్పటికీ ఈ ఆలయం వద్ద ఆగి వారి వాహనాలను సురక్షితంగా వుండటానికి నుదురు మీద అక్కడ వున్న ఇసుకను ధరించి ప్రయాణిస్తారు. ఈ పురాణం క్రీ.శ 1965 నుంచి క్రీ.శ 1971 ప్రాంతంలో జరిగింది.

చిత్రకృప: Suryansh Singh (DarkUnix)

8. తన్నోట్ గ్రామ జనాభా

8. తన్నోట్ గ్రామ జనాభా

ఈ ప్రాంతంలో దాడి జరిగితే ప్రతి శత్రు సైనికుడు చంపబడ్డాడు. ఇది వాస్తవంగా జరిగిన ఒక రికార్డ్. తన్నోట్ గ్రామ జనాభా 492 మంది వున్నారు. ఈ ప్రదేశం పాకిస్థాన్ సరిహద్దులో వున్నది ఒక సారవంతమైన భూమి. ఇక్కడ శత్రువు దాడులు సంభవిస్తుంటాయి.

చిత్రకృప: Suresh Godara

9. మందుపాతరలు

9. మందుపాతరలు

రెండు దేశాల ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో మందుపాతరలు నాటించారు. ఒంటె వంటి జంతువులు ఈ పరికరాల భారిన పడుతున్నాయి.

చిత్రకృప: Suresh Godara

10. ఆలయం చేరుకోవటం ఎలా

10. ఆలయం చేరుకోవటం ఎలా

ఆలయం జైసల్మేర్ నగరం నుండి 153 కిలోమీటర్లు (95 మైళ్ళు) వుంది. చేరుకోవడానికి సుమారు రెండు గంటలు పడుతుంది.

చిత్రకృప: Suresh Godara

11. ఇంధన ప్రాజెక్టులు

11. ఇంధన ప్రాజెక్టులు

ఈ ప్రాంతంలో అధిక వేగంగా గాలులు వీస్తాయి. ఫలితంగా ఇప్పుడు ప్రాంతంలో పవన ఆధారిత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో వున్నాయి.

చిత్రకృప: wikimedia.org

12. ఇసుక దిబ్బలు మరియు ఇసుక పర్వతాలు

12. ఇసుక దిబ్బలు మరియు ఇసుక పర్వతాలు

తన్నోట్ రహదారి గుండా చుట్టూ కొన్ని మైళ్ళ వరకు ఇసుక దిబ్బలు మరియు ఇసుక పర్వతాలు వున్నాయి.

చిత్రకృప: wikimedia.org

13. సందర్శన చేయగల సమయం

13. సందర్శన చేయగల సమయం

నవంబర్ నుండి జనవరి నెలల వరకు సందర్శించవచ్చును.

చిత్రకృప: Suryansh Singh (DarkUnix)

14. రాజస్థాన్

14. రాజస్థాన్

ఈ ప్రదేశం రాజస్థాన్ లో థార్ ఎడారిలో చూడగల ఉత్తమ ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం బోర్డర్ వుంది.

చిత్రకృప: Suryansh Singh (DarkUnix)

15. రాంగడ్ గ్రామం

15. రాంగడ్ గ్రామం

ఉష్ణోగ్రతలు అత్యధికంగా లేనప్పుడు అనగా నవంబర్ నుండి జనవరి నెలల వరకు సందర్శించవచ్చును. టాక్సీలలో ప్రయాణం చేయవచ్చును. తనోట్ మార్గంలో రాంగడ్ గ్రామం తర్వాత బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్వర్క్ తప్ప ఇంక ఏ నెట్వర్క్ కవరేజ్ వుండదు. పబ్లిక్ టెలిఫోన్ బూత్లు కూడా అందుబాటులో లేవు.

చిత్రకృప: Suryansh Singh (DarkUnix)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X