» »రోజులో కాసేపు మాత్రమే కనిపించే దేవాలయం ! ఎక్కడుందో మీకు తెలుసా?

రోజులో కాసేపు మాత్రమే కనిపించే దేవాలయం ! ఎక్కడుందో మీకు తెలుసా?

By: Venkata Karunasri Nalluru

రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ గుడిని చూడవచ్చును. మిగతా సమయమంతా ఈ గుడి సముద్రంలోనే మునిగిపోయి ఉంటుంది. ఇంతకీ ఈ గుడి ఎక్కడుంది? అని తెలుసుకోవాలని వుంది కదూ! శివుడు సముద్రంలోనే నివాసమున్నాడు! గుజరాత్‌ లో అరేబియా సముద్రం తీరం వెంబడి ఒకటిన్నర కిలోమీటర్ల లోపలికి ఒక గడ్డమీద నిష్కళంక మహదేవ్‌గా శివుడు వెలసివున్నాడు. ఉదయం, సాయంత్రాల్లో అలలు తగ్గినప్పుడు కొన్ని గంటల సేపు మాత్రమే మనం స్వామిని దర్శించుకోవచ్చును. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలియాక్‌ గ్రామంలో భక్తుల దోషాలనూ, పాపాలనూ తొలగించే దేవుడిగా శివుడు పూజలందుకుంటున్నాడు.

శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా ?

రోజులో కాసేపు మాత్రమే కనిపించే దేవాలయం !

ఈ నెలలో టాప్ 6 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. పాండవులు, కౌరవుల యుద్ధం

1. పాండవులు, కౌరవుల యుద్ధం

పాండవులు మరియు కౌరవుల యుద్ధంలో శ్రీకృష్ణుడి సారథ్యంలో పాండవులు విజయం సాధించారు. ఈ యుద్ధంలో ఎంతోమంది రక్తసంబంధీకులనూ, పెద్దలనూ సంహరించాల్సి రావడం ఆ ఐదుగురు అన్నదమ్ములనూ కలవరపరచింది. ఈ విషయాన్ని కృష్ణుడికి విన్నవించారు.

చిత్రకృప : Bernard Gagnon

2. నల్ల ఆవు, ఒక నల్ల జెండా

2. నల్ల ఆవు, ఒక నల్ల జెండా

శ్రీకృష్ణుడు పాండవులకు ఒక నల్ల ఆవునూ, ఒక నల్ల జెండానూ ఇచ్చాడు. ఆవును వదిలేయమని జెండా పట్టుకొని దాని వెంట నడవమని చెప్తాడు. అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు ఏ ప్రాంతంలో అయితే జెండా రంగూ, ఆవు రంగూ తెల్లగా మారతాయో ఆ ప్రదేశంలో పరమశివుడిని దోష పరిహారం కోసం ప్రార్థించమని చెప్పాడు.

చిత్రకృప : Siddharth Bargate

3. కరిగిపోయిన శివుడు

3. కరిగిపోయిన శివుడు

అంతట పాండవులు ఆ ఆవు వెంబడే నడిచారు. ఒకరోజు సముద్ర తీరం వెంట ఒక నల్ల ఆవు ప్రయాణం సాగించింది. అలా వెళ్తూవున్నప్పుడు ఒకానొక చోట ఆవురంగూ, జెండా రంగూ తెల్లగా మారిపోయాయి. అక్కడే అన్నదమ్ములంతా కూర్చుని శివుడ్ని ధ్యానించారు. అంతట శివుడు కరిగిపోయాడు.

చిత్రకృప : Ice Cubes

4. 5 శివలింగాలు

4. 5 శివలింగాలు

ధ్యానంలో ఉన్న ఆ 5 గురు అన్నదమ్ముల ముందూ శివుడు 5 శివలింగాల రూపంలో ఉద్భవించాడు. పాండవులు ఆ శివలింగాలను చూసి ఆనందాశ్చర్యాలకు గురయ్యారు.

చిత్రకృప : Darshan Trivedi

5. నిష్కళంక మహదేవ్‌

5. నిష్కళంక మహదేవ్‌

భక్తితో పూజించారు. వారి పాపాలను తొలగించేందుకు ఉద్భవించిన శివుడు కనుక ఆయన్ను నిష్కళంక మహదేవ్‌గా కొలుస్తారు భక్తులు.

చిత్ర కృప : Vinoth Chandar

6. ఎలా దర్శించుకోవాలి

6. ఎలా దర్శించుకోవాలి

ఈ ఆలయాన్ని దర్శించుకొనుటకు గుజరాత్‌ భావ్‌నగర్‌ నుంచి కొలియాక్‌ గ్రామానికి వెళ్లాలి. అక్కడి అరేబియా సముద్ర తీరం దగ్గర నిల్చొని చూస్తే సముద్రం లోపలికి దూరంగా రెండు స్తంభాలపై జెండాలు ఎగురుతూ కనిపిస్తాయి. అక్కడే శివుడు వెలసిన ప్రాంతం. అలల పోటు తగ్గినప్పుడు నడుచుకుంటూ ఇక్కడికి చేరుకోవచ్చును.

చిత్రకృప : Pulkit Nakrani

7.ఐదు శివలింగాలూ నంది

7.ఐదు శివలింగాలూ నంది

500 అడుగుల ఎత్తులో విశాలంగా పరచుకున్న నలుచదరపు నేల కనిపిస్తుంది. ఇక్కడే ఐదు శివలింగాలూ నందితో కలిసి వెలసి ఉంటాయి.

చిత్రకృప : Kaushik Patel

8. పాండవ కొలను

8. పాండవ కొలను

అక్కడే ఓ పక్క పాండవ కొలను అన్న పేరుతో చిన్న సరస్సు ఉంటుంది. అందులో కాళ్లు కడుక్కుని స్వామి దర్శనానికి వెళతారు భక్తులు. పక్కనే రెండు జెండా స్తంభాలూ కనిపిస్తాయి. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే ఇక్కడి స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.

చిత్రకృప : gujarat tourism

9. భక్తులు

9. భక్తులు

పౌర్ణమి అమావాస్య సమయాల్లో సముద్రపోటు ఎక్కువగా ఉన్నా వెనక్కు వెళ్లే సమయమూ ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువ మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు.

చిత్రకృప : tamil oneindia

10. దేవాలయ పండుగ

10. దేవాలయ పండుగ

17వ శతాబ్దంలో భావ్‌నగర్‌ మహారాజు భావ్‌సింగ్‌ ఈ ప్రాంతాన్ని భక్తులు పూజ చేసుకునేందుకు వీలుగా కాంక్రీటూ, నాపరాళ్లతో మలచారు. ప్రతి శ్రావణ మాసంలోని అమావాస్యనాడు భాదర్వి పేరుతో ఇక్కడ ఓ వేడుక జరుగుతుంది. దాన్ని దేవాలయ పండుగగా పిలుస్తారు.

చిత్రకృప : tamil oneindia

11. జెండాలు

11. జెండాలు

ఆ రోజు భావ్‌నగర్‌ మహారాజులు ఇక్కడి ధ్వజస్తంభం మీద కొత్త జెండాను ఉంచుతారు. వేడుకగా జరిగే ఈ ఉత్సవానికి వేల మంది భక్తులు వస్తారు. తర్వాత సంవత్సరం మళ్లీ మార్చేదాకా ఆ జెండానే అక్కడ ఉంటుంది. సముద్ర తీరంలో భూకంపం లాంటివి వచ్చిన సందర్భాలతో సహా ఏనాడూ ఈ జెండా అక్కడి నుంచి కదలలేదని స్థానికులు చెబుతారు.

చిత్రకృప : tamil oneindia

12.కౌరవులతో జరిగిన యుద్ధం

12.కౌరవులతో జరిగిన యుద్ధం

బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు రామచంద్రుడు శివుణ్ని అర్చించాడు. అలాగే కౌరవులతో జరిగిన యుద్ధంలో బంధువులను చంపిన పాపాన్ని పరిహారం చేసుకునేందుకు పాండవులూ మహాదేవుడ్నే శరణువేడారు.

చిత్రకృప : tamil oneindia

13. మోక్షం

13. మోక్షం

ఉదయం ఏడు గంటలకూ, సాయంత్రం ఆరున్నర గంటల సమయంలోనూ ఇక్కడ హారతి నిర్వహిస్తారు. ఆ రోజు తిథిని బట్టి హారతి సమయాలు కాస్త అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఇక, ఇక్కడి నీళ్లలో అస్థికలు కలిపితే చనిపోయిన వాళ్లకి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మిక. సముద్రం లోపల, ప్రశాంత వాతారణంలో హరహర మహాదేవ నాదాలు సాయంత్రం మళ్లీ సాగరుడు పలకరించే దాకా రోజూ వినిపిస్తూనే ఉంటాయిక్కడ!

చిత్రకృప : Kaushik Patel

14. భావ్ నగర్ చేరుకోవడం ఎలా ?

14. భావ్ నగర్ చేరుకోవడం ఎలా ?

విమాన మార్గం: భావ్ నగర్ లో విమానాశ్రయం ఉంది. అక్కడి నుండి ముంబై, ఢిల్లీ, గాంధీనగర్, జైపూర్ వంటి అంగరాలకు రెగ్యులర్ గా విమానాలు నడుస్తుంటాయి.

రైలు మార్గం: భావ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా అహ్మదాబాద్, ఓఖా, వడోదర, ముంబై నగరాల నుండి ప్రతిరోజూ రైళ్లు నడుస్తుంటాయి.

రోడ్డు / బస్సు మార్గం: భావ్ నగర్ వ్యాపార నగరం. సమీప పట్టణాల నుండి, సూరత్, రాజ్ కోట్, జామ్ నగర్ ప్రాంతాల నుండి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి.

చిత్రకృప : Trinidade

15. ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

15. ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా మీరు భావ్ నగర్ చేరుకోవాలి. భావ్ నగర్ నుండి బస్సుల్లో లేదా ఆటోల్లో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు.

చిత్రకృప : gujarat tourism

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా? షాకింగ్ నిజాలు !

అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?

Please Wait while comments are loading...