Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ చీటీ పడితేనే పెళ్లి

ఇక్కడ చీటీ పడితేనే పెళ్లి

ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి.

By Beldaru Sajjendrakishore

ద్విభుజ గణపతి స్వామి ఆలయం లేదా గణేశ ఆలయం కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఇడగుంజి పట్టణంలో ఉంది. శరావతి నది ఒడ్డున ఉన్న ఈ ద్విభుజ గణపతి స్వామి ఆలయం త్రేతాయుగం నాటిదని తెలియుచున్నది. దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట చేసినట్లుగా చెబుతారు. ఈ దేవాలయంలో రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనపడతాడు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తులు తాము కోరుకున్నది జరుగుతుందని భావిస్తూంటారు. ఏటా సుమారు పది లక్షల మంది భక్తులు ఈ దేవాలయ సందర్శన కోసం వస్తుంటారు.

అక్కడికి వెళ్లి... ఆ ప్రాంతల రహస్యాల గుట్టు విప్పగలరా...అక్కడికి వెళ్లి... ఆ ప్రాంతల రహస్యాల గుట్టు విప్పగలరా...

శివయ్య తన నెత్తి పై మట్టి తట్టలు మోసింది ఇక్కడే....శివయ్య తన నెత్తి పై మట్టి తట్టలు మోసింది ఇక్కడే....

ఒక్కొ వీకెండ్...ఒక్కో అడవిలోఒక్కొ వీకెండ్...ఒక్కో అడవిలో

ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి. కానీ ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు. శరావతి నది ఇడగుంజికి అతి సమీపంలో ఉన్న హోన్నవర్‌ వద్దనే అరేబియా సముద్రంలో కలుస్తుంది.

1. కలియుగంలో దోషాలను నివారించేందుకు

1. కలియుగంలో దోషాలను నివారించేందుకు

1. కలియుగంలో దోషాలను నివారించేందుకు

Image Source:


కలియుగంలోని దోషాలను నివారించేందుకు ఋషులంతా శరావతినదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతంలో వాలఖిల్యుని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు రాక్షస సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని ఋషులు నిర్ణయించుకున్నారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు.

2. ప్రతి సారీ ఆటంకాలు

2. ప్రతి సారీ ఆటంకాలు

2. ప్రతి సారీ ఆటంకాలు

Image Source:

కానీ యజ్ఞయాగాలు మొదలుపెట్టిన ప్రతిసారి ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో తెలియక ఋషులు నారదుని శరణు వేడారు. అంతట నారదుడు గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే ఎటువంటి విఘ్నాలూ లేకుండానే యజ్ఞం పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. తానే స్వయంగా కైలాసానికి వెళ్లి మరీ గణేశుని యాగశాల వద్దకు తోడ్కొని వచ్చాడు. అక్కడ ఆయన ఉండి యజ్ఞంలు పూర్తి కావడానికి సహకరించాడని చెబుతారు.

3. ఒక చేత మోదకాన్ని

3. ఒక చేత మోదకాన్ని

3. ఒక చేత మోదకాన్ని

Image Source:

ఇక్కడ వినాయకుడు ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం. అందుకే చాలా మంది భక్తులు తమ పెళ్లిల్లు ఎటువంటి ఆటంకాలు జరగకుండా పూర్తి కావాలని కోరడానికి ఇక్కడకు వస్తుంటారు.

4. బంధి జాతి వారు

4. బంధి జాతి వారు

4. బంధి జాతి వారు

Image Source:

ముఖ్యంగా కర్నాటకలోని బంధి అనే జాతివారు ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబాలవారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని శుభసూచకంగా భావించి భావించి వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు.

5. ఎడమ కాలు వద్ద ఉన్న చీటి పడితే

5. ఎడమ కాలు వద్ద ఉన్న చీటి పడితే

5. ఎడమ కాలు వద్ద ఉన్న చీటి పడితే

Image Source:

అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఈ విధమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు. ఇడగుంజి భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఆరు వినాయకుడు ఆలయాలో ఒకటి. అవి కాసర్గోడ్, మంగుళూరు, అనెగుడ్డే, కుండపుర, ఇడగుంజి మరియు గోకర్ణ.

6. విష్ణుమూర్తి ఆలయం

6. విష్ణుమూర్తి ఆలయం

6. విష్ణుమూర్తి ఆలయం

Image Source:

దీనికి దగ్గరగా 1000 సంవత్సరాల కాలం నాటి చరిత్ర కలిగిన విష్ణుమూర్తి ఆలయం కూడా చూడవచ్చును. శ్రీ విష్ణుమూర్తి ఆలయం కర్నాటకలోని ఆలయాల్లో ఒకటి. ఇక్కడ చాలా ప్రశాంతంగా వుంటుంది. ఇడగుంజి సమీపంలోని బల్కుర్ విష్ణుమూర్తి ఆలయానికి అడవి దారుల్లో నడుస్తూ వెళ్ళవచ్చును. ఈ ఆలయం ఇడగుంజి వినాయక ఆలయం నుండి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X