Search
  • Follow NativePlanet
Share
» »నవరసభరితం - కొరియా పర్యాటకం !!

నవరసభరితం - కొరియా పర్యాటకం !!

ప్రకృతి పర్యాటకులను అమితంగా ఆకర్షించే పర్యాటక ప్రదేశం కొరియా. ఇది ఛత్తీస్గర్హ్ రాష్ట్రంలో కలదు. అబ్బురపరిచే జలపాతాలు, అందమైన సైట్ సీఇంగ్ ప్రదేశాలు ఇక్కడ చూడదగ్గవి

By Mohammad

సెంట్రల్ ఇండియాలో ఉన్న చత్తీస్గర్ రాష్ట్రానికి ఉత్తర పశ్చిమాన ఉన్న జిల్లా కొరియా. ఈ జిల్లా యొక్క ప్రధాన పరిపాలనా ప్రాంతం బైకుంత్పూర్. ఉత్తరాన మధ్య ప్రదేశ్ లో ని సిధి జిల్లాతో అలాగే దక్షిణాన కోర్బా జిల్లాతో తూర్పున సుర్గుజ జిల్లాతో అలాగే దక్షిణాన అనుప్పూర్ జిల్లాతో సరిహద్దులు కలిగి ఉంది.

కోర్బా - సాంస్కృతిక వారసత్వ స్థలం !కోర్బా - సాంస్కృతిక వారసత్వ స్థలం !

కొరియా లో మరియు చుట్ట్టు పక్కల పర్యాటక ఆకర్షణలు

ఈ ప్రాంతం అందమైన కొలనులు, నదులు అలాగే ఎత్తైన జలపాతాలతో నీలి ఆకాశంతో అచ్చమైన స్వర్గంలా పర్యాటకులని ఆకర్షిస్తుంది. మనకి దగ్గరగా ఉన్నాయా అనిపించేతట్టుగా ఉండే మబ్బులు సమ్మోహితుల్ని చేస్తాయి. ప్రకృతి ప్రేమికులని ఈ ప్రాంతం అమితంగా ఆకర్షిస్తుంది. స్వర్గం లాంటి ఈ ప్రాంతం ఆనందాన్ని కలిగిస్తుంది. కొరియా లో ని అమ్రిత్ ధారా జలపాతం, రామ్ దాహా జలపాతం ఇంకా గవర్ ఘాట్ జలపాతాలు పర్యాటక ఆకర్షణలలో కొన్ని.

కొరియా - సంస్కృతి

కర్మ, శైల అలాగే సుగా అనబడే మూడు రకాల నృత్యాలని ఇక్కడ వివిధ పండుగలలో జరుపుకుంటారు. దీవాలి, దసరా, అలాగే హోలీ పండుగలు ఈ ప్రాంతం లో ఘనంగా జరుపుకునే ప్రధాన పండుగలు. గంగా దసరా, చర్త, నవఖై మరియు సర్హుల్ వంటి పండుగలు ఇక్కడ జరుపుకునే పండుగలలో కొన్ని.

బిలాస్ పూర్ - మరచిన దేవాలయాలు !బిలాస్ పూర్ - మరచిన దేవాలయాలు !

రామ్ ధార్ వాటర్ ఫాల్స్

రామ్ ధార్ వాటర్ ఫాల్స్

బైకుంత్పూర్ నుండి 160 కిలోమీటర్ల దూరం లో ఉన్న భవర్ఖొహ్ గ్రామం లో బనాస్ నదిపై కొరియా జిల్లాలో ఉన్న సహజ సిద్దమైన జలపాతం రామ్ ధార్ జలపాతం. 100 నుండి 120 అడుగుల ఎత్తుపై నుండి పడే జలపాతం దట్టమైన అడవులు అలాగే కొండలతో కప్పబడి ఉంటుంది.

చిత్రకృప : Kailash Mohankar

గవర్ ఘాట్ వాటర్ ఫాల్స్

గవర్ ఘాట్ వాటర్ ఫాల్స్

తర్రా గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరం లో అలాగే బైకున్త్పూర్ నుండి 40 కిలోమీటర్ల దూరం లో హస్దో నదిపై కొరియా లో ఉన్న సహజసిద్దమైన జలపాతం ఇది. 50 నుండి 60 అడుగుల ఎత్తులో నుండి పడే జలపాతం దట్టమైన అడవులు అలాగే కొండలతో కప్పబడి ఉంటుంది.

చిత్రకృప : Ankitashu

అకురినాల జలపాతం

అకురినాల జలపాతం

ఇది చిన్న జలపాతం. బైకుంత్పూర్ నుండి 65 కిలోమీటర్ల దూరం లో బన్సిపుర్ గ్రామం లో దట్టమైన అడవులు అలాగే కొండలతో ఈ జలపాతం కప్పబడి ఉంటుంది. ఎండాకాలం లో కూడా ఈ ప్రాంతం చల్లగా ఉంటూ సహజ సిద్దమైన ఎయిర్ కండిషనర్ గా ఉంటుంది.

చిత్రకృప : Kailash Mohankar

అమ్రిత్ ధారా ఫాల్స్

అమ్రిత్ ధారా ఫాల్స్

మణేంద్ర గర్ - బైకుంత్పూర్ రోడ్డులో హరనాగ్పూర్ నుండి ఏడూ కిలోమీటర్ల దూరం లో కొరియా జిల్లాలోని హస్దో నదిపైన ఉన్న అందమైన జలపాతం ఇది. దాదాపు 80 నుండి 90 అడుగుల ఎత్తు అలాగే 10 నుండి 15 అడుగుల వెడల్పు కలిగిన జలపాతం ఇది. అందమైన జలపాతం ఇది. ఇక్కడే ఒక శివుడి గుడి ఉంది.

చిత్రకృప : Kailash Mohankar

ఖురియారాని గుహలు

ఖురియారాని గుహలు

ఖురియారాని గుఫా కొరియా దగ్గరలో ఉన్న జష్పూర్ నగర్ లో కలదు. ఇదొక చారిత్రక ప్రదేశం. కోరువా జంజతి పేరుతో ఇక్కడి తెగలను పిలుస్తారు. బగీచా గ్రామము నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు ఉన్నాయి. గుహలో ఖురియా రాణి ఆలయం ఉన్నది.

చిత్రకృప : Theasg sap

గురు ఘసిదాస్ నేషనల్ పార్క్

గురు ఘసిదాస్ నేషనల్ పార్క్

గురు ఘాసిదాస్ నేషనల్ పార్క్ సర్గుజా, కొరియా జిల్లా ల మధ్యలో నెలకొని ఉన్నది. దీనిని 'సంజయ్ నేషనల్ పార్క్' అని కూడా పిలుస్తారు. ఈ పార్క్ కు 1984 వ సంవత్సరంలో నేషనల్ పార్క్ హోదా లభించింది. వివిధరకాల జంతువులను, వలస పక్షులను మరియు వృక్ష సంపదలను చూసి ఆనందించవచ్చు.

చిత్రకృప : Sarath Kuchi

మానస్ భవన్

మానస్ భవన్

బైతున్పూర్ లోని మానస్ భవన్ ఛత్తీస్గర్హ్ సంప్రదాయాలకు, నాటి రాజుల వైభోగాలకు తీపి గుర్తుగా ఉన్నది. ఈ ప్యాలెస్ లో పూర్వం రాజులు ఉండేవారట. ఇక్కడే ఉండి అడవిలో జంతువులను వేటాడేవారట. ప్రస్తుతం ఈ ప్యాలెస్ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నది.

చిత్రకృప : Viren vr

కొరియా లో ఆర్కియోలాజికల్ ప్రదేశాలు

కొరియా లో ఆర్కియోలాజికల్ ప్రదేశాలు

గంగిరాణి, జోగి మఠ్, బాదరా యొక్క రాక్ పెయింటింగ్, ఘాఘ్రా మరియు ఇతరములు చూడదగ్గవి. అంతేకాక జిల్లాలో దారిపొడవునా చిన్న చిన్న జలపాతాలు పర్యాటకులను అలరిస్తాయి.

చిత్రకృప : Ankitashu

వసతి

వసతి

కొరియా ఒక నగరం. ఇక్కడ త్రీ స్టార్, టూ స్టార్ హోటళ్ళు ఉన్నాయి. గదులు సులభంగానే దొరుకుతాయి. స్థానిక వంటలు తప్పక రుచి చూడాల్సిందే!!

చిత్రకృప : Ankitashu

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

విమానాశ్రయం : సమీపంలో రాయ్ పూర్ విమానాశ్రయం కలదు. ఇక్కడికి ఢిల్లీ, ముంబై, భోపాల్, నాగ్ పూర్ నుండి తరచూ విమానాలు వస్తుంటాయి.

రైలు మార్గం : బైకుంత్పూర్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపాన కలదు.

రోడ్డు మార్గం : రాయ్ పూర్, బైకుంత్పూర్ మరియు ఇతర ప్రాంతాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు కొరియా కు తిరుగుతుంటాయి.

చిత్రకృప : Vikassahu60

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X