Search
  • Follow NativePlanet
Share
» »ఆ గరుక్మంతుడి బరువు రహస్యం శాస్త్రవేత్తలకూ అంతుచిక్కడం లేదు.

ఆ గరుక్మంతుడి బరువు రహస్యం శాస్త్రవేత్తలకూ అంతుచిక్కడం లేదు.

కుంభకోణంలోని నాచియార్ దేవాలయం గురించి కథనం

వేల ఏళ్లనాటి ఆ రహస్యానికి తమిళనాడులోని వైష్ణవ ధామం వేదిక. ఒక్క రహస్యమే కాకుండా ఆ దేవాలయంలో ప్రతి విషయం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. మిగిలిన దేవాలయాల కంటే భిన్నంగా అక్కడ అమ్మవారి నడుముకు తాళాల గుత్తి ఉంటుంది.

స్వామివారి కంటే ముందుగా అమ్మవారికే పూజలు, నైవేద్యంలో ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ అమ్మవారు తన భర్త అయిన శ్రీ మహావిష్ణువును కొంగుకు కట్టేసుకున్నారు. అధి వైష్ణవాలయమే అయినా నిర్మాణం మొత్తం శైవ దేవాలయాన్ని పోలి ఉంటుంది.

ఇక్కడ మూల విరాట్టు కంటే ఆయన వాహనమే భక్తులకు వరాలను ప్రసాదిస్తాడు. ముఖ్యంగా వివాహం కాని బ్రహ్మచారులకు ఆయన కొంగు బంగారం. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ దేవాయం గురించిన పూర్తి వివరాలు మీ కోసం...

అమ్మవారికి ప్రాధాన్యం ఎక్కువ

అమ్మవారికి ప్రాధాన్యం ఎక్కువ

P.C: You Tube

నాచియార్ అంటే అర్థం అమ్మవారు. ఇక్కడ స్వామివారు ఉన్నా అమ్మవారి పేరుతోనే ఈ ఆలయంతో పాటు ఈ ఊరు కూడా ప్రసిద్ధి కెక్కింది. ఇక్కడ అయ్యవారి కంటే అమ్మవారికే ప్రాధాన్యత ఎక్కువ. ఇందుకు సంబంధించి ఒక కథ వేల ఏళ్ల నుంచి ప్రచారంలో ఉంది.

విష్ణువును అల్లుడిగా

విష్ణువును అల్లుడిగా

P.C: You Tube

ఈ కథనం ప్రకారం ఈ నాచియర్ ప్రాంతం గతంలో మేధావి అనే మహర్షికి చెందిన ఆశ్రమం. ఆయనకు విష్ణుభగవానుడిని అల్లుడిగా పొందాలని కోరిక ఉండేది. దీంతో ఆయన లక్ష్మీ దేవి కొరకు ఘెర తపస్సు చేస్తాడు.

వంజులా దేవి అని

వంజులా దేవి అని

P.C: You Tube

ఆయన తపస్సుకు మెచ్చిన లక్ష్మీ దేవి ఒక చిన్న పాపక ఆయనకు దర్శనమిచ్చింది. ఆ లక్ష్మీదేవికి వంజులా దేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొంటాడు. ఈ వంజులా దేవి పెరిగిపెద్దదయ్యి యుక్త వయస్సుకు వస్తుంది.

ఐదు రూపాలను

ఐదు రూపాలను

P.C: You Tube

దీంతో లక్ష్మీ దేవిని వివాహం చేసుకోవడానికి సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, వాసుదేవ అనే ఐదు ప్రత్యేక రూపాల్లో భూమి పైకి వస్తాడు. ఈ ఐదు మంది వేర్వేరు దిక్కులకు వెళ్లి అమ్మవారిని వెదకడం ప్రారంభిస్తారు.

 గరుక్మంతుడి వల్ల జాడ తెలుస్తుంది

గరుక్మంతుడి వల్ల జాడ తెలుస్తుంది

P.C: You Tube

అయినా కూడా లక్ష్మీ దేవి వీరికి కనిపించదు. దీంతో విష్ణు భగవానుడు తన వాహనమైన గరుక్మంతుడిని భూమి పైకి వెళ్లి లక్ష్మీ దేవి జాడ తెలుసుకోమని చెబుతాడు. దీంతో గరుక్మంతుడు ఆకాశంలో ఎగురుతూ మేథావి మహర్షి వద్ద పెరుగుతున్న లక్ష్మీ దేవిని గుర్తిస్తాడు.

షరత్తు విధిస్తాడు

షరత్తు విధిస్తాడు

P.C: You Tube

ఈ విషయాన్ని శ్రీమన్నారయణుడికి తెలయజేస్తాడు. దీంతో విష్ణు భగవానుడు నేరుగా మహర్షి దగ్గరికి వెళ్లి తాను లక్ష్మీ దేవిని వివాహం చేసుకొంటానని చెబుతాడు. ఇందుకు అంగీకరించిన మహర్షి ఒక షరత్తు మాత్రం పెడుతాడు.

అమ్మవారి విగ్రహం కొంచెం ముందుకు

అమ్మవారి విగ్రహం కొంచెం ముందుకు

P.C: You Tube

దాని ప్రకారం ఈ క్షేత్రంలో లక్ష్మీ దేవికే అన్ని అధికారాలు ఉండాలని , ఆమె చెప్పినట్లే నడుచుకోవాలని మహర్షి విష్ణుభగవానుడిని ప్రార్థిస్తాడు. ఇందుకు విష్ణువు కూడా సమ్మతిస్తాడు. అందుకు నిదర్శనంగానే ఆలయంలో ని గర్భగుడిలో స్వామివారి విగ్రహం కంటే కొంచెం ముందుకు ఉంటుంది.

మొదటి పూజ అమ్మవారికే

మొదటి పూజ అమ్మవారికే

P.C: You Tube

అంతే కాకుండా ఉత్సవాల సంయంలో అయ్యవారి విగ్రహం కంటే ముందుగా అమ్మవారి విగ్రహం ఊరేగుతుంది. ఇక పూజలు, నైవేద్యం తదితర ప్రక్రియలన్నీ ముందుగా అమ్మవారికి జరిగిన తర్వాతన విష్ణుమూర్తికి నివేదిస్తారు.

నడుముకు తాళాల గుత్తి

నడుముకు తాళాల గుత్తి

P.C: You Tube

ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి నడుముకి తాళాల గుత్తి ఉంటుంది. ఇలా ఓ దేవత నడుముకు తాళాల గుత్తి ఉండటం భారత దేశంలో ఇదొక్కటే అని చెబుతారు. ఇదిలా ఉండగా లక్ష్మీ దేవిని తాను వివాహం చేసుకోవడానికి గరుక్మంతుడు ప్రధాన కారణం.

 గరుక్మంతుడికే

గరుక్మంతుడికే

P.C: You Tube

కాబట్టి ఈ క్షేత్రంలో ఆయనకు కూడా విష్ణువు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. తన బదులు భక్తులను ఆశీర్వదించాల్సిందిగా గరుక్మంతుడిని విష్ణు భగవానుడు సూచించినట్లు చెబుతారు. అందువల్లే ఇక్కడ ఆలయం ముందు ఉన్న గరుక్మంతుడిని కోరుకుంటేనే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.

 త్వరగా వివాహం

త్వరగా వివాహం

P.C: You Tube

ముఖ్యంగా ఇక్కడ గరుక్మంతుడికి గురువారం రోజున ప్రత్యేక పూజలు చేస్తే వెంటనే వివాహం అవుతుందని స్థానిక భక్తుల నమ్మకం. అదే విధంగా సర్పదోష నివారణ, గ్రహాల అనుకూలతలకు కూడా గరుక్మంతుడికి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు.

బరువు పెరగడం

బరువు పెరగడం

P.C: You Tube

అన్నిటి కంటే ముఖ్యంగా ఉత్సవ సమయంలో గరుక్మంతుడి విగ్రహం క్రమంగా బరువు పెరగడం. గుడిలో నుంచి బయటికి వచ్చే సమయంలో నలుగురు మనుషులు ఈ విగ్రహాన్ని మోయగలుగుతారు. అయితే ఈ విగ్రహం గుడి నుంచి దూరంగా వెళ్లే కొద్ది క్రమంగా బరువు పెరుగుతుంది.

4..8..16..32

4..8..16..32

P.C: You Tube

అందుకు నిదర్శనంగా దూరం పెరిగేకొద్ది విగ్రహాన్ని మోసేవారి సంఖ్య 4 నుంచి 8 ఆ పై 16 అటు పై 32 కు పెరుగుతుంది. ఆరు గంటల పాటు సాగే ఈ ఊరేగింపు ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో విగ్రహం బరువు క్రమంగా తగ్గతూ అందుకు అనుగుణంగా విగ్రహాన్ని మోసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది.

చమటతో తడిసి

చమటతో తడిసి

P.C: You Tube

ఇక విగ్రహం పూర్తిగా గుడి లోపలికి చేరుకునే సరికి విగ్రహం పై ఉన్న వస్త్రాలు చెమటతో తడిసి నట్లు తయారవుతాయి. ఇందుకు గల కారాణాలను కూడా వివరిస్తారు. ఇక్కడ అమ్మవారికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది ప్రాథమిక షరస్సు.

శాస్త్రీయ కారణం నిగూడ రహస్యం

శాస్త్రీయ కారణం నిగూడ రహస్యం

P.C: You Tube

అందుకు అనుగుణంగా లక్ష్మి వాహనమైన హంస, గరుక్మంతుడి కంటే వేగంగా వెళ్లలేదు. అందుకే గరుక్మంతుడు అమ్మవారి కన్నా ముందు వెళ్లకుండా అలా బరువు పెరిగి తన నడకని నియంత్రించుకొంటాడని చెబుతారు. అయితే శాస్త్రీయ కారణం మాత్రం ఇప్పటికీ నిగూడ రహస్యమే.

 శివభక్తుడైన చోళరాజు

శివభక్తుడైన చోళరాజు

P.C: You Tube

చోళరాజు కొచెంగనన్ శివ భక్తుడు. ఆయన తన జీవిత కాలంలో 70 శివాలయాలు నిర్మించారు. అయితే విష్ణువు కొచెంగనన్ కు దర్శనమిచ్చి తనకు ఆలయం నిర్మించమని ఆదేశించాడని చెబుతారు. అదే ఇక్కడ ఉన్న ఆలయం. ఈ నాచియార్ ఆలయం చూడటానికి శివుడి ఆలయం వలే కనిపిస్తుంది.

12 ముక్తి ధామాల్లో ఒకటి

12 ముక్తి ధామాల్లో ఒకటి

P.C: You Tube

వైష్ణవులు ముక్తి ధామాలుగా భావించే 12 క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఆలయన ప్రదక్షిణ మార్గంలో దశావతారాల విగ్రహాలు, నరసింహుడు, రంగనాథ స్వామి విగ్రహాలను కూడా మనం చూడవచ్చు. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X