Search
  • Follow NativePlanet
Share
» »నరకాసురుడిని సత్యభామ చంపిన ప్రదేశం ఇదే

నరకాసురుడిని సత్యభామ చంపిన ప్రదేశం ఇదే

నడకుదురులోని శివుడి దేవాలయానికి సంబంధించిన కథనం

By Kishore

దేవుళ్లు, రాక్షసులు బద్ధశత్రువులు. ఒకరి పై ఒకరు పై చేయి సాధించడానికి ఎన్నో వ్యూహాలు పొందారు. అయితే అటు దేవుళ్లతో పాటు ఇటు రాక్షసులతోనూ పూజలు అందుకున్న ఒకే ఒక దేవుడు ఆ పరమశివుడు. బోళాశంకరుడన్న పేరున్న ఆ దేవుడు అడిగిన వెంటనే లేదనుకుండా వరాలు ఇచ్చేస్తాడు. అందువల్లే చాలా మంది రాక్షసులు ఆ దేవుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చని భావించి తపస్సు చేసి వరాలు పొందేవారు. ఆ వర గర్వంతో పొంగిపోయి మునులను, దేవతలను హింసించేవారు.

బ్లాక్ అండ్ వైట్ లో బెంగళూరుబ్లాక్ అండ్ వైట్ లో బెంగళూరు

కేవలం 2,500 టికెట్ ఖర్చుతో వైష్ణోదేవి యాత్ర పూర్తికేవలం 2,500 టికెట్ ఖర్చుతో వైష్ణోదేవి యాత్ర పూర్తి

చివరికి విష్ణువు లేదా బ్రహ్మ కలుగజేసుకుని సదరు రాక్షసులను సంహరించేవారు. ఈ క్రమంలోనే బద్ధ శత్రువులైన శ్రీ కృష్ణుడితో పాటు నరకాసుడు నీలకంఠుడిని ఒకే చోట పూజించారు. అంతే కాకుండా ఇదే ప్రాంతంలో సత్యభామ నరకాసురిడిని వధించింది. ఇక ఈ క్షేత్రంలోని పరమేశ్వరుడిని దర్శిస్తే సంతాన సాఫాల్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.

1. స్థలపురాణం

1. స్థలపురాణం

Image Source:

రాక్షస రాజైన నరకుడి ప్రస్తావన మనకు ద్వాపర యుగంలో కనిపిస్తుంది. ప్రాగ్నోషికపురాన్ని పరిపాలించే నరకుడు శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు.

2. తల్లి చేతిలో తప్ప

2. తల్లి చేతిలో తప్ప

Image Source:

శివుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటే తన తల్లి వల్ల తప్ప మరెవరి చేతను మరణం ఉండకూడదని వరం పొందుతాడు.

3. వేటకు వెళ్లి

3. వేటకు వెళ్లి

Image Source:

ఇదిలా ఉండగా ఒకరోజు నరకుడు వేటకు వెళ్లి పొరపాటున ద్విముఖుడు అనే బ్రాహ్మణుడిని తన బాణంతో చంపేస్తాడు. దీంతో తనకు బ్రహ్మణ హత్య పాతకం చుట్టుకొంటుందని తీవ్రంగా భయపడుతాడు.

4. శుక్రాచార్యుడి వద్దకు

4. శుక్రాచార్యుడి వద్దకు

Image Source:

జరిగిన తప్పును తెలుసుకున్న నరకుడు బ్రాహ్మణ హత్య దోషం నుంచి విముఖత పొందడానికి సహకరించాల్సిందిగా తన గురువే కాకుండా రాక్షస గణానికి గురువైన శుక్రాచార్యుడి వద్దకు వెళ్లి వేడుకుంటాడు.

5. పరిష్కార మార్గాన్ని

5. పరిష్కార మార్గాన్ని

Image Source:

ఆయన బాగా ఆలోచించి ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తాడు. దాని ప్రకారం కృష్ణా నది తీరంలో ప్రస్తుత నడకుదురులో భూమి నుంచి స్వయంగా ఉద్భవించిన శివలింగాన్ని పుష్కర కాలం పాటు అంటే 12 సంవత్సరాలు పూజించడానికి నరకుడు వెలుతాడు.

6. కొద్ది రోజులు మాత్రమే

6. కొద్ది రోజులు మాత్రమే

Image Source:

కొద్ది రోజుల పాటు స్వామివారిని భక్తి శ్రద్ధలతో నరకుడు పూజిస్తాడు. అయితే స్త్రీ లోలుడు, రాక్షస ప్రవృత్తి కలిగిన నరకుడు తన బుద్ధిని మానుకోలేకపోతాడు.

7. బంధీలుగా కూడా

7. బంధీలుగా కూడా

Image Source:

దీంతో కంటికి కనిపించిన మహిళను తన రాజప్రసాదంలోకి బలవంతంగా తీసుకువెళ్లి అనుభవించడమే కాకుండా వారిని బంధీలుగా చేసుకునేవాడు.

9.మొరపెట్టు కొంటారు.

9.మొరపెట్టు కొంటారు.

Image Source:

మునుల ఆశ్రమాలన్నీ తగలబడి పోయేవి. ఇక తాము నడకుదురులో ఉండలేమని భావించినటువంటి మునులు, మహిళలు తమ రాజైన శ్రీ కృష్ణుడికి మొరపెట్టుకొంటారు.

10. సత్యభామ సమేతుడై వచ్చి

10. సత్యభామ సమేతుడై వచ్చి

Image Source:

దీంతో శ్రీ శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతుడై నడకుదురు వచ్చి బంధీలుగా ఉన్న మహిళలను విడిపించి నరకుడితో యుద్ధానికి సిద్ధపడుతాడు.

11.మూర్చపోతాడు

11.మూర్చపోతాడు

Image Source:

అపర బల పరాక్రమ సంపన్నుడైన నరకుడు యుద్ధంలో శ్రీ కృష్ణుడి పై చేయి సాధిస్తాడు. దీంతో శ్రీ కృష్ణుడు యుద్ధంలో కొద్ది సేపు మూర్చపోతాడు.

12.అయినా వదలడు

12.అయినా వదలడు

Image Source:

సాధారణంగా యుద్ధ నియమాలను అనుసరించి మూర్చపోయిన వారి పై ఎదుటి వ్యక్తి ఆయుధం ప్రయోగించకూడదు. రాక్షస ప్రవృత్తి కలిగిన నరకుడు మాత్రం ఈ నియమాలను పక్కనపెట్టి శ్రీ కృష్ణుడి పై విల్లును ఎక్కుపెట్టి బాణం వదలడానికి సిద్ధపడుతాడు.

13.సత్యభామ

13.సత్యభామ

Image Source:

అయితే అక్కడే ఉన్న సత్యభామ వెంటనే విల్లును చేత పట్టి నరకుడితో నడకుదురు వద్ద యుద్ధానికి తలపడుతుంది. ఇద్ధరి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. చివరికి సత్యభామ యుద్ధంలో పై చేయి సాధించి నరకుడిని సంహరిస్తుంది.

14. పూర్వ జన్మలో

14. పూర్వ జన్మలో

Image Source:

పూర్వ జన్మలో సత్యభామ భూ దేవి కాగా, నరకుడు ఆమె కొడుకు. అందువల్లే నరకుడు సత్యభామ చేతిలో చనిపోయాడు. అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట నరకోత్తర క్షేత్రంగా పిలుచారు. కాలక్రమంలో ఇది నడకుదురుగా మారి పోయింది.

15. ఆయన కూడా

15. ఆయన కూడా

Image Source:

ఇక శ్రీ కృష్ణుడు కూడా పరమ శివ భక్తుడైన నరకుడిని సంహరించడం వల్ల కలిగిన దోష నివారణ కోసం కూడా ఈ పృథ్వీశ్వర స్వామిని పూజించాడు.

16. ఇంద్రుడి ఆధీనంలో ఉన్న

16. ఇంద్రుడి ఆధీనంలో ఉన్న

Image Source:

ఇందుకోసం స్వర్గంలో ఇంద్రుడి ఆధీనంలో ఉన్న పూదోట నుంచి పాటలీవృక్షాలను తీసుకు వచ్చాడని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రంలో పాటలీవృక్షాలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి.

17. తర్పణం వదిలాడు

17. తర్పణం వదిలాడు

Image Source:

ఈ పాటలీ పుష్పాలు శివుడికి ఇష్టమైన పుష్పాలుగా పేర్కొంటారు. అంతేకాకుండా నరకుడిక ఈ క్షేత్రంలోనే శ్రీ కృష్ణుడు తర్పణం వదిలాడు. అందువల్లే పిత`దేవతలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తే మంచిదని భక్తులు నమ్ముతున్నారు.

18. పడమర ముఖంగా

18. పడమర ముఖంగా

Image Source:

ఇక్కడ ప్రధాన దేవాలయంలోని పృథ్వీశ్వరస్వామి పడమర ముఖంగా ఉండటమే కాకుండా శ్వేత (తెల్లని) రంగులో ఉంటుంది. ఇక అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భక్తుల మన్నలను అందుకొంటున్నది.

19. వద్దన్నా సంతానం

19. వద్దన్నా సంతానం

Image Source:

ఈ క్షేత్రంలో శివుడికి అమ్మవారికి అర్చన చేయిస్తే సంతానం కలుగుతుందని వివాహం కానివారికి త్వరగా పెళ్లవుతుందని భక్తుల విశ్వాసం. అందువల్లే ఇక్కడకు ఎక్కువ మంది ఈ సమస్యలు ఉన్నవారు వస్తుంటారు.

20.ఈ దేవతలు కూడా

20.ఈ దేవతలు కూడా

Image Source:

ఈ ఆలయ ప్రాంగణంలో వీరభద్రస్వామి, నవగ్రహ మంటపం, గ్రామదేవత వనలమ్మ తల్లి విగ్రహాలు దర్శనమిస్తాయి. కృష్ణ జిల్లా చల్లపల్లి మండలం నడకుదురులో శ్రీ పృథ్వీశ్వర ఆలయం ఉంది.

21.ఇలా వెళ్లవచ్చు

21.ఇలా వెళ్లవచ్చు

Image Source:

విజయవాడ నుంచి ఇక్కడకు 55 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విజయవాడ నుంచి ఇక్కడకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

22. కూచిపూడి మీదుగా

22. కూచిపూడి మీదుగా

Image Source:

కరకట్ట మీదుగా వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సు ప్రతి అరగంటకు ఒకటి అందుబాటులో ఉంటుంది. విజయవాడ నుంచి కూచిపూడి మీదుగా ప్రయాణించి నడకుదురు క్షేత్రానికి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X