Search
  • Follow NativePlanet
Share
» »ఏడాదిలో నాగపంచమి రోజు మాత్రమే తెరిచే దేవాలయం, సందర్శిస్తే సర్పదోషాలన్నీ మాయం

ఏడాదిలో నాగపంచమి రోజు మాత్రమే తెరిచే దేవాలయం, సందర్శిస్తే సర్పదోషాలన్నీ మాయం

ఉజ్జయినీలోని నాగచంద్రేశ్వర దేవాలయం గురించి కథనం.

భారత దేశంలో పాములను ఆరాధించే సంప్రదాయం చాలా ఏళ్లుగా వస్తోంది. ఈ సర్పాలు విషాలను వెదజల్లేవి అయినా కూడా మనం పూజిస్తాం. దీని వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని నమ్ముతారు. ముఖ్యంగా చాలా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. హిందూ పురాణాలు, ధర్మాలను అనుసరించి సర్పాలకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అటువంటి దేవాలయాల్లో విశిష్టమైన దేవాలయాలం నాగచంద్రేశ్వర దేవాలయం. ప్రపంచప్రఖ్యాతి చెందిన అతిపురాతనమైన ఉజ్జయినీ నగరంలో ఈ దేవాలయం ఉంది. నాగపంచమి రోజున మాత్రమే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వీలవుతుంది. రేపు నాగపంచమి నేపథ్యంలో ఈ అరుదైన దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం..

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

ఉజ్జయినీ అన్న తక్షణం మనకు మహాకాళేశ్వర లింగం గుర్తుకు వస్తుంది. భారత దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర లింగం ఉన్న దేవాలయం మూడో అంతస్తులోనే నాగ చంద్రేశ్వర దేవాలయం ఉంది.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం ఏడాదిలో ఒకరోజు మాత్రమే అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ రోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తారు.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ నాగపంచమి అంటే శ్రావణ శుక్ల పంచమి రోజున సర్పరాజు తక్షకుడు ఆలయంలో ఉంటాడని భావిస్తారు. అందువల్లే నాగపంచమి ఒక్కరోజునే ఈ దేవాలయంలోని పరమేశ్వరుడిని లక్షల సంఖ్యలో భక్తులు సందర్శించుకొంటారు.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇక ఈ ఆలయంలో పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకున్న శివపార్వతులను మనం దర్శనం చేసుకోవచ్చు. సాధారణంగా అయితే సర్పం పైన విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

కానీ పరమశివుడు ఇక్కడ మనకు కనిపిస్తాడు. ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వారి ముద్దుల కుమారుడు వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఇలా శివపార్వతులతో పాటు వినాయకుడు కూడా సర్పం పై ఉండటం అరుదైన విషయం.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇటువంటి ప్రతిమ భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరెక్కాడా లేదని చెబుతారు. ఈ ప్రతిమను నేపాల్ నుంచి తెప్పించారని చెబుతారు. ఇందుకు సంబంధించి వేర్వేరు కథలు ప్రచారంలో ఉన్నాయి.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తుశకం 1050లో భోజరాజు ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. ఆయన తర్వాత దాదాపు 600 ఏళ్లకు సింధియా వంశానికి చెందిన రాణోజీ మహారాజ్ క్రీస్తుశకం 1732లో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాడు.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకొంటే సర్పదోషాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అందువల్ల నాగపంచమి రోజున ఉజ్జయినీలోని ఈ నాగచంద్రేశ్వర దేవాలయం లోని పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి జనం పోటెత్తుతారు. విదేశాల నుంచి కూడా వస్తారు.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇక ఇదే దేవాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం కూడా విశిష్టమైనది. ఈ శివలింగంలో స్వయంభువుగా చెబుతారు. మంత్రశక్తితో ఏర్పడిన లింగం అని పురాణాలు చెబుతాయి.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

ప్రపంచంలో ఇలా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగం మరొకటి లేదు. మహాకాళేశ్వరుడిని ఇక్కడ దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఈ శివలింగం తాంత్రిక శక్తిని ఆరాధించే వారికి అతి ముఖ్యమైనదిగా భావిస్తారు.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంటుంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్లి దర్శనం చేసుకొన్నవారు ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడి విజయం సాధిస్తారని చెబుతారు.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జియినీలోని అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. వాటిని అఖండ దీపాలు అని అంటారు. వీటిని దర్శించుకోవడం పుణ్యఫలమని నమ్ముతారు.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇక్కడ మరో విశేషం అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వస్తారు. ఆ శవ భస్మంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. బ్రహ్మసైతం ఈ భస్మపూజ చేశాడని చెబుతారు.

నాగ చంద్రేశ్వర దేవాలయం

నాగ చంద్రేశ్వర దేవాలయం

P.C: You Tube

అందువల్లే ఈ క్షేత్రాన్ని మహాశ్మసానమని పిలుస్తారు. ఈ స్వామిని దర్శించుకుంటే అకాల మ`త్యువు భయం పోతుందని చెబుతారు. ఉజ్జయినీ శక్తి పీఠం కూడా. అందువల్లే ఉజ్జయినీ హిందువులకు పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X