» »నాగనాథ స్వామి దేవాలయం, కీల్పెరుంపల్లం !!

నాగనాథ స్వామి దేవాలయం, కీల్పెరుంపల్లం !!

Written By:

కీల్పెరుంపల్లం దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడు లోని చిదంబరం జిల్లాలో ఉన్న ఒక చిన్న, అందమైన ప్రదేశం. ఇది తిరువెంకడుకి చాలా దగ్గరలో ఉంది మరియు నాగనాథ స్వామి ఆలయానికి ప్రసిద్ధిచెందింది.

ఈ గ్రామ౦ విదేశీ పర్యాటకులలో బాగా ప్రసిద్ధిచెందింది. నిజానికి, చాలామంది పర్యాటకులు ఆవు పాలుతీయడం, వ్యవసాయం చేయడం తోపాటు ఇక్కడ జరిగే రోజువారీ కార్యకలాపాలలో పాల్గొనడానికి ఎక్కువరోజులు ఈ గ్రామంలో ఉండడానికి ఇష్టపడతారు.

నాగనాథ స్వామి దేవాలయం పుంపుహార్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనుక యాత్రికులు పుంపుహార్ చేరుకొని, అక్కడి నుండి ఆటోలో నవగ్రహ ఆలయానికి చేరుకోవచ్చు.

దేవాలయం ప్రవేశం

                                                             దేవాలయం ప్రవేశం

                                                              చిత్రకృప : Rsmn

కేతు విగ్రహం ఉన్న ఆలయ౦ ఈ కీల్పెరుంపల్ల౦ గ్రామంలోని ప్రధాన ఆకర్షణ. ఈ కారణం వల్ల ఈ ఆలయం కేతు ఆలయంగా కూడా ప్రసిద్ది గాంచింది. ప్రజలు కేతుగ్రహాన్ని పూజించడానికి, గ్రహ దోషాలను నివారించుకోవడానికి ఇక్కడికి వస్తారు.

కీల్పెరుంపల్లం గ్రామానికి దగ్గరలోని పూంపుహార్ బీచ్ మరో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ బీచ్ స్థానికులు, పర్యాటకులు వేడిగా ఉన్న రోజున ఇక్కడికి వచ్చే ఇష్టమైన విహార, విశ్రాంతి ప్రదేశం.

కీల్పెరుంపల్లం ఆలయం (లేదా) నాగనాథ స్వామి దేవాలయం

కీల్పెరుంపల్లం కేతుగ్రహానికి చెందినది. అయితే ఈ ఆలయంలో శివుడు, పార్వతీదేవి నాగనాధస్వామి, సుందరనాయకి రూపాలతో కూడా పూజించబడుతున్నారు. కేతువు ఈ ఆలయ ప్రధాన దేవత, ఇక్కడ సగం మనిషి, సగం పాముగా చిత్రించిన దేవుని విగ్రహం ఉంది. జ్యోతిష్ శాస్త్ర చార్ట్ లో కేతువు సరైన స్థానంలో లేడని తెలుసుకున్న ప్రజలు, ఆ దోష నివారణకు గుంపులుగా ఈ ఆలయానికి తరలి వస్తారు.

దేవాలయ గోపురం

                                                          దేవాలయ గోపురం

                                                   చిత్రకృప : Prasannavathani.D

ఈ ఆలయం క్రీశ 12 వ శతాబ్దంలో శివుడికి గొప్ప భక్తులైన చోళ రాజులు స్థాపించారని నమ్ముతారు. ఈరోజు, ఈ ఆలయం తమిళనాడు ప్రజలకు ముఖ్యమైన యాత్ర కేంద్రం, సుందరార్, అప్పార్, సంబంధర్ వంటి గొప్ప సాధువులు ఈ ఆలయాన్ని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు.

తంజావూర్ లో బ్రిహదీశ్వర ఆలయం తో కీల్పెరుంపల్లం ఆలయానికి భూగర్భ సొరంగం ఉందని స్థానికుల నమ్మకం. అయినప్పటికీ, ఈ సొరంగాన్ని అనేకమార్లు తవ్వినప్పటికీ దాని జాడ తెలియలేదు.

పూంపుహార్ బీచ్

పూంపుహార్ తీరం ఒక అందమైన విహార ప్రాంతం. నల్లటి ఇసుకతిన్నేలతో, కావలసినంత నీడతో ఉండే ఈ తీరం సకుటుంబంగా విహారాలకు వెళ్ళడానికి బాగుంటుంది. పట్టణంలోని హడావిడికి దూరంగా ప్రశాంతంగా ఉండే ఆటవిడుపు ప్రాంతం ఇది. ఇక్కడి సముద్ర ప్రాంతం బాగుండక పోవడం వల్ల ఈ నీరు ఈతకు పనికిరావు. అయినప్పటికీ, తీరికగా వినోదకార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ తీరం చాలా అవకాశాలు కల్పిస్తుంది.

పూంపుహార్ బీచ్

                                                             పూంపుహార్ బీచ్

                                                       చిత్రకృప : Kasiarunachalam

కీల్పెరుంపల్లం చుట్టుప్రక్కల ఉన్న ఇతర నవగ్రహ దేవాలయాలు

మిగిన 8 నవగ్రహ ఆలయాలు లేదా స్థలాలు సమీపంలో ఉన్నాయి. అవి తిరునళ్ళార్ (శని), కన్జనూర్ (శుక్రుడు), సూర్యనార్ కోయిల్ (సూర్యుడు), తిరువెంకడు (బుధుడు), తింగలూర్ (చంద్రుడు లేదా కేతువు), అలం గుడి (గురుడు), వైదీశ్వరన్ కోయిల్ (కుజుడు), తిరునాగేశ్వరం (రాహు) దేవాలయాలు సమీపంలో ఉన్నాయి.

పూంపుహార్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ద్వారా

పూంపుహార్ వెళ్ళడానికి సులభమైన మార్గాలలో రోడ్డుమార్గం ఒకటి. నాగపట్టణం వంటి సమీప స్థలాల నుండి రోజువారీ బస్సులు నడుస్తాయి. అదే విధంగా త్రిచి వంటి సమీప ప్రదేశాల నుండి కూడా రోజువారీ బస్సు సర్వీసులు ఉన్నాయి.

రైలు ద్వారా

పూంపుహార్ కి నాగపట్టినం సమీప రైల్వే స్టేషన్. నాగపట్టణం నుండి పూంపుహార్ ప్రయాణానికి బస్సు సరైన ఎంపిక. నాగపట్టణం రైలు ద్వారా అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.

విమానం ద్వారా

148 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉన్న త్రిచి సమీప పట్టణం. తమిళనాడు రాజధాని చెన్నై పూంపుహార్ కి 256 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Please Wait while comments are loading...